హలో బీసీ చలో ఇందిరా పార్క్ మహాధర్నాకు కదిలిన డిఎస్పి నాయకులు.
చిట్యాల, నేటిదాత్రి :
హాలో బీసీ ఛలో ఇందిరా పార్క్ (హైదరాబాద్ ) జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు రిటైల్డ్ ఐ ఏ ఎస్ డా. విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు 42%బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ– జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చాలి. అనే డిమాండ్ తో.* హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాన్ని విజయవంతం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిట్యాల మండలం నుండి బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు శీలపాక నాగరాజ్, మండల నాయకులు పుల్ల అశోక్, రత్న రమేష్, చిలుముల కృష్ణ, పర్లపల్లి వంశీ మరియు వంగ రాంబాబు గౌడ్ పాల్గొన్నారు.
బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ.
నర్సంపేట,నేటిధాత్రి:
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బిసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కు దుగ్గొండి బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని గిర్నిబావి గ్రామంలో గల నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నా నిర్వహించి రాస్తారోకో,ర్యాలీ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుకినే రాజేశ్వరరావు, నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు తెలిపామన్నారు.బీసీ రిజర్వేషన్ కులగనన ప్రకారంగా దక్కాల్సిన వాటాన్ని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా విద్యా వైద్య ఆర్థిక రాజకీయ ప్రైవేట్ సెక్టార్ లో ప్రాథమిక హక్కుగా భావించి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బిజెపి పార్టీ చేస్తున్న నాటకాలను బీసీ కులాలు గమనిస్తున్నాయని అన్నారు. వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసేటట్లుగా రెండు పార్టీలు కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహాలు సృష్టిస్తూ ఇతర హామీలు నెరవేర్చకుండా బీసీ రిజర్వేషన్లు తెరపైకి తీసుకొచ్చి ఆడ లేక మధ్యలో ఓడినట్లుగా బీసీ బందులో పాల్గొనడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.పార్లమెంటులో చట్టాలు చేసే బిజెపి పార్టీ కూడా బీసీలపై వారి యొక్క విధానాన్ని ప్రకటించకుండా బీసీ బందుకు మద్దతు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల బంద్ కు ముందు నుండి మద్దతు తెలుపుతుంది.కాంగ్రెస్ పార్టీలోని బీసీ నాయకులు వారి పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి ఒత్తిడి పెంచి రిజర్వేషన్లు రాజకీయపరమైన విధానాలు రూపొందించాలన్నారు. చట్టసభల్లో బీసీ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అమలుపరిచి బిజెపి,కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సత్తా చాటుకోవాలన్నారు లేనియెడల బీసీ ప్రజల యొక్క అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జిలు మాజీ ఎంపీపీ కోమల భద్రయ్య. టిఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నియోజకవర్గం కన్వీనర్, ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్, కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, ఊరటి రవి, శంకేశి కమలాకర్, పెండ్యాల రాజు,గుండెగారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్,బండి జగన్,పిండి కుమారస్వామి, భూంపల్లి రజనీకర్ రెడ్డి. కొల్లూరు మోహన్ రావు, గుండెకారి రవికుమార్, ల్యాండే రమేష్,యూత్ నాయకులు మడతలపాటి కుమార్,మాజీ సర్పంచ్ మోడం విద్యాసాగర్ గౌడ్, కుర్ర మధు, ఓడేడి తిరుపతిరెడ్డి,మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ బందులో పాల్గొన్నారు.
బంధులో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ
మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం రాజుపేట నుండి కమలాపురం వరకు నిర్వహించిన బైక్ లతో ర్యాలీలలో పాల్గొనీ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, బంద్ కు మద్దతు తెలిపారు.ఈ ర్యాలీ లో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పార్టీ సీనియర్ నాయకులు, చిలకమర్రి రాజేందర్, మాలికంఠ శంకర్ , గాదె శ్రీనివాస చారి, గ్రామ కమిటీ అధ్యక్షులు, యాగ్గడి అర్జున్, మునిగేల సాంబులు, పార్టీ నాయకులు లోడి కృష్ణ, పూసల నర్సింహా రావు , నక్క యాకయ్య, యూత్ నాయకులు ముప్పారాపు సందీప్, కేక్కం జగదీష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సామాజిక రాజకీయ పార్టీలు చేపట్టిన తెలంగాణ బంద్ కు ఎంసిపిఐ (యు) సంపూర్ణ మద్దతు తెలిపింది.నర్సంపేట లో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 లో బీసీ రిజర్వేషన్ అంశాన్నిచేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సమాజమంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య పోరాటాలు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు అనుమాల రమేష్ ,బంగారు ముత్తయ్య,అచల,మేడిద ప్రమీల,ఈర్ల అనుష ,మాదాసి రాజు,జి అంజి, సుశీల,శ్రీను,రాములు, ఐలమ్మ, జన్ను నీల,ప్రమీల పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలో…
బీసీ రిజర్వేషన్ కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త బిసి బంద్ కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో చేపట్టిన నిరసనలో ఎం సిపిఐ పార్టీ నాయకులు పాల్గొని ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కార్యదర్శి మొహమ్మద్ రాజా సాహెబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు,డివిజన్,మండల సభ్యులు కుమారస్వామి, కొమురయ్య, సురేందర్,చందర్ రావు,భాస్కర్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి -నల్లబెల్లి గ్రామ బిసి సంఘం నాయకులు వర్దన్నపేట (నేటిధాత్రి):
