కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన..

కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు.
​ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల:
​సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది.
​ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు.
​కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి.
​ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
​విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి…

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

పట్టణంలో కార్మిక వర్గం భారీ ప్రదర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలో బిఆర్టియు, ఏఐఎఫ్టియు (న్యూ), ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, టియుసి సంఘాల ఆధ్వర్యంలో* వరంగల్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎఫ్టియు
న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేష్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపేల్లి మునీశ్వరు,హమాలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేటు బహుళ జాతి యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడులను తీసుకువచ్చారని కనీస వేతనం అమలు చేయాలని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సవరణలు చేయడం సరికాదని రైతాంగం హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విధంగా కార్మికుల కూడా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువల లలిత కార్యదర్శి సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి కందికొండ రాజు, ఆయా సంఘాల నాయకులు రాజు, నాగులు,మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

బూచినేల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లను తక్షణమే వేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-19T124630.560.wav?_=1

 

బూచినేల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోడ్లను తక్షణమే వేయాలి.

◆:- గుంతల మయంగా మారిన రోడ్లతో ప్రమాదాలకు గురవుతున్న కార్మికులు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మండలంలోని బూచినేల్లి పారిశ్రామిక ప్రాంతం మహీంద్రా వెండర్ పార్కులో పూర్తిస్థాయిలో రోడ్లు గుంతల మయంగా మారడంతో కార్మికులు డ్యూటీకి వెళ్లేందుకు వచ్చి వెళు తున్న కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికే కొంతమంది కార్మికులు ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలయ్యారని, ఈ విషయమై అనేకసార్లు విన్నవించిన సమస్య పరిష్కరించకపోవడం సరైన పద్ధతి కాదని తక్షణమే కొత్త రోడ్లు వేయాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ మహిపాల్ డిమాండ్ చేశారు. ఈరోజు ఈ సమస్యపై బుచినెల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సిఐటియు ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జహిరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ మహిపాల్ మాట్లాడుకు టీజీఐఐసీ పరిధిలోకి వచ్చే ఈ మహీంద్రా వెండర్ పార్కులో అనేక రకాల పరిశ్రమలు ఉన్నాయని వేల మంది కార్మికులు రోజువారిగా డ్యూటీలకు వస్తూ వెళ్తూ ఉంటారని ఫస్ట్ షిఫ్టు వచ్చే కార్మికులు సెకండ్ షిఫ్ట్ అయ్యి వెళ్లే కార్మికులు నైట్ షిఫ్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రోడ్లు పూర్తిగా గుంతల మయంగా మారడంతో కింద పడి కార్మికులు ప్రమాదాలకు గురై హాస్పిటల్ లో పాలవుతున్నారని అయినా టీజీఐఐసి అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం సరైనది కాదని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య కొన్ని వేల మందిదీ అయినా కూడా పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల %జ×ుఖ% నాయకులు సందీప్ రెడ్డి నరేష్ నారాయణ కిరణ్ బాల్రాజ్ మహా లింగ శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 7 న జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చెయ్యండి..

ఈ నెల 7 న జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చెయ్యండి

◆:- మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేసిన కార్మిక నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్. సెంటర్ ఆఫ్ ఇండియాన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ మహాసభల బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ పారిశ్రామి క్లస్టర్ కమిటీ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ కార్మిక ప్రజా పోరాటాల సారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర ఐదో మహాసభలు ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ లో జరగనున్నాయని గత కార్యక్రమాలు చర్చించి భవిష్యత్తు ఉద్యమాలు పోరాటాలను రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు పోరాటాలు కార్మికుల హక్కుల పరిరక్షణకు జరుగుతాయని అందుకోసం నిర్వహించే ఈ మహాసభల బహిరంగ సభలో కార్మిక వర్గం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల సీఐటీయూ యూనియన్ల నాయకులు రాజిరెడ్డి నరేష్ మహేశ్వర్ గణేష్ నారాయణ సందీప్ రెడ్డి కిరణ్ పాషా శివరామరావు బాబు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లిలో సిఐటియుసి కార్మిక ర్యాలీ ప్రారంభం

