బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.
