తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

కోర్టు ఆదేశాల మేరకు రికార్డులో పేరు ఎక్కించి పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం(Abdullapurmet Tehsildar Office) ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కొన్ని ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేటకు చెందిన శంకర్‌రెడ్డి 2000లో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారంలోని సర్వే నంబర్‌ 109,110లో 6 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. అనంతరం 2002లో సదరు భూమిని కొనుగోలు చేసేందుకు పట్టాదారుల వద్ద అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య భూ వివాధం తలెత్తడంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ద్వారా ఫీజు చెల్లించి 2016లో శంకర్‌రెడ్డి 6 ఎకరాలను రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాడు.

దీంతో శంకర్‌రెడ్డి పేరుపై రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు అయి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. మిగతా నాలుగు ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే అప్పటి నుంచి నాలుగు ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుబుక్‌ల కోసం శంకర్‌రెడ్డి కుమారుడు గంగిరెడ్డి గిరిధర్‌రెడ్డి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.కాగా 2022లో ఆమోద డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యం శంకర్‌రెడ్డికి చెందిన 6ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సమర్పించి రికార్డులో శంకర్‌రెడ్డి పేరును తొలగించి ఆమోద డెవలపర్స్‌పై పేరును నమోదు చేయించి పట్టాదారు పాస్‌బుక్‌లను పొందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకర్‌రెడ్డి కుమారుడు గిరిధర్‌రెడ్డి తమకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండా రికార్డుల నుంచి తమ పేర్లు ఎలా తొలగిస్తారని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

సదరు భూమిపై స్టేట్‌సకో ఉండగా రికార్డులో మార్పులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్‌, తహసీల్దార్‌ డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా రికార్డు మార్పులు చేశారని గిరిధర్‌రెడ్డి ఆరోపించారు. మూడు ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగడం లేదని శుక్రవారం గిరిధర్‌రెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బట్టలు విప్పి చెడ్డీపై కూర్చుని నిరసనకు దిగారు. కోర్టు ఆదేశాల మేరకు 6 ఎకరాలకు వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గిరిధర్‌రెడ్డిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నది: తహసీల్దార్‌తట్టిఅన్నారంలోని సర్వే నంబర్‌ 109,110లోని భూమి కోర్టు పరిధిలో ఉన్నది. ప్రస్తుతం దానిపై స్టేటస్‌ కోఆర్డర్‌ ఉన్నది. కేసు కోర్టు పరిధిలో ఉండగా రికార్డులో పేరు మార్చి పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వాలని గిరిధర్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నాడు. వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని గత నెల 21న గిరిధర్‌రెడ్డికి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి.

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి

ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

లేబర్ కోడ్స్ రద్దు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని కనీస పెన్షన్ Rs/- 9000 ఇవ్వాలని, స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనం అమలు చేయాలని హమాలి,బీడీ,భవన నిర్మాణం, ఆటో అండ్ మోటార్,తదితర రంగంలో పనిచేస్తున్న సంఘటిత కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని ఈ.ఎస్.ఐ,ఈ.పి.ఎఫ్, ఇన్సూరెన్స్,సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్లపై మే 20 న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు కార్మిక వర్గనికి పిలుపునిస్తుంది.

అలాగే మే 20న జరగవలసిన సమ్మెను దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని,కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

కానీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో సాధారణ పరిస్థితిలో నెలకొన్న స్థితిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వాయిదా వేయటం సరికాదని ఐ ఎఫ్ టి యు భావిస్తుంది.

ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే కేంద్ర కార్మిక సంఘాలు మే 9న ఢిల్లీలో సమావేశమైన సందర్భంలోనే నాటి నిర్దిష్ట పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కార్మికులకు వాయిదా వేయాల్సిన విషయాన్ని అర్థం చేయించడానికి అవకాశం ఉండేది.దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగి కార్మికులు సమ్మెకు సన్నద్ధమై ఉన్న తరుణంలో అకస్మత్తుగా సమ్మెను వాయిదా వేయడం వలన కార్మికులను నిరాశ నిస్పృహ గురి చేసుకున్నది.

