పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలి…

పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలి

సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలి

ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటు పలుకుల రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

సింగరేణిలో పాత విధానంలో నే మెడికల్ బోర్డును నిర్వహించాలని సింగరేణి కాలరేసి వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియాలో
సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవ్ సింగరేణి బస్ జాతా కార్యక్రమం లో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంట్స్ మీద నల్ల బ్యాడ్జీలు ధరించి మెడికల్ బోర్డు,మారుపేర్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్,తదితర అంశాలపై గని మేనేజర్ పిట్ సెక్రటరీ ఎల్.శంకర్ ఆధ్వర్యంలో బ్రాంచి కార్యదర్శి మోటపలుకుల రమేష్ మెమో రాండం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. బస్ జాతా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్చి 30న కొత్తగూడెంలో హెడ్ ఆఫీస్ ముట్టడి ధర్నా కార్యక్రమం జరుగుతుందని దాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.సింగరేణిలో కొత్త బొగ్గు బావులు ప్రారంభించాలని,పాత విధానంలో మెడికల్ బోర్డును నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన
50 వేలకోట రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికు లకు సొంత ఇంటి పథకాన్ని అమ లు చేయాలని,
పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ కంపెనీ చెల్లించాలని,
కాంట్రాక్ట్ కార్మికు లకు ఐపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరారు.మారు పేర్లు, డిస్మిస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని,
స్ట్రక్చర్ సమావే శాలలో ఒప్పుకు న్న వాటిని అమలు పరచా లని కోరారు.కెటికె
–1లో జి శ్రీనివాస్,సదయ్య,కెటికె5 లో ఆసిఫ్ పాషా,రాజేందర్,కేటికె6 లో శ్రీనివాస్,గణేష్,
కెటికె 8 శంకర్, కృష్ణ,ఓసి 2లో కరిముల్లా, రామచందర్,ఓసి 3 లో నూకల. చంద్రమౌళి,మహేందర్ రావు
ఏరియా వర్క్స్ షాప్ లో శ్రీనివాస్, కొమురయ్య లు కార్యక్రమంలో పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి గని మేనేజర్లకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పిట్ సెక్రటరీ శ్రీకాంత్,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ హరీష్ ,మైన్స్ కమిటీ,సేఫ్టీ కమిటీ,షిఫ్ట్ ఇంచార్జిలు, అసిస్టెంట్ షిఫ్ట్ ఇంచార్జిలు,టెంపుల్ కమిటీ,క్యాంటీన్ కమిటీ,కార్యకర్తలు,కార్మిక సోదరులు పాల్గొన్నారు.

సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి..

సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల వేతనాలు పెంచాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

హైదరాబాదు నగర నడిబొడ్డు మీద ఉన్న నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ సుమారు 2000 మంది కార్మికులు తమ వేతనాలను పెంచాలని గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ యాజమాన్యం మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు గురువారం నాడు కార్మికుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఐఎఫ్టియు ప్రతినిధి బృందం తరపున ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా సాయి ఎక్స్పోర్ట్ కమిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుకాలం గడుస్తున్న కార్మికుల వేతనాలు రూ10 వేల లోపే పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం మహిళా కార్మికులు ఉన్నప్పటికీ వారికి కనీస రక్షణ చర్యలు లేవని ఫలితంగా తీవ్ర వివక్షకు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ సమస్యపై స్పందించాలని లేబర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి కార్మికుల యాజమాన్య తో చర్చించి సమస్య పరిష్కారానికి పూనుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి చట్టాలు అమలు చేయకుండా కార్మికుల కనీస హక్కులను హరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసి సాయి ఎక్స్పోర్ట్ కంపెనీలో చట్టాలు అమలయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలని అందులో భాగంగానే కనీస వేతనం కింద ఒక్కో కార్మికుడికి కనీస వేతనం రూ. 26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని మహిళా కార్మికులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేనియెడల కార్మికులకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, నాయకులు కావేరి, మల్లన్న, ఇంద్రసేనారెడ్డి, శ్రీశైలం, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు

కార్మిక హక్కులను రక్షించుకోవడానికి కనీస వేతనాలు సాధించుకోవడానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

ములుగు జిల్లాలో ఈరోజు ఏఐటీయూసీ ములుగు మండల మహాసభ గుంజ శ్రీనివాస్,,, పెద్ద కాసు వినోద్ గారి అధ్యక్ష వర్గంగా, ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన మహాసభలో పాల్గొన్న, ఏఐటియుసి ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి, జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం,కార్పోరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా ఉండడానికి గాను, నాలుగు కోడ్స్ గా కుదించడం జరిగింది అన్నారు,అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రజలు,కార్మికులు,ఉద్యోగులు,ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది అన్నారు, కనుక పై చట్టాలను రక్షించుకోవడానికి, కనీస వేతనాలు సాధించుకోవడం కోసం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు,, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని తీర్పు ఇచ్చినప్పటికీ, పాలకులు మాత్రం అమలు చేయడం లేదు అన్నారు, కనుక సుప్రీం కోర్టు, కేంద్ర ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది, కేంద్ర రాష్ట్ర,ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే బదులు వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నారు, అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను విరమించుకొని ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తించాలని ప్రభుత్వం ద్వారా అనే నేరుగా వేతనాలు చెల్లించాలని స్కీం వర్కర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని కనీస వేతనాలు 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇవన్నీ సాధించుకోవడం కొరకు అన్ని వర్గాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది జేఐటియుసి మండల అధ్యక్షులుగా పెద్దకాసు వినోద్ ప్రధాన కార్యదర్శిగా గుంజ శ్రీనివాస్ గారలతోపాటు 22 మందిని ఎదుర్కోవడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బండి నరసయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షురాలు సామల రమ, సిపిఐ సీనియర్ నాయకులు ఇంజన్ కొమురయ్య, ముత్యం కొమురయ్య, వీరన్న,శ్రవణ్,, కొత్తపెళ్లి శ్రీనివాస్,అజిత, సంధ్య, లలిత, సంధ్య, సమత, గుండ్రెడ్డి శ్రీనివాస్, గుండె దీపిక,మల్రాజుల సమ్మయ్య,కమలక్క రమేష్,కుంకర స్వామి,కౌసల్య, శ్రీను, శిరీష, ప్రవీణ్,శ్రీకాంత్,జంపాల శ్రీనివాస్, ఎండి రంజాన్, నవ లోక,రజిత,లావుడే రాములు, కనక లక్ష్మి ఆసరి లక్ష్మి రాజకుమారి స్వరూప

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version