మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి…

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి

◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్…

నిరు పేదల తమ ప్లాట్లకు రక్షణ కావాలి డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐడిఎస్ఎంటి కాలనీ 158 సర్వే నెంబర్ లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చడం వెంటనే ఆపివేయాలని, తమ ప్లాట్లకు రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ బాధితులకు అండగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు… పేదలకు న్యాయం పేదలకు న్యాయం చేసే వరకు జరిగే వరకు ఈ పోరాటం ఆగదు…

హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని..

 సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.

దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం…

దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం.

పలమనేరు(నేటి ధాత్రి)
సెప్టెంబర్ 23:

 

 

గంగవరం మండలం కల్లుపల్లి పంచాయితీ బూడిద పల్లి గ్రామంలో ఓ దళిత కుటుంబం నివాసముంటున్న షెడ్డు ను కూల్చడం దుర్మార్గమైన చర్య అని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం, యువజన నాయకులు సోమరాజు, మహిళా నాయకులు రత్నమ్మ, సరస్వతి, జగదీశ్వరి అన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు కార్యదర్శి మణి అధ్యక్షతన జరిగిన సంఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బూడిద పల్లి గ్రామం వద్ద అగ్రకుల, పెత్తందారులు సుమారు 16 ఎకరాల వరకు ప్రభుత్వ భూమితో పాటు దళితులకు కేటాయించిన స్మశాన భూమిని సైతం ఆక్రమించుకున్న వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా దళిత కుటుంబంపై ఎందుకు అధికారులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారని నిలదీశారు. అదే స్థలాన్ని అగ్రకులాలు వారు ఆక్రమించుకొని ఉంటే దళితులకు కావాల్సినప్పుడు అధికారులు వారి వద్ద నుండి తీసిచ్చే సామర్థ్యం ఉందా అని మండిపడ్డారు. దళితుల షెడ్డు కూల్చివేత వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితముగా ఉన్న అధికారి కనుసన్నుల్లోనే జరిగిందని ప్రజాభిప్రాయం మేరకు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అధికారి పైన ప్రజలు గతంలో ఎన్నో ఆరోపణలు చేసి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చారని అప్పటిలో
ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారని గుర్తు చేశారు.ఒక సెంటు నేల కోసం దళిత కుటుంబాన్ని అవమానం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన మండల తహసీల్దార్, పోలీస్ అధికారులపై ఎస్సీ ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవకులుగా సేవ చేయాలనే సంకల్పముతో వచ్చే అధికారులు వ్యవహారం చూస్తుంటే అక్రమార్కులను వదిలి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా ఉందని అభివర్ణించారుబాధిత కుటుంబానికి ప్రత్యామ్నాయంగ స్థలం కేటాయించి, రక్షణ కల్పించాలని, ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థలం కోసం దళిత కుటుంబాన్ని క్షభకు గురిచేసి, మహిళ ఆత్మహత్యాయత్నానికి కారుకులైన అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారుఈ కార్యక్రమంలో శివ, నారాయణ శెట్టి, సుమతి, వాణి, నాగవేణి, చిన్నా, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, ఇతరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన ఐదేళ్లు కఠిన శిక్ష…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T123112.547.wav?_=1

 

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన ఐదేళ్లు కఠిన శిక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జర్నలిస్టులను తిట్టిన బెదిరించిన 50,000 వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్ష: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు..
దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు. పాత్రికేయులను బెదిరించిన. తిట్టిన లేదా కొట్టిన. 50, వేల జరిమానా మరియు ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు వారు అర్హులవుతారని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..
ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పుతో పలువురు జర్నలిస్టులు. తమ వృత్తిపరంగా ఎలాంటి భయాందోళనకు గురికా కుండా నిర్భయంగా ప్రజలకు వాస్తవ సమాచారం అందించే అవకాశం ఉంటుందని పలు జర్నలిస్టు సంఘాల నేతలు. సీనియర్ జర్నలిస్టులు ఈతీర్పును ఆహ్వానించారు.అలాగే రాజకీయ నాయకుల నుండి ఒక్కింత రక్షణగా సుప్రీంకోర్టు వారి ఈతీర్పు. ఉంటుందని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…

పామును చంపిన పిల్లి… ఇంటి ఓనర్స్ ను కాపాడి మరీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T114601.964-1.wav?_=2