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియుసికరపత్రిక ఆవిష్కరణ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిఐటియుసి ఆధ్వర్యంలో కరపత్ర o ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ. కార్మికుల హక్కుల సారధి పోరాటాల వారధి సిఐటియుసి రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగవ మహాసభలు నవంబర్ 30వ. తేదీన ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్ డి ఓ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలకు సిఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ అక్క సిఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండలం నుండి కార్మికులు బీడీ కార్మికులు ఆశా వర్కర్లు అమాలి సంఘం నాయకులు వస్త్ర వ్యాపార కార్మికులు కార్మికులందరూ తంగళ్ళపల్లి గ్రామం నుండి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నాలుగవ మహాసభలు సిఐటియుసి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుచు ఏఐటీయూసీ తరఫున మండల కేంద్రంలోని కరపత్రం విడుదల చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో అన్ని రకాల సంబంధిత కార్మికులు పాల్గొన్నారు

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సిఐటియు జిల్లా 4వ. మహాసభల విజయవంతo చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T134551.948.wav?_=2

 

సిఐటియు జిల్లా 4వ. మహాసభల విజయవంతo చేయండి

నవంబర్ 29, 30 తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు జిల్లా 4వ,మహాసభల కరపత్రం ఆవిష్కరణ.

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు పక్షాన హ మాలి కార్మికుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్,మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం, కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై, పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా కార్మికుల హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం సిఐటియు, అటువంటి సిఐటియు 4వ, మహాసభలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు నవంబర్ 29,30 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ-ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పడి చేయడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తు పోరాట కార్యచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభలకు జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు, బీడీ కార్మికులు, హ మాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ మరియు మునిసిపల్ కార్మికులు, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు, హాస్పిటల్ మరియు విద్యుత్ సంస్థలో చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు,, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, వాణిజ్య వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు సిఐటియు మహాసభలకు హార్దిక సహాయ సహకారాలు అందించి పోరాటాల వారిది సిఐటియుకు వెన్నుదండగా నిలవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది..ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి,గురిజాల శ్రీధర్, మరియు బూరుగుపల్లి,గ్రామ హ మాలి సంఘం అధ్యక్షులు, సూర్గు నాంపల్లి, కము టం సురేష్, కోరేపు రాజు, కల్లే పల్లి రవి, బరిగే రమేష్, నేరెళ్ళ బాలైయ్య, పెరుమల్ల తిరుపతి, సుదుల గోపాల్, తది తరులు పాల్గొన్నారు.

చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి…

చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి , చేనేత జౌళి శాఖ ఏడి కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో వివిధ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వేదలాదిమంది కార్మికులకు చాలా సంవత్సరాలుగా సిరిసిల్ల బి.వై. నగర్ లో అందుబాటులో ఉండి సేవలందించిన జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం వలన కార్మికులు వివిధ సంక్షేమ పథకాలు , సమాచారం కోసం లేదా ఏదైనా పని నిమిత్తం కలెక్టరేట్ లోని చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లాలంటే కార్మికులకు దూర భారంతో పాటు ఆర్థిక భారం మరియు కొంత సమయం పని కూడా కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాను పోను ప్రయాణంలో

 

 

ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లో చేనేత జౌళి శాఖ కార్యాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ అప్పటి కలెక్టర్ ఏకపక్ష నిర్ణయంతో ఆఫీసును కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం జరిగిందని ఆఫీసును మార్చడం ద్వారా కార్మికుల ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృశ్య యధావిధిగా సిరిసిల్లలోకి ఆఫీసును మార్చాలని పలు దాఫాలుగా కలెక్టర్ గారికి విన్నవించినప్పటికీ కూడా కలెక్టర్ పట్టించుకోలేదని ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ కలెక్టర్ అయినా వేలాదిమంది కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఆఫీసును యధావిధిగా సిరిసిల్లలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , గుండు రమేష్ , ఎక్కల్ దేవి జగదీష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రభుత్వం…

భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రభుత్వం

వెల్ఫేర్ బోర్డు క్లైమ్ లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పడం మానుకోవాలి

ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 12 ని సవరించాలి

బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

 

బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారి (ALO) నజీర్ సార్ గారికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు గీస బిక్షపతి , కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి గార్లు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల సంక్షేమం కొరకు చేపట్టిన అనేక ఐక్య పోరాటల ఫలితంగా 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ఏర్పడిందని దేశవ్యాప్తంగా ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను సాధించుకున్నామని తెలిపారు వెల్ఫేర్ బోర్డులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విధానాల వలన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వలన నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు సరియైన ఉపాధి లేకుండా పోతుందని అన్నారు.ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించే విధంగా వెల్ఫేర్ బోర్డు స్కీం లకు సంబంధించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 12 వలన కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుందనీ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 12 ని సవరించాలని లేకుంటే రానున్న రోజుల్లో కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఈసంపేల్లి రాజెలయ్య , సావనపల్లి ప్రభాకర్ , దేవయ్య , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల సొంత ఇంటి కోసం ఓటింగ్..

సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ

కంపేటి రాజయ్య, బంద్ సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి…

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి

సెప్టెంబర్ 15 న మహాసభ

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు

సిరిసిల్ల టౌన్ *(నేటిధాత్రి)

 

 

 

సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను ఈరోజు బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణను రూపొందించుకోవడం కోసం యూనియన్ జిల్లా 3 వ. మహాసభలను సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు , గురజాల శ్రీధర్ , కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం…

సొంతింటి కల నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి

శ్రీరాంపూర్, మంచిర్యాల నేటి ధాత్రి:

 

 

సింగరేణి కార్మికులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న సొంతింటి కల పథకం ప్రభుత్వం, యాజమాన్యం నెరవేర్చకపోతే దీర్ఘకాలిక పోరాటాలకు సిద్ధమేనని కార్మికులు, యూనియన్లకు అతీతంగా కార్మిక నాయకులు సూచనలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం ఇందారం 1ఎ గనిలో సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో ఆయన పాల్గొని పొంతింటి పథకంపై బ్యాలెట్ నమూనా వాల్ పోస్టర్ ను కార్మికులతో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11,12వ తేదీలలో సొంతింటి పథకంపై సిఐటియు నిర్వహిస్తున్న అభిప్రాయ సేకరణలో భాగంగా నమూనా బ్యాలెట్ నిర్వహిస్తున్నందున కార్మికులు పాల్గొనాలని అన్నారు.అలాగే 15 వ తేదీన వాస్తవ లాభాలు ప్రకటించాలని,35 శాతం వాట కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిఎం కార్యాలయాల ముందు చేపట్టే ధర్నా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళనలు ధర్నాలకు పిలుపునిస్తుంటే దసరా దగ్గర పడుతున్న ఇంకా లాభాల వాటా ప్రకటన చేయకపోవడం గుర్తింపు,ప్రాతినిధ్య సంఘాలకు సిగ్గుచేటని విమర్శించారు.తక్షణమే వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాట చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.యాజమాన్యంపై గతంలో పోరాటాలు చేసిన గుర్తింపు,ప్రాతినిథ్య సంఘాల నాయకులు ఇప్పుడు వినతి పత్రాలకు పరిమితమయ్యారని ఆరోపించారు.ఇప్పటికైనా అన్ని సంఘాలను కలుపుకొని కార్మిక వర్గ శ్రేయస్సు కోసం యాజమాన్యంపై పోరాటాలు చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీ బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్,వెంగళ శ్రీనివాస్, వెంకట్ రెడ్డి,కిషన్ రెడ్డి,నవీన్, ఐత శ్రీనివాస్,షేక్ షావలి,మొయినుద్దీన్,ఇప్ప నరేష్,వినయ్,సుదీర్ పాల్గొన్నారు.

భూపాలపల్లిలో రైతులకు యూరియా సరఫరా సమస్య..

రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

టెక్స్టైల్ పార్క్ లో 3 వ.రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె

కార్మికుల కూలి పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడాలి

వెంటనే కార్మికులతో చర్చలు జరిపి కూలీ పెంచాలి

సిరిసిల్లలో నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమం చేపట్టిన టెక్స్టైల్ పార్క్ కార్మికులు

కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుంది

సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ డిమాండ్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్కులో కార్మికులకు ప్రభుత్వ వస్త్రాలకు రోజుకు 1000 /- రూపాయల వేతనం వచ్చే విధంగా పెంచాలని అదేవిధంగా ఒప్పంద గడువు ముగిసిన ప్రైవేటు వస్త్రానికి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్లతో కార్మికులు చేపట్టిన సమ్మె 3 వ. రోజుకు చేరుకుంది ఈరోజు సమ్మెలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి నేతన్న విగ్రహం వరకు డిమాండ్లతో కూడిన ఫ్లకార్లతో ర్యాలీ చేపట్టి సమస్యలపై నేతన్న విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగినది.

ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు మొండి వైఖరి వీడి వెంటనే చర్చలు జరిపి కార్మికులకు ప్రభుత్వ , ప్రైవేటు వస్త్రాల కూలి పెంచి సమ్మె విరమింపజేయాలని అన్నారు.యజమానులు కూలి పెంచే విధంగా సంబంధిత చేనేత జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , శ్రీకాంత్ , కిషన్ , ఆంజనేయులు , సంపత్ , వేణు , శ్రీధర్ , వేణు , రాజు , మనోహర్ , రాజశేఖర్ , ప్రశాంత్ , గణేష్ , రామచంద్రం , కనుకయ్య ,వరప్రసాద్ , మహేష్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

సీ.ఐ.టీ.యూ ఆధ్వర్యంలో చేనేత జాతీయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29.wav?_=3

సీ.ఐ.టీ.యూ ఆధ్వర్యంలో చేనేత జాతీయ దినోత్సవం

వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలి

( త్రిఫ్ట్ ) నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలి

చేనేత – పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలి

కార్మికులందరికీ 6వెయ్యిల రూపాయల పెన్షన్ అమలు చేయాలి

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ఆగస్టు – 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ – CITU ఆధ్వర్యంలో సిరిసిల్ల పాత బస్టాండులోని నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి వర్కర్ టూ ఓనర్ , త్రిఫ్ట్ , మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం , అధికారులు చేనేత దినోత్సవం రోజున సంబరాలు జరుపుకోవడానికి పరిమితం కాకుండా చేనేత , పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిరిసిల్లలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్కర్ టూ ఓనర్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని , త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాలలో జమ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ , వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , సూరం పద్మ , దాసరి రూప , జిందం కమలాకర్ , బెజుగం సురేష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , బింగి సంపత్ , కారంపురి మహేష్ , చింత కింది సుధన్ , దోమల రాము , సందుపట్ల పోచమల్లు , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక..

రాజన్న సిరిసిల్ల జిల్లా బీడీ వర్కర్స్ యూనియన్ CITU నూతన కమిటీ ఎన్నిక

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ బీడీ & సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా 3 వ. మహాసభలు సిరిసిల్ల పట్టణంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకత్వం సమక్షంలో 21 మందితో నూతన కమిటీనీ ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికల్లో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా – ముశం రమేష్,అధ్యక్షులుగా, శ్రీరాముల రమేష్ చంద్ర,
ప్రధాన కార్యదర్శిగా,సూరం పద్మ,కోశాధికారిగా – జిందం కమలాకర్,ఉపాధ్యక్షులుగా దాసరి రూప , కావేటి సత్యం,లక్ష్మణ్ కార్యదర్శిలుగాబెజుగం సురేష్ ,బోనాల లక్ష్మి , కీసరి పుష్పల,కమిటీ సభ్యులుగా మాడుగుల మల్లయ్య , గట్ల సప్న , లింగంపల్లి జ్యోతి,గురజాల మమత, సులోచన,
వాణి,మానస తదితరులను ఎన్నుకోవడం జరిగినది.ఈ సందర్భంగా సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ నూతన కమిటీగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేసి రాబోయే కాలంలో జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నూతన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ₹4,000 పెన్షన్ అమలు కొరకై అదేవిధంగా బీడీ కంపెనీ యజమాన్యం బీడీ కార్మికుల శ్రమను విపరీతంగా దోపిడీకి పాల్పడుతుందని కార్మికులు పనిచేసినటువంటి బీడీల నుండి 2500 బీడీల కూలీని దోచుకోవడమే కాకుండా దీనితో పాటు అనేక రకాల కోతల పేరుతో కార్మికుల వేతనాల నుండి నెలకు దాదాపు ₹1000 రూ!! ల వరకు కట్ చేయడం జరుగుతుందన్నారు.
బీడీ పరిశ్రమ మరియు కార్మికుల పట్ల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై బీడీ కంపెనీల యజమాన్యాలు చేస్తున్న దోపిడీపై కార్మికులను ఐక్యం చేసి రాబోయే కాలంలో నూతన కమిటీ పనిచేస్తుందని అన్నారు.కార్మికులందరూ కంపెనీ యజమాలకు,టేకేదారులకు భయపడకుండా ఐక్యం కావాలని సంఘం కార్మికులకు అండగా ఉంటుందని అన్నారు.

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను..

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ముశం రమేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130848.280.wav?_=4

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు
ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది
బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన.

