జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను.!

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దుచేసి అధికారులకు పూర్తి స్వేచ్ఛ నివ్వాలి:-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఎస్పీ అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్:-

భూపాలపల్లి, నేటిధాత్రి:-

 

 

గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా జిల్లా ఇంచార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ అధికారులను పక్కదారి పట్టిస్తున్నారని నిరుపేదలను ఇబ్బందులకు గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికార పార్టీ నాయకులు అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేని ఎడల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇండ్ల మంజూరు సమాచారాన్ని సేకరించి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని ఎంపీడీవో లను జిల్లా కలెక్టర్ ను బాధ్యులను చేస్తూ గూడు లేని నిరుపేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీలను రద్దు చేసేంతవరకు వివిధ రూపాలలో పార్టీ కార్యచరణ తీసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం.

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

◆ సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ
శుభాభినందనలు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పాత్రికేయ సోదర, సోదరీమణులందరికీ శుభాభినందనలు తెలియజేశారు. “పత్రికా స్వేచ్చ ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభం. సత్యాన్ని వెలికి తీసే కర్తవ్య నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజంలో వారి సేవ అమూల్యం” అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం.. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించటం మీడియా కర్తవ్యం.. నిష్పక్షపాతంగా వృత్తి నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులకు వందనం..ఒక సందేశంలో పేర్కొన్నారు.

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,.! 

కేసీఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ, స్వపరిపాలన సిద్ధించింది. 

-ప్రజా సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగింది

-విలేకరుల సమావేశంలో చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని 14ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10ఏండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వములో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కొంతమది చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో కేసీఆర్ కు అభిమానం తగ్గలేదని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గల తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని అన్నారెడ్డి అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version