పామును చంపిన పిల్లి… ఇంటి ఓనర్స్ ను కాపాడి మరీ

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

ఝరాసంగం: పెంపుడు జంతువులు, మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ తరుణంలోనే ఓ పిల్లి… తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. నాగుపాము బారి నుంచి ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో జరిగింది.మంగళవారం అర్థరాత్రి గొల్ల నర్సమ్మ-సిద్దన్న దంపతులు ఇంట్లో నిద్రలో ఉండగా, నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. ఈ దృశ్యాన్ని గమనించిన వారి పెంపుడు పిల్లి… ఆ పాముపై దాడి చేసి అడ్డుకుంది. వేటాడి దానిని చంపేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం లేచిన దంపతులు… ఇంట్లో చనిపోయి ఉన్న పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది పిల్లి ధైర్యంతో ఊపిరిపీల్చుకున్నారు. చంపిందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నారు

పలమనేరులో పెద్ద చెరువు రక్షణకు ఆదేశాలు…

*పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని

*అధికారులను
అదేశించిన ఎమ్మేల్యే అమర్..

పలమనేరు(నేటిధాత్రి)అగస్టు19:

పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేసారని పత్రికలలో రావడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తానని ఆ దిశగా రెవిన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్, ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వీ. రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్కల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ లతో పాటు మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

అన్నయ్య నువ్వే నాకు శ్రీరామ రక్షా

 

అన్నయ్య నువ్వే నాకు శ్రీరామ రక్షా

 

పరకాల నేటిధాత్రి
సోదర సోదరీమణుల ప్రేమను ప్రతిరూపంగా జరుపుకునే అపురూపమైన వేడుక రాఖీ.ఈ సందర్భంగా పరకాల పట్టణ మరియు మండల ప్రజలు తమ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ ప్రతి కష్టంలో సోదరులు తోడుంటారనే విశ్వాసానికి గుర్తు రాఖీ అని చెప్పవచ్చును పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు.పట్టణంలోని ఓ కాలనిలోని మామిడి అనన్య శ్రీ అనే చిన్నారి తన అన్న ఉద్భవ్ కుమార్ కు రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది.సోదర, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని ఈ పండుగ గుర్తు చేస్తుంది.సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఎల్లవేళలా అండగా,రక్షణగా ఉండాలని,అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రాఖీ పౌర్ణమిగా చెప్పవచ్చు.

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-8-2.wav?_=3

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక…. రక్షాబంధన్..!

చిట్యాల, నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శనివారం రోజున అన్న చెల్లెల అనుబంధానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలు ప్రతి ఇంటిలో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకున్నారు అలాగే అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పర్వదినం. సోదరుడికి కట్టే రాఖీలు సోదరీమణులకు రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. మండల వ్యాప్తంగా ఆడపడుచులు శనివారం రోజున రాఖీ పర్వదినాన్ని సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని జరుపుకుంటున్నారు, రాఖీ పర్వదినాన్ని రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రోజే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు, చెబుతుంటారు. అర్చకుల పంచాంగం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాఖీ పండుగను జరుపుకోవాలని ఆ సమయంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టవచ్చని వేద పండితులు తెలిపారు. సోదరుడికి రక్షాబంధన్ కట్టిన తర్వాత హారతి ఇచ్చి దీవిస్తారు, హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. ఈ పండుగ సోదర సోదరీమణులకు మధ్య ప్రేమగా గుర్తుగా పేరుగాంచింది, రాఖీ కట్టిన తర్వాత తన సోదరికి సోదరుడు తన జీవితాంతం అండగా ఉంటానని అలాగే సోదరీమణులు తన సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టి స్వీటు తినిపించి హారతిస్తారు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరుకానుక గా బహుమతి ఇచ్చి జీవితాంతం కాపాడుతానని హామీ ఇచ్చినట్లుగా భావిస్తారు, ఈ రాఖీ పండుగ వేడుకలు మండలంలోని ఆడపడుచులు ప్రభుత్వ కార్యాలయాలలో మరియు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి
తెలంగాణ జన సమితి
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ రాష్ట్రంలోబీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత భద్రత కల్పించాలని తెలంగాణ
జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష డిమాండ్ చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు మాట్లాడారు
తెలంగాణలోబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని వారు కోరారుతెలంగాణ జనసమితి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం పార్లమెంట్ లో చట్టంచేసి తొమ్మిదవ షెడ్యూల్ ఈసమావేశంలో పిక్కిలి బాలయ్యశాంతారామ్ నాయక్
కె రమేష్. తదితరులు ఉన్నారు

మొక్కల సంరక్షణకు పాటుపడాలి .