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సిఐటియు బందు సాయిలు ఏఐటియుసి కొరిమి రాజ్ కుమార్ టిబిజికేఎస్ సమ్మయ్య, ఐఎన్ టియుసి మధుకర్ రెడ్డి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజున ఒక బిఎంఎస్ తప్ప అన్ని రకాల కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని, ఈ సమ్మె కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారని,సార్వత్రిక సమ్మె కార్మిక సంఘం అని చెప్పుకునే బి ఎం ఎస్ కార్మిక సమ్మెలో పాల్గొనకుండా ఇది రాజకీయ సమ్మె అంటూ కుంటి సాకులు చెప్పడం కార్మికులకు ద్రోహం చేయడమేనని పనిగంటలు 8 నుండి 10 గంటలకు అవసరమైతే 12 గంటలకు పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడులలో, రాష్ట్ర ప్రభుత్వం జీవో 282 ద్వారా చెబితే వారానికి 48గంటలు దాటదని బిఎంఎస్ చెప్పడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం.. వారానికి 48 గంటలు దాటితే ఓవర్ టైం పేమెంట్ వస్తుందని చెప్పారే తప్ప వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలని కానీ, వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తారని కానీ లేబర్ కోడ్ లలో ఎక్కడా చెప్పలేదని సత్యం కండ్లున్న ఈ కబోధులకు కనబడటం లేదా అని సిఐటియు ప్రశ్నిస్తుంది..

 

 

 

 

 

 

 

రోజుకు 10 నుండి 12 గంటలు పని చేయాలని 6 గంటల తర్వాతే బ్రేక్ ఉంటుందని ప్రభుత్వం రాతపూర్వకంగానే చెబుతుంటే కార్మికుల తరఫున మాట్లాడాల్సిన ఈ దివాలాకోరులు ప్రభుత్వానికి, కార్పొరేట్లకు మద్దతు పలకడం కార్మికుల పట్ల వీరికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.. ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ రోజుకు రూ.178/-(నెలకు 4628/-) ఉంటే చాలని చెప్పిన మోడీ ప్రభుత్వం వీరికి ఆదర్శమట…వేతనాల కోడ్ కు సామాజిక భద్రత కొడుకు తేడా తెలవని ఈ తేడా గాళ్ళకు వేతనాలకోడు రూల్స్ లో కనీస వేతనాల నిర్ణయంలో డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములాను కానీ, సుప్రీంకోర్టు రాప్తా కోస్ & బ్రెస్ట్ కేసులో ఇచ్చిన తీర్పును గాని పరిగణలోకి తీసుకోకపోగా ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం గురించి చెప్పి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెరగాలని పేర్కొనకపోవడం కార్మికులను మోసం చేయడమే…ఇటువంటి కోడ్ ను బిఎంఎస్ సమర్థించడం సిగ్గుచేటు.. వాస్తవాన్ని కప్పిపుచ్చి ఐదు సంవత్సరాలకోసారి కేంద్ర ప్రభుత్వమే కనీసం పెంచుతుందని బిఎంఎస్ వారు చెప్పడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనం..

 

 

 

 

 

సామాజిక భద్రత కోడ్ బాగుందని చెప్పే వీరికి ఈ కోడ్ లో 12 శాతంగా ఉన్న పీఎఫ్ ను 10 శాతానికి తగ్గిస్తామని సెక్షన్ 16(1)ప్రకారం ఈ 10 శాతం కూడా తగ్గించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది కనబడలేదా? సెక్షన్ 15(1)(e) ప్రకారం ఈపీఎఫ్, ఈపీఎస్, ఈ డి ఎల్ ఐ లను తనకు అవసరమైన విధంగా మార్చేందుకు, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ రేటును నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వానికే అధికారం కట్టబెట్టిన విషయం వీరు చదవలేదా? అని సిఐటియు ప్రశ్నిస్తున్నది… దీంతో ఈపీఎఫ్ ట్రస్ట్ బోర్డును, ఈఎస్ఐ గవర్నింగ్ బాడీని నామమాత్రం చేస్తున్న విషయం వీరికి అర్థం కాలేదా?

 

 

 

 

గిగ్ వర్కర్స్ కు, కొంతమంది అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు ఫోజు పెట్టి మొత్తం కార్మికుల సామాజిక భద్రతని నాశనం చేసే ప్రభుత్వ విధానం వీరికి నచ్చడం వీరి దివాలా కోరుతనానికి నిదర్శనం..
ఈ కోడ్ ల వల్ల యాజమాన్యాలు పర్మనెంట్ ప్లేస్ లలో ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను పెట్టుకొని యదేచ్చగా దోపిడీ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు.. 300 మంది లోపు కార్మికులు ఉన్న కంపెనీలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్మికులను తొలగించడానికి, లే ఆఫ్, మూసివేతలకు యాజమాన్యాలకు లైసెన్స్ ఇచ్చింది పారిశ్రామిక సంబంధాల కోడ్. అంతేకాక మెడికల్ కారణాలతో కార్మికుని తొలగిస్తే అది రిట్రించ్మెంట్ క్రిందికి రాదని సెక్షన్ 2 (3)లో పేర్కొన్నారు. మెడికల్ అన్ ఫిట్ సర్టిఫికెట్ తో సంబంధం లేకుండానే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో కార్మికులను తొలగించే అవకాశం యాజమాన్యాలకు ఇస్తే అది బిఎంఎస్ కు నచ్చుతుంది

