సామాన్య ప్రజలకు నిత్య సేవలు అందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్ అని టీపీసీసీ సభ్యులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ అన్నారు.ప్రపంచం ఆటో డ్రైవర్స్ దినోత్సవం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యులు,గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆటో కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పారు.ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కాకతీయ యూనియన్ అధ్యక్షులు ఇస్రం కుమార్,పట్టణ ఇన్చార్జి కొమ్ము వినయ్ కుమార్, ఐఎన్టియుసి నాయకులు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి, పాకాల రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు దేశి విజయ్, ఉపాధ్యక్షులు ఈదుల శ్రీను, కార్యదర్శి మండల రమేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పోగుల రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి,మాజీ కౌన్సిలర్ యెలకంటి విజయ్,మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, ప్రధాన కార్యదర్శి బైరి మురళి,కార్యదర్శులు మోటం రవి,గిరగాని రమేష్,నాంపెల్లి వెంకటేశ్వర్లు,బూస నర్సింహరాములు,బిట్ల మనోహర్,రామగోని శ్రీనివాస్,మైధం రాకేష్, రామగోని సుధాకర్,గండు గిరివరంగంటి విక్రమ్ సాయి తదితరులు పాల్గోన్నారు.
టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ రాజ్ కుమార్
ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్న ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ శానబోయిన రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (టిఏడియు)ఆధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని గిర్నీబావిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో కలిసి శానబోయిన రాజ్ కుమార్ కేక్ కట్ చేసి ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.12 వేలు అమలు చేయాలి.లేబర్ కార్డ్ అందించి, 5లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించాలని తెలిపారు.మహాలక్ష్మి పథకం వలన ఆటో డ్రైవర్ కార్మికులు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఏడియు మండల అధ్యక్షులు బూర రామకృష్ణ గౌడ్, మండల గౌరవ సలహాదరుడు మోడెం విద్యాసాగర్,నాయకులు నరసింహ,కార్యదర్శి దండు రాజు, అడ్డాల అధ్యక్షులు పొగాకు దేవేందర్, తెప్పే శెంకర్, గణేష్, రాజేందర్, రహీం, ప్రశాంత్, దేవేందర్, అశోక్,రాజు, నాగరాజు, రాంరాజు, సాంబయ్య, నరేష్,సాంబమూర్తి మండలములోని అన్ని అడ్డాల డ్రైవర్ కార్మికులు పాలుగోన్నారు.
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్
కరీంనగర్, నేటిధాత్రి:
గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై ఐక్యంగా పోరాడాలని గౌడ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈసందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలొ పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. యాభై ఏళ్లు దాటిన గీత కార్మికులకి పింఛన్ ఇవ్వాలని, 560జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఐదు లక్షలు ఉన్నదానిని పది లక్షల రూపాయలకు పెంచాలని, గీత కార్మికులకు రెండు వేల పింఛన్ను ఐదు వేలు పెంచాలన్నారు. ప్రతి జిల్లాకు గౌడ భవనం నిర్మిస్తామని నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఈత చెట్టు, తాడిచెట్లు పెట్టి వనాన్ని పెంపొందిస్తామని చెప్పారని హైదరాబాద్ గీత కార్మికుల భవనానికి పూజ చేశారని వెంటనే నిర్మించాలని గీత కార్మికులు అంటే చిన్నచూపు ప్రభుత్వం చూస్తుందని పెండింగ్ లోవున్నా ఎక్స్రిగేసియే బిల్లులు వెంటనే ఇవ్వాలని తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే వైన్ షాప్ టెండర్లలో ఇరవై ఐదు శాతం గీతా కార్మికులకే కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని రాబోయే టెండర్లలో ఇవ్వాలన్నారు. గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడి శాశ్వత వికలాంగుడు అయితే ఇరవై ఐదు వేలు, గాయాల పాలైతే పదిహేనువేల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం గతంలో ఇచ్చిందని ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదని పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తిరుపతి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరసన వ్యక్తం చేసిన ఆటో యూనియన్ సభ్యులు.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రం లో ఆటో కార్మికులు గురువారం బస్టాండ్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని చందుర్తి మండల ఆదర్శ ఆటో యూనియన్ కార్మికులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో రాష్ర్టంలోని ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులకి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం కాకుండా రూ.15వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి ఆటో సంక్షేమ బోర్డుగాని, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ పథకంలో ఆటో కార్మికులకు 10 శాతం ఇళ్లు కేటాయించాలని శేషు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 27న జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు హాజరవుతారని ఈ సమావేశానికి మొగుళ్ళపల్లిమండల మండలంలోని ఇస్సి పేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీ.శే కొడాలి కొమురయ్య గారి విగ్రహావిష్కరణ అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ నందు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మండలపరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొగుళ్ళపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలుగూరితిరుపతిరావు తెలిపారు
సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి పట్టణంలో హై స్కూల్ రోడ్డు రామాటాకీస్ దగ్గర మురికి కాలువ నిండిపోయినదని ఈ విషయం 15 వవార్డు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టి కి తీసుకుపోవడంతో ఆయన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి స్పందించి కార్మికులను పంపి మురికి కాలువ ను పూడిక తీయించారని మాజి కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు ఈ మేరకు వార్డు ప్రజల తరఫున మున్సిపల్ అధికారులకు ఒక కృతజ్ఞతలు తెలిపారు
మండల పరిధిలోని గార్ల,ముల్కనూర్, చిన్నకిష్టపురం,పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, శేరిపురం,మర్రిగూడెం, పుల్లూరు,పోచారం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట,మద్దివంచ, రాంపురం తదితర గ్రామపంచాయతీలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీ పథకం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.అసౌకర్యాల నడుమ మండుటెండల్లో చెమట చిందించి పనిచేసిన కార్మికులకు 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానాన్ని పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బ్రతుకుతారని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదుల ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెబుతారని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు..
మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుమరియు బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం డిమాండ్ చేశారు. సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో జి.విజయలక్ష్మి కి అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగిరి బిక్షం మాట్లాడుతూ,2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన ఆరు వారాల డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందని అన్నారు.ఒక వారానికి 300 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పని ప్రదేశానికి వెళ్లి పని చేయడం జరిగిందని, ఇలా సుమారు మూడు నుంచి ఆరు వారాల వరకు పని చేసినా డబ్బులు కార్మికుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొంత మంది కార్మికులు పని చేసినా వారికి హాజరు వేయకుండా ఆబ్సెంట్ వేసారని అన్నారు. ఉపాధి హామీ పనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులకు డబ్బులు ఇస్తేనే బ్యాంకుల్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నారని అనేక మంది కార్మికులు వాపోతున్నారని అన్నారు.వేసవిలో ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని విమర్శించారు.ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు రెండు నుండి మూడు వారాలు డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, గ్రామ నాయకులు బి రెడ్డి సంగన్న,జరిపోతుల బుచ్చయ్య, రెడ్డి మల్ల విశ్వనాధం, సోమారపు సుధాకర్, జినక లక్ష్మీనారాయణ, ఉపాధి కూలీలు జినుక రేణుక, గాజుల వెంకన్న, అబ్బరబోయిన రేణుక, విజయ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా…
నేటి ధాత్రి -బయ్యారం :-
మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుమరియు బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి బిక్షం డిమాండ్ చేశారు. సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో జి.విజయలక్ష్మి కి అందజేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగిరి బిక్షం మాట్లాడుతూ,2024 – 2025 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలు పనులు చేసిన ఆరు వారాల డబ్బులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తుందని అన్నారు.ఒక వారానికి 300 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పని ప్రదేశానికి వెళ్లి పని చేయడం జరిగిందని, ఇలా సుమారు మూడు నుంచి ఆరు వారాల వరకు పని చేసినా డబ్బులు కార్మికుల ఖాతాల్లో పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి పనిచేసిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి డబ్బులు చెల్లిస్తున్నారని విమర్శించారు. కొంత మంది కార్మికులు పని చేసినా వారికి హాజరు వేయకుండా ఆబ్సెంట్ వేసారని అన్నారు. ఉపాధి హామీ పనిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులకు డబ్బులు ఇస్తేనే బ్యాంకుల్లో డబ్బులు పడే విధంగా చేస్తున్నారని అనేక మంది కార్మికులు వాపోతున్నారని అన్నారు.వేసవిలో ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తే వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని విమర్శించారు.ప్రతి సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు రెండు నుండి మూడు వారాలు డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉపాధి హామీ కార్మికులను సమీకరించి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, గ్రామ నాయకులు బి రెడ్డి సంగన్న,జరిపోతుల బుచ్చయ్య, రెడ్డి మల్ల విశ్వనాధం, సోమారపు సుధాకర్, జినక లక్ష్మీనారాయణ, ఉపాధి కూలీలు జినుక రేణుక, గాజుల వెంకన్న, అబ్బరబోయిన రేణుక, విజయ, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.
*చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు మంజూరు చేయా లని వినతిపత్రం అందజేత*
*పద్మశాలీలందరూ ఒక రూపాయి చెల్లించి ప్రమాద బీమా పొందాలి*
*అఖిలభారత పద్మశాలి సంఘ మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య*
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం కార్మికులకు అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీ డివో కు వినతిపత్రం అంద జేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని చేనేత కార్మికు లకు 50 సంవత్సరాలు నిండిన అర్హులైన పద్మశాలిలందరికీ జియో టాక్ షో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని, రాష్ట్రంలోనీ చేనేత కార్మికులు గతంలో 1500 మంది ఆత్మహత్య చేసుకు న్నారు ఇప్పటికీ ఆసరా పింఛన్లు కొనసాగలేదని నేటికీ పని ఉపాధి లేక అనేక ఇబ్బం దులు పడుతున్నారని రాష్ట్రం లో గత అనేక సంవత్సరాల నుండి నేటికీ చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు పింఛన్లు మంజూరు చేయాలని, రెక్కాడితే గాని డొక్కాడని పేదవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని పద్మశాలి లందరూ ఒక రూపాయి సభ్యత్వ నమోదు తీసుకొని ప్రమాద బీమా పొందగలరు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దిడ్డి రమేష్, చిందం రవి, బాసని శాంత, ప్రభాకర్, చంద్రమౌళి, వనం దేవరాజు ,రమేష్, రాజశేఖర్ ,బాలకృష్ణ, మల్లి కార్జున్, అన్ని గ్రామాల అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.
సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మిక వర్గానికి విప్లవ జేజేలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోట్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొన్నారనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారి వర్గమైన కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచుకునేందుకు వీలుగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తూనే దేశంలో అమలవుతున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా మార్చి 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్స్ గా తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కోడ్స్ లో పని భద్రత లేకపోవడం ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేకపోవడం వారానికి 70 గంటల పని విధానం తీసుకురావడం కార్మికుల కోరికలు డిమాండ్లు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ధైపాక్షిక ఒప్పందాల ద్వారా అమలుపరచుకునే విధానానికి స్వస్తి పలికి నాలుగు లేబర్ కోడ్స్ కు కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారి వర్గానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసే విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం మోడీ ఓ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మెను చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దాసరి జనార్ధన్ నామల శ్రీనివాస్ కాసర్ల ప్రసాద్ రెడ్డి రాళ్ల బండి బాబు జయశంకర్ ‘ఎండి సాజిద్ కే మధుకర్ యుగేందర్ తదితరులు పాల్గొన్నారు
జులై 09 న తలపెట్టిన ఒక్కరోజు సమ్మెకు కార్మికులు దూరంగా ఉండాలని, భూపాలపల్లి సింగరేణి ఏరియా జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు భూపాలపల్లి ఏరియా లోని కేటీకే 5 ఇన్ లైన్ గని ఆవరణలో జరిగిన సమావేశంలో జిఎం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, కొన్ని కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో జూలై 9 వ తేదీన ఒక్క రోజు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని, కానీ ఈ సమ్మెలో ఉన్నఅత్యధిక డిమాండ్లు సింగరేణి యాజమాన్యం తీర్చగలిగేవి కావని ఆయన తెలియజేశారు. సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని అటువంటప్పుడు సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన అవసరం లేదని ఆయన అన్నారు. ఫ్రీ ఏసీ గాని, కారుణ్య నియామకాలు గాని కార్పొరేటు వైద్యం గానీ చర్చల ద్వారా సాధించాము. వివిధ కారణాల వల్ల ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో మట్టి తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నామని ఆయన తెలిపారు. జూలై రాబోయే ఆగస్టు నెలలో వర్షాల ప్రభావం వల్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందనే విషయం కార్మికులకు తెలిసిందేనని లక్ష్యసాధనకు ప్రతిరోజు సాధించే ఉత్పత్తి ఎంతో తోడ్పాటును అందిస్తుందని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి నిర్దేశించిన ఉత్పత్తి సాధిస్తూ కంపెనీకి సహకరించాలని అవసరం ఉందన్నారు. కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల రుపాయలు భూపాలపల్లి ఉద్యోగులు జీతం రూపంలో నష్ట పోతారని,భూపాలపల్లి ఏరియాకి 5,90,54,120( ఐదు కోట్ల తొంబై లక్షల యబై నాలుగు వేల నూట ఇరవై రూపాయల) ఉత్పత్తికి నష్టం వస్తుందని ఆయన తెలిపారు. అందువలన తలపెట్టిన ఒక్కరోజు సమ్మెను సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి కేటీకే 5 లైన్ గని మేనేజర్ అనుగ్రహ్ నారాయణ్, సేఫ్టీ ఆఫీసర్ ఆర్.చంద్రశేకర్, వెల్ఫేర్ ఆఫీసర్ సందీప్ కుమార్, ఇతర గని అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ టియు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొనాలి,కార్మికులను బానిసత్వంలోకి నెట్టే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి.కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000/-లుగాని నిర్ణయించాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చెయ్యాలి. అసంఘటితరంగ కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్’ను ప్రవేశపెట్టాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపు పెంచాలి. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి.అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం లాంటి స్కీమ్ వర్కర్లకు చట్టపరమైన కనీస వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరు అసంతృప్తికరం
సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికుల ను ఉద్దేశించి ఏఐసిటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఆదాయము సంవత్సరమునకు సుమారు 8 కోట్ల రూపాయలని కానీ కార్మికులకు ఓ నగూరింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు పొందిన మార్కెట్ అని కార్మికులకు మాత్రం మార్కెట్ అధికారులు మార్కెట్ ఆదాయం నుండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కట్టడం లోపల నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక ప్రయోజనాలు పట్టింపు లేనట్టు మార్కెట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. అదేవిధంగా పాలకులు అసంఘటితరగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏమి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడం మూలంగా కార్మికులకు వారి యొక్క హక్కులు లేకుండా పోవుచున్నావని నిరంతరం ఎన్నో ప్రమాదాల మధ్య కార్మికులు తమ పనిని చేయుచున్నారని కానీ పాలకులకు మాత్రం కార్మికులైన వీరికి ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని వీటి సాధన కొరకు ఉద్యమాలే శరణ్యం అని కార్మికులందరూ పోరాటాలకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్న వారు వేల్పుల వెంకన్న, గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్, గద్దల సాలయ్య,బోడ వీరన్న నాయక్, ధారావత్ వీరన్న నాయక్ ,గుగులోతు లక్ష్మణ్,నేరడ వీరస్వామి,అందే భాస్కర, పుల్లన్న,మురళి తదితరులు పాల్గొన్నారు.
⏩ అర్హులకు అందని సంక్షేమ పథకాలు. ⏩ పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు.
సుంకరి మనిషా శివకుమార్. 16వ డివిజన్ కార్పొరేటర్
కాశిబుగ్గ నేటిధాత్రి:
shine junior college
గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగాయి అని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో స్థానిక పరకాల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని,గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరు అయి ప్రొసీడింగ్స్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో ఇంటి నిర్మాణ పిల్లర్లు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయురాలు అయింది అని ఆవేతరం వ్యక్తం చేశారు. పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు అందిస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పాడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలసి పోరాడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల సంజీవ,గ్రామ పార్టీ నాయకులు బొజ్జం తిరుపతి,నరసింహ,SbK అంజాద్,బొంత.రవి,ఏడాకుల మోహన్ రెడ్డి,రాజారాం,కన్నేబోయిన.రాజు,మెండురామకృష్ణ,రాజేందర్,మురళి,యశోద,అశోక్,చిరు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.
Whether you choose to walk or run, you are a child.Whether you choose to walk or run, you are a child.
ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.
ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.
రైతుల పండుగ ఎరువక.
ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.
కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, అధికారులు ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలని, ఇంటి నుండే రక్షణతో హెల్మెట్ ధరించి డ్యూటీకి రావాలని, డ్యూటీలో ఎల్లప్పుడూ రక్షణ పరికరాలు ధరించి పని చేయాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు.
మంగళవారం రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో డీజీఎం బీ బీ ఝా ఆధ్వర్యంలో స్పెషల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జిఎం దేవేందర్, బెల్లంపల్లి ఏరియా రీజినల్ సేఫ్టీ జీఎం రాజ్ కుమార్, ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్, ఏజీఎం వెంకటరమణ ,ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, ఇంజనీర్ జాకీర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు రక్షణ సూత్రాలను పాటించాలని, ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉండాలని, ఆరోగ్యం పై దృష్టి సారించాలని, ప్రతి కార్మికుడు ఆరోగ్య సింగరేణియుడి గా ఉండాలని అన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల సేఫ్టీ కోసం ప్రతిదీ సమకూరుస్తుందని, కార్మికులు సైతం సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భవ నానిర్మాణ కార్మికుల సంఘం వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి కురుమయ్య భవన నిర్మాణ కార్మికుల ను ఒక ప్రకటన లో కోరారు శనివారం నాడు వనపర్తి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐటియు జిల్లా కార్యాలయంలో మహాసభలు జరుగుతాయని ఈ కార్యక్రమంలోముఖ్య అతిథులుగా తెలంగాణభవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు హాజరవుతారని వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంధం మదన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలినిక్సన్ వనపర్తి పట్టణ కార్యదర్శి రాబర్ట్ నాయకులు బాలరాజు బాలస్వామి రవి వెంకటయ్య మన్యం తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.