* మున్సిపల్ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థులు * చేవెళ్ల 17వ వార్డు నుండి సీపీఐ అభ్యర్థి సాల్రా వెంకటేష్ * సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి వారికీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు
చేవెళ్ల, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ నిరుపేదల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పేదల పక్షాన చేస్తున్న పోరాటాలు ఆకర్శించి పలువురు సిపిఐ పార్టీలో చేరుతున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కే. రామస్వామి అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం చేవెళ్ల ప్రాంతానికి చెందిన సాల్రా వెంకటేష్ పరివేద సత్యం కుక్కుడాల వెంకటేష్ తదితరులు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినారు వీరికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గం ఇన్చార్జి కె.రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ కలిసి వారికి సిపిఐ పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో సిపిఐ పార్టీ నుండి 17వ వార్డు నుండి సాల్రా వెంకటేష్ పోటీలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి ఎన్ఎఫ్ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల.మంజుల, ఒగ్గు సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొమురయ్య భవన్లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురిజేపల్లి సుధాకర్ రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించడం జరిగింది… ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు
భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేయాలి
సిపిఐ పట్టణ కార్యదర్శి సొతుకు.ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్. బి ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని కొమరయ్య భవన్ లో నిర్వహించుకోవడం జరిగింది. సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ కమిటీ సభ్యులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదని మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ తో కలిపి కుట్ర చేస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల పౌరులు అందరు అవగాహన చేసుకోలని కోరారు. భారతరత్న అంబేద్కర్ కృషితోనే రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు, నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, అందరికీ ఓటు హక్కు, పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగ,రాజకీయ హక్కులను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.అంబేద్కర్ కృషి వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మైనారిటీ వర్గ ప్రజలకు న్యాయం చేకూరిందని తెలిపారు.అంబేద్కర్ ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్,నేరెళ్ల జోసెఫ్,వేముల శ్రీకాంత్, యాదగిరి, ఎండి అస్లాం, పీక రవి,గోలి లావణ్య,పొనగంటి లావణ్య,పల్లెర్ల రజిత, పెద్దమాముల సంధ్య, మట్టి నాగమణి, మేద్రపు సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
నర్సంపేటకు చేరుకున్న సిపిఐ బస్సు యాత్ర
నర్సంపేట,నేటిధాత్రి:
కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల బస్సు యాత్ర గురువారం నర్సంపేటకు చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో పంజాల రమేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఐ ఉద్యమిస్తున్నదని పేర్కొన్నారు. అనేక రంగురంగుల జెండాలు వచ్చి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని, ఎన్నికల సమయం లో ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కి దోపిడీ వర్గాలకు పాలకవర్గాల కొమ్ముకాస్తున్నాయన్నారని ఆరోపించారు.
పెదోళ్లకు ప్రభుత్వ విద్య అందుకోవడం లేదని కార్పొరేట్ విద్యా సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారా అందిస్తున్నాయని తెలిపారు.గడిచిన వందేళ్లలో ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత సిపిఐ పార్టీ కే దక్కుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు మాట ఇచ్చి తప్పిందని చెప్పారు.దేశంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని లేకపోతే పాలక పార్టీలు ధనిక , బహుళ జాతి కంపెనీల కొమ్ము కాస్తయి అన్నారు.నర్సంపేట పట్టణంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన గుడిసేవాసులకు నేటికీ పట్టాలు ఇవ్వలేదని ప్రభుత్వాలను దుయ్యబట్టారు.గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం వెనుకబడుటానికి ప్రభుత్వాలే కారణమని ఎరువుల ధరలు పెరిగిన నియంత్రించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు అన్నారు . దేశంలో సమస్యలు పరిష్కారం జరగాలంటే పేదవాని రాజ్యాస్థాపన కోసం పోరాటం చేయక తప్పదని చెప్పారు.ర్రజెండా పార్టీలు ఏకతాటి పైకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చెందే విధంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ నాయకులు రహమాన్, సిపిఐ వరంగల్,హనుమకొండ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శులు ఎస్కే బాష్మియా, కర్రి బిక్షపతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆధార శ్రీనివాస్, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు అయిత యాకయ్య, కందిక చెన్నకేశవులు,అక్కపెళ్లి రమేష్, జిల్లా సమితి సభ్యులు మియాపురం గోవర్ధన్, చింతకింది కుమారస్వామి, అనంతరెడ్డి వీరు నాయక్, గడ్డం నాగరాజు,పిట్టల సతీష్,ఇల్లందుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