 

 

 

 

ఈ కోడ్ యూనియన్ల ఏర్పాటును, రిజిస్ట్రేషన్ ను, రిజిస్ట్రేషన్ కొనసాగింపును కఠిన తరం చేస్తుంది. ఇంతటి ప్రమాదకరమైన అంశాలు పొందుపరిచిన ఈ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మెకు పిలుపునిస్తే అది బి ఎం ఎస్ వారికి రాజకీయ సమ్మెగా కనబడుతుంది అంటే వీరిని ఏమనాలో కార్మికులే నిర్ణయించాలి…బిజెపికి అంటగాగే బిఎంఎస్ వారి నుండి ఇంతకంటే ఏమి కొత్తది ఆశించగలం.. అందుకే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం రూ.26,000 కు పెంచాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు చేయొద్దని తదితర ప్రజోపయోగ డిమాండ్లపై జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెలో కార్మికులంతా పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు రమేష్ కంప్యూటర్ రాజయ్య రామచంద్రయ్య సోతుకు ప్రవీణ్ సతీష్ ఆకుదారి రమేష్, నాయకులు వెలిశెట్టి రాజయ్య రవికుమార్, రాజేందర్, శేఖర్, మహేందర్

కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి.

కార్మికుల ఉద్యోగ భద్రత సౌకర్యాల సాధన కోసం సిఐటియు ను గెలిపించండి

★చుక్క రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఈనెల 5వ తేదీన జరిగే పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం అందించేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని సిఐటియును గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, మహీంద్రా&మహీంద్రా ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) అధ్యక్షులు కామ్రేడ్ చుక్క రాములు పిలుపునిచ్చారు. మంగళవారం రోజు కంపనీ ముందు జరిగిన ఎన్నికల గేట్ మీటింగ్ లో చుక్క రాములు మాట్లాడుతూ మరో చారిత్రాత్మక వేతన ఒప్పందం 25000 రూపాయలతో చేస్తామని, ఉద్యోగ భద్రత, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, కార్మికులతో పాటు తల్లిదండ్రులకు మెడికల్ కార్డ్ వర్తించేలా 7లక్షలతో చేస్తామని, 3సంవత్సరాలకు అగ్రిమెంట్, 4.50రూ/- డి ఎ పెంచుతామని ఇలా అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐ ఎన్ టి యు సి నాయకులకు కనీసం కార్మికుల పట్ల అవగాహన లేదనీ, కార్మికుల పట్ల కేవలం అవగాహన ఉండి చారిత్రాత్మక వేతన ఒప్పందాలు సాధించి పెట్టి అనేక సౌకర్యాలు సాధించిన ఘనత సిఐటియు దేనని రాబోయే రోజుల్లోనూ వేతన ఒప్పందం ఉందని ఆ వేతనం ఒప్పందాన్ని కూడా మెరుగైందిగా చేయాలంటే సిఐటియుని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, సీపీఎం ఏరియా కార్యదర్శి రాంచందర్, వివిధ పరిశ్రమల యూనియన్స్ నాయకులు నాయకులు పాండు రంగ రెడ్డి, బాగారెడ్డి, మహిపాల్, రాజిరెడ్డి, కనకారెడ్డి, గణేష్, నర్సయ్య, మణి, నారాయణ, సందీప్ రెడ్డి, నరేష్, నర్సింలు, తదితరులున్నారు.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మే – 30 సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బి.వై. నగర్ లోని సి.ఐ.టి.యు ఆఫీసు వద్ద CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం , హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం CITU అని 1970 మే 30 వ తేదీన ఐక్యత – పోరాటం అనే నినాదంతో కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని గత 55 సంవత్సరాలుగా దేశంలో , తెలంగాణ రాష్ట్రంలో , రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్కుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని పోరాటంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సి.ఐ.టి.యు కు అండగా ఉంటూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
ఈరోజు సిఐటియు 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కార్మిక వర్గ ఉద్యమ పోరాట కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గుర్రం అశోక్ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , గుండు రమేష్ , దొబ్బల లచ్చయ్య , వావిలాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version