ఈ నిర్ణయం కార్మిక వర్గంలో కార్మిక సంఘాల పట్ల విశ్వాసం సన్నగిల్లడం కోసం దోహదపడుతుంది.

భవిష్యత్తు కాలంలో కార్మిక వర్గం సమ్మెలకు దూరంగా ఉండే ప్రమాదం ఉంటుంది.కేంద్రం మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడిని మరింత ముమ్మరంగా చేయడానికి అవకాశం ఇప్పటికే టోకెన్ సమ్మెలు, ఒక్కరోజు సమ్మె వలన కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై తాగిన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోతున్న తరుణంలో కార్మిక వర్గంలో క్రమంగా మిలిటేన్సిని పెంచుతూ నిరవధిక సమ్మెల వైపు కార్మిక వర్గాన్ని సన్నద్ధం కర్తవ్యాన్ని కలిగి ఉండి కార్మిక సంఘాలు ముందుకు పోవాల్సిన తరుణంలో ఈ తరహా సమ్మేలను కూడా నిర్మాణాత్మకంగా నడపకపోతే కార్మికుల నుండి కార్మిక సంఘాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.సమ్మె వాయిదా పట్ల ఐ ఎఫ్ టి యు కు భిన్నభిప్రాయం ఉన్నప్పటికీ ఐక్య కార్యక్రమం పట్ల ఉన్న గౌరవం ఐక్య ఉద్యమాలకు ఉన్న ప్రాధాన్యత దృశ్య ఐక్య కార్యచరణలో నిర్దేశించుకున్న పద్ధతులకు కట్టుబడి ఉండే సంస్థగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ ఉమ్మడి పిలుపులో మా సంస్థ కూడా భాగస్వామిగా ఉన్నందున మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తూ చేసిన నిర్ణయానికి కట్టుబడి మే 20 న జరగాల్సిన,నిరసన ప్రదర్శన కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్ని జిల్లాల్లో మా సంస్థ అన్ని జిల్లాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐ ఎఫ్ టి యు కార్మికులను విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.

జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు

జర్నలిస్టుల దీక్షలకు “కుమ్మర సంఘం” మద్దతు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

 

తూర్పు జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూములు ఇవ్వకపోవడంతో “ఐదవ రోజుకు” చేరుకున్న దీక్షలు. వారికి సంఘీభావంగా వెళ్ళి దీక్ష శిబిరం వద్ద మద్దతు తెలిపిన తెలంగాణ రాష్ట్ర “కుమ్మర సంఘం” అధ్యక్షుడు ఆకారపు మోహన్. ఈ సందర్భంగా ఆకారపు మోహన్ మాట్లాడుతూ తూర్పు జర్నలిస్టుల కొరకు నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లులను త్వరగా వాటికి కేటాయించాలని కోరుతూ, తెలంగాణ కుమ్మర సంఘం తూర్పు జర్నలిస్టులకు మద్దతు ప్రకటిస్తు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మంత్రి కొండా సురేఖ స్పందించి వీరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వక్స్ సవరణ బిల్లుపై నిరసనలు..

వక్స్ సవరణ బిల్లుపై నిరసనలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కేంద్రం తీసుకొచ్చిన వర్ఫ్ (సవరణ) బిల్లును రాజ్యాంగంపై దాడిగా జహీరాబాద్ నియోజకవర్గానికి ఝరాసంగం న్యాల్కల్ మండలానికి చెందిన సయ్యద్ మజీద్ మొహమ్మద్ యూనుస్ చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ట్యాంక్ బాండ్ వద్ద వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, మతానికి వ్యతిరేకమని, వక్స్ బిల్లును రద్దు చేయాలనీ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version