భూపాలపల్లి నేటిధాత్రి
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రప్రభుత్వం జరుపుతున్న మావోయి స్టుల ఎన్ కౌంటర్ల పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్య దర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ తో కలిసి శ్రీనివాసరావు మాట్లాడుతూ కగార్ ఎన్ కౌంటర్లపై అనేక అను మానాలు ఉన్నాయని, మావోయిస్టుల ఎన్ కౌంటర్ లపై స్వయంగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక రించి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశా రు. మావోయిస్టులను కోర్టుకు సరెండర్ చేయకుండా టెర్రరిస్టుల మాదిరిగా చంపడం సరికాదన్నారు. అలాగే మావోయిస్టులు కూడా పునరాలోచన చేయాలని, తమ పంథా మార్చుకోవాలని కోరారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని ఇప్పటికే కొందరు బయటికి వచ్చారని, మిగిలిన వారు కూడా తమ పంథా మార్చుకొని కమ్యూనిస్టులతో కలిసి రావాలని కోరారు. దేశం లో బిజెపి ప్రభుత్వం నరహంతక పాలన సాగిస్తూ న్నదని, కేవలం కార్పొరేట్, పెట్టుబడిదారీ శక్తుల కోసమే పనిచేస్తున్నదన్నారు. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి చెందిన రూ.33 వేల కోట్లను ఆదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి పాలన చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చర్య లకు వ్యతిరేకంగా పోరాడేందుకు వామపక్ష ప్రజా తంత్ర శక్తులు బలపడాల న్నారు. అందుకు మావో యిస్టులు కలిసి రావాలని కోరారు. రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ 26 నాటికి సిపిఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ బస్సు జాతాలను నిర్వహిస్తున్నదన్నారు. ఈనెల 15న జోడేఘాట్లో ప్రారంభమైన జాతా భద్రాచలం వరకు కొనసాగుతుందన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే వందేళ్ల సభకు వేలాదిగా తరలి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న లేకున్నా పేదల పక్షాన నిలిచేది కమ్యూనిస్టు పార్టీలేనని అన్నారు. సమావేశంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు మోటపలుకుల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి జి సుధాకర్ రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాథరాజ్ సతీష్, మాతంగి రామచందర్, కొరిమి సుగుణ, నూకల చంద్రమౌళి, నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ గోలి లావణ్య, పొన్నగంటి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా ఈనెల 19న జిల్లాలో నిర్వహించే సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు నవంబర్ 15న ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ ప్రచార జాతా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ లు హాజరవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదిలాబాద్ మంచిర్యాల, గోదావరిఖని, హుస్నాబాద్ హనుమకొండ మీదుగా ఈనెల 19న సాయంత్రం 4:30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి కళాజాత బృందం చేరుకుంటుందని, అదే రోజు 5:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం రాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనే బస చేసి ఉదయం 10 :30 గంటలకు గణపురం నుండి ములుగు జిల్లాకు కళాజాత చేరుకుంటుందని రాజకుమార్ తెలిపారు. కావున జిల్లాలో ఉన్న సిపిఐ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, కూలీలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సిపిఐ కళాజాతాను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారీ బైక్ ర్యాలీ :
ఈనెల 19న సిపిఐ పార్టీ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాతా లో భాగంగా మంజూరు నగర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ ఉంటుందని కళాజాత అతిధులను మంజూరు నగర్ లో భారీ ఆహ్వానం పలికి పైకి ర్యాలీ ద్వారా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మోటపలుకుల రమేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్ ఎండి. అస్లాం నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ప్రచార జాతను జయప్రదం చేయండి – పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నవంబర్15 నుండి జోడేగడ్ లో ప్రారంభమై భద్రాచలం వరకు వెళ్ళు ప్రచార జాత ఈనెల 17న కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని రెండు రోజులపాటు జిల్లాలో నిర్వహించే ప్రచార జాతాలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఐ నగర శాఖ కార్యదర్సుల సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశ రాజకీయ చరిత్రలో వంద సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన పార్టీ లేదని అది కేవలం సిపిఐ ఘనతని ఆయన గుర్తు చేశారు. ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారత దేశంలో విలీనం చేసిన తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ఇప్పుడున్న భారతదేశాన్ని నిర్మించుకోవడానికి వంద సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహించింది సిపిఐ పార్టీ అని కొనియాడారు. వంద సంవత్సరాల పోరాట చరిత్రలో వేలాదిమంది ప్రాణార్పణాలు లక్షలాదిముంది జైలు జీవితం, వేలాదిమంది అజ్ఞాత జీవితం, గడిపారన్నారు. దేశంలోని ప్రజలందరూ అసమానతలు లేని ప్రజలంతా ఒకటేనని సుఖశాంతులతో జీవించే సోషలిజం సమసమాజమే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లక్ష్యం అన్నారు. కానీ నేడు దేశంలో రాష్ట్రంలో ఆర్థిక, కుల, మతoతరాలు ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తున్నాయని అవి రూపుమాపెంత వరకు సిపిఐ ఉద్యమాలు నిర్మిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల కొరకు పుట్టి, ప్రజల కోసం పోరాడుతున్న సిపిఐ ఏనాడు ఓట్లు సీట్లు ముఖ్యం అని భావించలేదని వంద సంవత్సరాలను ఒక్కరోజు అధికారంలో లేకున్నా నిత్యం ప్రజల కోసమే పని చేస్తుందని తెలిపారు. ఈభూమి మీద మనుషులు ఉన్నంతవరకు ఎర్రజెండా, సిపిఐ ఉంటుందని తెలియజేశారు. 17న మధ్యాహ్నం కరీంనగర్ కు జాత చేరుకుంటుందని కరీంనగర్, తిమ్మాపూర్, చిగురుమామిడి 18న సైదాపూర్, హుజురాబాద్ మండలంలో జాత సాగుతుందని జాతలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు కార్యదర్శులు బీర్ల పద్మ, కొట్టే అంజలి, ఎలిశెట్టి భారతక్క, గామినేని సత్యం, కసి బోసుల సంతోష చారి, చంచల మురళి, బాకం ఆంజనేయులు, మాడిశెట్టి అరవింద్, ఆకునూరి రమేష్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ పార్టీ 100 ఏండ్ల ముగింపు సభను జయప్రదం చేయండి..
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సిపిఐ పార్టీ 100 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మం లో జరిగే ముగింపు సభను జయప్రదం చేయాలని, ఈనెల 15 న చోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు జరిగే బస్సు జాతరను జయప్రదం చేయాలని మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు జరిగే బస్సు జాతర కరపత్రాలను రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. బస్సు జాతర కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి మారుపాక అనిల్, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు బస్సు జాతర వెంట ఉంటారని తెలిపారు. శతజయంతి ఉత్సవాలు, ఖమ్మంలో జరిగే ముగింపు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, మనం సత్యనారాయణ, మామిడి గోపి, రాములు, దేవానంద్, చందర్, శంకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాన్యం అంగీకరించిన సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో 2014 నుండి 2023 వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగులు జరగలేదని, రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటనలు చేసేవారని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన అనంతరం వివిధ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగులు నిర్వహించడం జరిగిందని అందులో కొన్ని యాజమాన్యం పరిష్కరించిన పూర్తిస్థాయిలో అమలు పరచడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి దానికి కమిటీ వేసి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. కోల్ ఇండియా మాదిరిగానే పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉందని 9 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 6న అన్ని డిపార్ట్మెంట్లలో మెమోరండాలు నిరసన, ధర్నా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 8న జిఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలను కలుపుకొని దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. 8 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడం జరుగుతుందని సమస్యలను వారికి వివరించి పరిష్కరించకుంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపు నివ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 6, 8న జరిగే ధర్నా, నిరస నలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కార్మికుల కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచి సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు
కేంద్రంపై ఒత్తిడి చేద్దాం రిజర్వేషన్లు సాధించుకుందాం కదలిరండి బీసీ బిడ్డలారా
కేసముద్రం/ నేటి దాత్రి
వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు. శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి. బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి . రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్. తదితరులు పాల్గొన్నారు ,
బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి
బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత
రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..
సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదివ షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి పేరుతో ఏళ్ళ తరబడి బిసిల రిజర్వేషన్ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూ ఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితి లోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు
కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీని భూస్థాపితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరేళ్ల జోసెఫ్, గోలి లావణ్య, యాకుబ్ పాషా, షబీర్ పాషా, రమేష్ చారి, గోనెల తిరుపతి, మట్టి కృష్ణ, పంగ మహేందర్,వాసం రజిత, యాకూబీ తో పాటు పెద్ద ఎత్తున సిపిఐ నాయకులు పాల్గొన్నారు…
సీపీఐ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం గుండా మల్లేష్ ఐదవ వర్ధంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సీపీఐ నాయకుల తో కలిసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిం చాలంటే ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పరితపించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు
టియూడబ్ల్యూజేే జిల్లా ప్రధాన కార్యదర్శి,ప్రజాపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తోట సుధాకర్ మాతృమూర్తి తోట వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం పలువురు సుధాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.ఈ సందర్భంగా హవ్రాను జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చేరుకుని తొలుత తోట వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో సీపీఐ,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు, జర్నలిస్టు నాయకులు ఉన్నారు.పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రంలో కార్యదర్శి ఎన్. రాజమౌళి,వరంగల్ జిల్లా నాయకులు పనాస ప్రసాద్, ల్యాదెళ్ల శరత్,సీనియర్ జర్నలిస్టులు ఎస్.శోభన్ బాబు,వెంకట్,మారుతి, ముత్యాల రఘు, కనకరాజు,పి.కిషోర్ కుమార్,టి.రజినీకాంత్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల రవి తదితరులు ఉన్నారు.
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు మాతృమూర్తి న్యాలపట్ల మల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో గన్నేరువరం మండలం గునుకులకొండాపూర్ గ్రామంలో రాజు నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించిన అనంతరం మల్లవ్వ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గునుకులకొండాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో న్యాలపట్ల మల్లవ్వ పాత్ర ఉందని, గత నలభై సంవత్సరాలుగా వారి కుటుంబమంతా సిపిఐకి అండగా ఉంటున్నారని, తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, ఇందుర్తి శాసనసభ్యులుగా పని చేస్తున్న కాలంలో మల్లవ్వతో, వారి కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మల్లవ్వ చిన్న కుమారుడు రాజు విద్యార్థి యువజన దశ నుండే అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా కొనసాగుతున్నాడని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొని కేసుల పాలై జైలు జీవితం గడిపాడని, నాడు జనశక్తి వారితో ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ గానీ వారి కుటుంబం గానీ మొక్కవోని ధైర్యంతో ఉన్నారని, కుమారునికి ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా మల్లవ్వ ఎంతో ధైర్యంగా ఉండేదని అలాంటి మల్లవ్వ మృతి చెందడం అత్యంత బాధాకరమని వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేయడంతో పాటు అండగా సిపిఐ ఉంటుందని వెంకటరెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల సిపిఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, జాగీరు సత్యనారాయణ, నాగెళ్లి లక్ష్మారెడ్డి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ గన్నేరువరం మండల కార్యదర్శి చొక్కల్ల శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, బూడిద సదాశివ, సీతారాంపూర్ మాజీ సర్పంచ్ గోలీ బాపు రెడ్డి, నవాబుపేట మాజీ ఉపసర్పంచ్ ఎలగందుల రాజయ్య, సిపిఐ మండల నాయకులు మల్లయ్య, శ్రీనివాస్, అంజయ్య, తదితరులు ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.