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబేల్లి గ్రామంలో బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో బీసీలకు 42% బిల్లును గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపాలని తెలంగాణ బంద్ నిరసన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మరియు వివిధ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ , కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ జాఫర్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు డోలి సతీష్, బిఆర్ఎస్ నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల సురేష్, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం కొరకై ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతే అనే నినాదంతో దేశంలోనే కుల గణనకు నాంది పలికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను విజయవంతంగా పూర్తి చేసి దాని ఆధారంగా 52 శాతం ఉన్న బీసీ జనాభాకు ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో రాజకీయంగా విద్య ఉద్యోగ పరంగా రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ తో ఆర్డినెన్స్ , రాష్ట్ర అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం బిల్లును బీసీ బిల్లు ఆమోదించి గవర్నర్కు రాష్ట్రపతికి పంపినప్పటికీ కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇంకా దాన్ని కాలయాపన చేయడం ద్వారా బీసీలు నష్టపోతున్నారని తెలుసుకొని ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లడం జరిగింది దాన్ని కొంతమంది కావాల్సి కొని అడ్డుకోవడం జరిగింది. కావున కేంద్ర ప్రభుత్వం బీసీలపై ప్రేమానురాగాలు ఉంటే వారి అభివృద్ధి కోరుకున్నట్లయితే వెంటనే రాష్ట్రపతి గవర్నర్ బిల్లులను ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తంగెళ్ల భాస్కర్ ,గజ్జల దేవేందర్ పసునూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దిలీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే నారాయణ, దోమకొండ ప్రభాకర్, చెంగల స్వామి, సురేందర్, భాస్కర్, దోమకొండ ఈశ్వర్, ఆరేల్లి వీరస్వామి, ఫైండ్ల కుమారస్వామి, రాజు, సురేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండలంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనకై బీసీ జేఏసీ ఇచ్చినటు వంటి తెలంగాణ బందుకు మద్దతు తెలుపుతూ బందు లో పాల్గొన్న బిజెపి మండల నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బిసి డిక్ల రేషన్లు లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఆరోజు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలో వచ్చిన కాడి నుంచి బీసీలను మభ్యపెడుతూ బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాలని భారతీ య జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు గడువు పూర్తి అయి రెండు సంవత్సరాలు కావ స్తున్న ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మోసపూరిత హామీల తోటి బీసీలను 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మభ్యపెడు తూ కాలం వెళ్లబుచ్చుతుంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి అనేది లేదు అని ఏ రోజుకైనా బీసీలకి న్యాయం చేసే పార్టీ బిజెపి పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగి లి, సీనియర్ నాయకులు బూ ర ఈశ్వరయ్య, జిల్లా ఓబిసి మోర్చ నాయకులు ఉప్పు రాజు, మండల ప్రధాన కార్య దర్శి భూతం తిరుపతి, కురా కుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ ఉపాధ్యక్షులు మెరుగు సురేష్ గౌడ్ మొగుళ్లపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పెద్ద కోమటిపల్లి లో బిసి సంఘాల బందుకి కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ పెద్దకోమటిపల్లి గ్రామంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని వ్యాపార సంస్థలను, విద్యాసంస్థలను బందు చేయించడం జరిగింది , అనంతరం గ్రామపంచాయతీ ఆవరణంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద రమేష్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి నిమ్మతి రాజేందర్ మంద దశరథం గడ్డం శ్రీనివాస్ మంద లక్ష్మయ్య ఆదిమూల సత్యనారాయణ మంద నవీన్ మెరుగు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.
దుగ్గొండి,నేటిధాత్రి:
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు
దుగ్గొండి,నేటిధాత్రి:*
ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీసీ జర్నలిస్టులు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బందు పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో బీసీ జర్నలిస్టులు బీసీ జేఏసీ కి మద్దతు తెలుపుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు సామల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని, బీసీలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లలో తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలందరూ ఏకం కావాలని చెప్పారు. వివిధ పార్టీలు, వివిధ సంఘాలలో ఉన్న బీసీ లందరూ బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు బీసీ జర్నలిస్టుల మద్దతు కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జర్నలిస్టులు ఎడ్ల సంతోష్, తడుక సుధాకర్, శేఖర్ నాని, పాలకుర్తి మధు, తోట శ్రీనివాస్, అడ్డగట్ల శ్రీనివాస్, జగన్, క్యాతం వెంకటేశ్వర్లు తో పాటు తోటి జర్నలిస్టులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు.
టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డా.సిరికొండ శ్రీనివాసాచారి
పరకాల నేటిధాత్రి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,విద్యావేత్త ఎస్వీ విద్యాసంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ ఓ 9 కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ,రిజర్వేషన్ ల బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని ఇందు కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.30 బీసీ సంఘాల వాదనలు వినకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన తరువాత హైకోర్ట్ స్టే ఇవ్వడం బీసీ లను మోసం చేయడమేనని అన్నారు.ఇట్టి రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొసం చేసిన తరహ ఉదృతమైన ఉద్యమాలు,పోరాటాలు సాగిస్తామని తెలిపారు. ఇందుకోసం ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ ల బంద్ ను అన్నివర్గాల ప్రజలు,కులాలు,మతాలకు అతితంగా స్వచ్చందంగా బంద్ పాటించి,సహకరించి బంద్ ను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమము లో బీసీ రాష్ట్ర నాయకులు ఎడ్ల సుధాకర్,బసాని సోమరాజుపటేల్,డా.శివదేవ్,సూత్రపు శివాజీగణేష్ నాయి,సూర సతీష్ పటేల్,అల్లం మధుసూదన్ ముదిరాజ్,మహిళా నాయకులు దుంపేటి యశోద,మౌనిక,తూముల అనిత,లక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి
18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి
కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా జిల్లాఅధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి
కరీంనగర్, నేటిధాత్రి:
స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బుచ్చన్న అన్నారు. కమాన్ సెంటర్లో లోజరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్యతో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బుధవారం కరీంనగర్ లోని కమాన్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని, ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించేలా వ్యవహారించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈమోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు. కోర్టులో గెలిచామనీ రెడ్లు టపాసులు కాల్చుకొంటున్నారనన్నారు. ఇందుకు నిరసనగా హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు ప్రతులను దగ్ధం చేస్తూ ఇదీ బీసీలంతా గమనించాలన్నారు. బీసీలను రోడ్లు ఎక్కేలా చేస్తున్న అగ్రకులాలు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని, ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజుగౌడ్, నాయకులు బాకం ఆంజనేయులు, జంగం కొమురయ్య యాదవ్, దానవీని రమేష్,మల్లేశం, ఓరుసుబన్నీ, మేకల కుమార్, ఎన్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లు: కాంగ్రెస్ కట్టుబడి ఉంది, బీజేపీ-బీఆర్ఎస్ అడ్డుకుంటున్న
◆:- ఎంపీ సురేష్ కుమార్ ఆరోపణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని, అయితే ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లడం ద్వారా రిజర్వేషన్ల అమలును అడ్డుకున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నియామకం కోసం అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్లు, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసత్యాలతో, అబద్ధాలతో కాలయాపన చేస్తూ వచ్చింది అని వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆరోపించారు. ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించవలసి వచ్చినప్పుడు న్యాయ నిపుణలతో సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి.కోర్టులో 42% బీసీ కోటా నిలబడదు అని తెలిసినా కూడా తమ రాజకీయ లబ్దికోసం దుందుడుకు తనంతో, దూకుడు వ్యవహారంతో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి అయినట్టు అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ఎప్పుడో అటకెక్కింది, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు. కాబట్టి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.కావున బీసీ ప్రజలారా ఇకనైనా మేల్కోనండి రేవంత్ రెడ్డి కుట్రా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కోరారు.
అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన
ధర్నా రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్, పోలీసుల చొరవతో నిరసన విరమణ
నర్సంపేట నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే హైకోర్టు స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ఆరోపించారు. రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వేసిన దాఖలు పట్ల గురువారం హైకోర్టు మద్యంతర స్టే విధించింది. దీంతో త్వరలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పాటు బీసీ కులాల విద్య ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జీజుల శ్రీనివాస్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ధర్నా రాస్తారోకో పట్ల సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడి నిరసన విరమింప చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల హక్కులు రిజర్వేషన్ల కోసం కొన్ని ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాల కుట్రలో భాగంగా హైకోర్టులో ఫిర్యాదు మేరకు హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. దీంతో బీసీలకు ఉద్యోగ,ఉపాధితో పాటు అన్ని విధాల అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి కోర్టులకు వెళ్లలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను వెంటనే ఎత్తివేసి 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే విధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కొట్లాడుతున్న మపై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, భేతి భాస్కర్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బండారి ఉదయ్ కిరణ్, మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, మహిళా అధ్యక్షురాలు బండి విజయ, కార్యదర్శి చామంతుల రమేష్, చెన్నారావుపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కారుపోతుల శ్రీదేవి, మహిళా నాయకురాలు వైనాల రజిత, గొర్రె వినయ్, శ్రీకాంత్, ల్యాగల ప్రవీణ్ కుమార్, సింగనబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు. ధర్నా సందర్భంగా టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేయడానికి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఏం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, 42 శాతం రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ ద్వంద వైఖరిని ప్రకటిస్తున్నాయన్నారు. 64శాతం ఉన్న బీసీలు తమ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా దొంగ కారణాలు చెప్పి వెనకబడేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో లేదని, కావున ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.