సోషల్ మీడియా కేసులు.. ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.
అమరావతి: సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు (Andhra Pradesh High Court) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణ, కోర్టు ధిక్కారణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు మేజిస్ట్రేట్‌లకు వివరాలు వెల్లడిస్తూ.. రిజిస్ట్రార్ జ్యుడీషియల్ సర్క్యులర్ జారీ చేశారు.