మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న…

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు.

అమరావతి, ఏప్రిల్ 05: మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు. ఆదివారం అమరావతిలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఏపీ సీఆర్డీఏ మ్యాప్ చూస్తే.. సీఎం చంద్రబాబు నాయుడి విజన్ ఏమిటో జగన్ రెడ్డికి అర్థమవుతుందన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి అనుకూలంగా ఉంటే.. వైఎస్ జగన్ ఒక్కరే వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. అమరావతిపై ఉన్న కడుపు మంటతోనే జగన్ మావిగన్ పేరు ప్రతిపాదన చేశారని విమర్శించారు.అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు అమరావతి తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రూపొందించిన చట్టాలు.. రాష్ట్రాలకు మార్చే హక్కు లేదని వైఎస్ జగన్‌కు ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. బిల్లు, తీర్మానానికి గల వ్యత్యాసాన్ని తెలుసుకోవాలంటూ వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. జగన్ కుట్రలను గ్రహించాలని రాష్ట్ర ప్రజలకు ఈ సందర్బంగా పట్టాభిరామ్ స్పష్టం చేశారు.

అభివృద్ధి పాఠాలు జగన్ దగ్గర నేర్చుకోవాల్సిన పని కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. 2014లోనే కృష్ణా, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారని వివరించారు. 2015 సెప్టెంబర్ 22వ తేదీన అందుకు సంబంధించిన జీవో నెం.207 ద్వారా సీఆర్డీఏ చట్టం రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచించారని గుర్తు చేశారు.

11 సంవత్సరాలు క్రితమే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల అభివృద్ధికి సీఆర్డీఏ చట్టం తీసుకొచ్చామన్నారు. ఏపీ సీఆర్డీఏ పరిధి మచిలీపట్నం సమీపంలోని మోపిదేవి, ఘంటశాల వరకు… ఇటు గుంటూరు దాటి యడ్లపాడు వరకు ఉందన్నారు. ఏపీ సీఆర్డీఏ మ్యాప్ చూస్తే.. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో జగన్ రెడ్డికి అర్థమవుతుంది. మావిగన్ ప్రతిపాదనపై జగన్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే.. 2020లో సీఆర్డీఏ యాక్ట్ ఎందుకు రద్దు చేయాలనుకున్నారంటూ ఈ సందర్భంగా వైసీపీ అధినేతను పట్టాభి సూటిగా ప్రశ్నించారు.

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు..

అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్‌ షాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు..

https://youtu.be/VP9JpBuLDY8?si=fh8XgsOFznEJ7aOR

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు. అమరావతికి 2015లో మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్‌షాకు గుర్తుచేసినట్టు వెంకయ్య తెలిపారు (Venkaiah Naidu).

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

అమరావతి అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం కూడా చేసిందని, భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని వెంకయ్య నాయుడు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయని, కేబినెట్‌లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలిందని అమిత్ షా చెప్పినట్టు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు…

చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు

 

గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని పేర్కొన్నారు..

 గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. కుప్పంలో సీఎం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేడర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి, టీడీపీకి వచ్చిందని ప్రస్తావించారు. వైసీపీ ప్రతిపక్ష హోదాకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిందన్నారు.

అభివృద్ధికి పునాదులు వేసింది టీడీపీనే..

ప్రజలతో ఉంటే ఇలాంటి గెలుపు సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2028 నాటికి తన రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుతుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధికి పునాదులు వేసింది.. వేసేది టీడీపీనేనని.. విజన్-2020తో ఇది నిరూపితమైందని వెల్లడించారు. ప్రజల భవిష్యత్, ప్రజల సంక్షేమం కోసమే తన ఆలోచనలని తెలిపారు. భారతదేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వేలో చెప్పారని అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పామని.. చేసి చూపించామని అన్నారు. దేశంలోనే ఉద్యాన ఉత్పత్తులకు రాయలసీమ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.

రాయలసీమలో ఉద్యాన రంగం అభివద్ధి..

రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరు ప్రతి వారం విశ్లేషిస్తూనే ఉన్నానని తెలిపారు. కార్యకర్తలకు, తనకు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు పార్టీలో కూడా టెక్నాలజీని వినియోగిస్తున్నామని వివరించారు. సంక్షేమం తెస్తామని ఇంటింటికీ వెళ్లి చెప్పామని… ఆ సంక్షేమాన్ని అమలు చేస్తున్నప్పుడు కూడా ఇంటింటికీ వెళ్లాలని సూచించారు. కూటమిలోని పార్టీలతో కలిసి పని చేయాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్…

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్

 

ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.

 ఏపీకి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 80వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రూ.11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 15 బిలియన్ డాలర్ల్ ఒక లక్షా 25వేల కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్‌కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్‌గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా కోరు రాజకీయాలు చేస్తూ.. వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టే.. ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.

కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. ఎనర్జీ సోర్స్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్‌లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారత దేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. ఐదేళ్లల్లో ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వైజాగ్ – చెన్నై కారిడార్, బెంగుళూరు – చెన్నై కారిడార్, రాయలసీమ వైపు మరో కారిడార్‌లు రాబోతున్నాయని మాధవ్ అన్నారు. డిపెన్స్ క్రస్టల్స్, అతిపెద్ద రిఫైనరీ, జాతీయ రహదారుల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు పెరగడం ద్వారా అభివృద్ధి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానికి వెహికల్ తయారు చేసే కంపెనీలు, జిందాల్ సంస్థలు, పవర్ హౌస్‌లు ఏపీకి రాబోతున్నాయని.. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందని… అమరావతితో వారంతా ఆటలాడుకుని నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయించారన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారుల అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తారని వెల్లడించారు. ఏపీని అన్ని విభాగాల్లో అబివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో.. ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్థికాభివృద్ధికి దేశ ప్రజలంతా సహకారం అందించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version