మొక్కల సంరక్షణకు పాటుపడాలి సిఐ నరేష్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తిలు పోలీస్ సిబ్బందితో కలిసి వివిధ రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ మొక్కలతోనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణకు పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు.!

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25శాతం సీట్లు ఇవ్వాలి

మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి

 

 

ప్రైవేట్ స్కూళ్లలో పేద పిల్ల లకు 25% సీట్లు కేటాయించి, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని ప్రశ్నించారు.విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 121సీ ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను
కేటాయించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చొరవతిసుకొని ప్రైవేట్ స్కూల్ లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం.

మహిళల రక్షణ,భద్రత మా లక్ష్యం

*జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ *

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.

 

జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థినిలకు గ్రామాల్లో పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుంది.

జూన్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 02 FIRలు,04 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

 

SP Mahesh B. Gite IPS

 

విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,
ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.

మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురౌవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

SP Mahesh B. Gite IPS

 

విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనేజిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ  తెలిపారు.

కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ.

*కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీ
కార్యక్రమంలో మోకుదెబ్బ నాయకులు..*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల
ప్రవేశ పెట్టిన కాటమయ్య రక్షణ కిట్లను ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి శనివారం ప్రారంభించడం
జరిగింది..జిల్లా బీసీ సంక్షేమ శాఖ, ఆబ్కారీ శాఖల ఆధ్వర్యంలో డివిజన్ లోని ఆరు మండలాలకు చెందిన 214 మంది గీత కార్మికులకు కిట్లు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పుస్పలత,కందాల శంకరయ్య గౌడ్,ఆబకారి సీఐ నరేష్ రెడ్డి,ఎస్ఐ శార్వాణి,గౌడ జనహక్కుల పోరాటం సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,పొగాకు వెంకటేశ్వర్లు, రమేష్ గౌడ్,పోగాకు సాయితేజ గౌడ్,భూపతి మల్లంపల్లి గౌడ సంఘం సభ్యులు అరేల్లి ప్రకాష్ గౌడ్, కక్కేర్ల రాజు,రమేష్,రాజు,రామకృష్ణ,
తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-

 

గచ్చిబౌలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి అనే పంచభూతాలు ప్రకృతిలో భాగమని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తూ ముందుకు సాగితే భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

protection

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రాజశేఖర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, లత, రోజా, నాయకులు సయ్యద్ గౌస్, సంఘ, దేవేందర్, అమన్, బాలరాజు సాగర్, సందీప్ ముదిరాజ్, నవీన్ ముదిరాజ్, నర్సింహ గౌడ్, టోనీ, విజయ్, కిరణ్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం

పర్యావరణ పరిరక్షణతోనే మానవమనుగడ సాధ్యం –

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు..

*ప్లాస్టిక్ భూతం నుండి పంచ భూతాలను కాపాడుకుందాం..

*చైర్మన్ సుగుణమ్మ..

*మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం –

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 05: 

 

పర్యావరణ పరిరక్షణ తోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని, ఇందుకోసం మొక్కలు పెంచాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్డు నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, కమిషనర్ ఎన్.మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ విజయకుమార్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదా శివం, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్ దూదికుమారిలు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం అయిన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కొరకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. 5090 మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. నాటిన మొక్కలను యువకులు, మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలనీ అన్నారు. బీట్ ప్లాస్టిక్ పొల్యూష‌న్ థీమ్ తో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవాణ్ని నిర్వ‌హించుకుంటున్నామ‌ని, ఒక‌సారి వాడి ప‌డేసే ఫ్లాస్టిక్ కు ప్ర‌జ‌లు దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్లాస్టిక్ పొల్యూష‌న్ త‌గ్గింపులో భాగంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఒక‌సారి వాడి ప‌డేసే ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించార‌ని ఆయ‌న తెలిపారు. ప్లాస్టిక్ విన‌యోగంతో ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం దెబ్బ‌తింటోంద‌ని ఆయ‌న చెప్పారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హరితాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నారని మనందరం వారికి సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ సంవత్సరం థీమ్ ను అందరూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు. పంచ భూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ నివారణకు అందరూ కంకనబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
నగరపాలక సంస్థ కమిషనర్, తుడా ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై నగరపాలక సంస్థ పరిధిలో 5090 మొక్కలు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో 15 వేలు మొక్కలు నాటుతున్నామని అన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మొక్కలు నాటిన తరువాత వాటిని సంరక్షించాలని అన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వినియోగించే వాటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో ప్లాస్టిక్ ను పూర్తి స్థాయిలో నిషేదించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి బాలాజి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి :

 

పర్యావరణంతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని, పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్.దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్య కారకాలైన పరిశ్రమల వ్యర్థాలు, ట్రాన్స్పోర్టేషన్ అడవుల నరికివేతపై ద్రుష్టి సారించాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్ సరిగా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రావణ్ రావు స్పెషల్ పి.పి విష్ణువర్ధన్ రావు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ జి. ప్రియాంక న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్ సంగేమ్ రవీందర్ రజినీకాంత్ భూపాలపల్లి ఎస్సై రమేష్ కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి.

కార్మిక చట్టాల పరిరక్షణపై ఉద్యమించాలి

సివిల్ సప్లై హామాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్

కేసముద్రం నేటి ధాత్రి:

ఏఐటియూసి అనుబంధ సివిల్ సప్లై హామాలి వర్కర్స్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా మహాసభ వడ్డెబోయిన లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా స్టేట్ సివిల్ సప్లై హమాలీ రాష్ట్ర అధ్యక్షులు గుంపల్లి మునిశ్వర్, ఏఐటీయూసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సంస్కరణల పేరుతో కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్పిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల వారధిగా ఉంటూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యవసర వస్తువులను సరఫరా చేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని వారు అన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేవనీ, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రేషపల్లి నవీన్, మంద భాస్కర్, చొప్పరి శేఖర్,కాసు సాయి చరణ్,పెరుగు కుమార్,వీరవెల్లి రవి, వంకాయలపాటి జకరయ్య,రాజబోయిన శ్రీను, భానోత్ రాజు, ఎల్లుట్ల నారాయణ, అల్లరి నారాయణ, కొనుకటి మల్లారెడ్డి వెలిశాల ప్రభాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన.

జై బాబు జై భీమ్ జై సంవిధన జోరుగా సాగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర….

పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం….

పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు…

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని అన్న గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారు..

హాసన్పర్తి( నేటిదాత్రి ):

 

 

 

రాజ్యంగ పరిరక్షణ లో భాగంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో
జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు లోకసభ సభ్యులు శ్రీ.రాహూల్ గాంధీ గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు హాసన్పర్తి మండల పరిధిలోని కొత్తపల్లి, మల్లారెడ్డి పల్లె అర్వపల్లి గ్రామాలలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లో ముఖ్య అతిథులుగా పాల్గొని డప్పు సప్పుడు కొడుతూ నాయకులను కార్యకర్తలను ఉత్తేజపరిచిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి పరిరక్షణ యాత్ర ను ప్రారంభించి సుమారు 5 కిలోమీటర్ల వరకు ప్రజలకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ముఖ్య ఉదేశం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని,ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు.రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు,అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.
పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా గారు అంబెడ్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు.గ్రామ మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఒక్కొకటి అమలుపరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పథకాలను కూడా కొనసాగిస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేక వ్యతిరేకమైన అంశాలను సోషల్ మీడియా ద్వారా విషం చిమ్ముతుందని అన్నారు.గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యంగాన్నీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తుంది,ప్రజల సమాన హక్కులు,సమ న్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగo ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూన్న తీరు తీవ్ర ఆక్షేపనియంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు..అందుకే రాజ్యoగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలను కాపాడుకుంటూ జై బాపు,జై భీమ్,జై సంవీదాన్ నినాదంతో ఉద్యమిద్దామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేతపాక సునీత, మహిళా అధ్యక్షురాలు జోరికపుల, నాయకులు వీసం సురేందర్ రెడ్డి, రామంచ ఐలయ్య, యూత్ నాయకులు జట్టి యుగేందర్, మంద రాజు, నితిన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version