వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్…

వారి సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు: మాధవ్

 

ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని మాధవ్ తెలిపారు.

 ఏపీకి కేంద్రం నుంచి లక్షన్నర కోట్ల సాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ (AP BJP Chief Madhav) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షా 80వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రూ.11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 15 బిలియన్ డాలర్ల్ ఒక లక్షా 25వేల కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజన్ గ్రోత్‌కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్‌గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు మాధవ్.
ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగా కోరు రాజకీయాలు చేస్తూ.. వారి వైఫల్యాలను వారే బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టే.. ఆ పార్టీ తరపున వారు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబులు అసాధ్యమైన అంశాన్ని సాధించి.. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.

కృత్రిమ మేధస్సుతో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందన్నారు. ఎనర్జీ సోర్స్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాన్ ఫ్యాక్చరింగ్‌లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారత దేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. ఐదేళ్లల్లో ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వైజాగ్ – చెన్నై కారిడార్, బెంగుళూరు – చెన్నై కారిడార్, రాయలసీమ వైపు మరో కారిడార్‌లు రాబోతున్నాయని మాధవ్ అన్నారు. డిపెన్స్ క్రస్టల్స్, అతిపెద్ద రిఫైనరీ, జాతీయ రహదారుల కనెక్టివిటీ అన్ని ప్రాంతాలకు పెరగడం ద్వారా అభివృద్ధి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఎలక్ట్రానికి వెహికల్ తయారు చేసే కంపెనీలు, జిందాల్ సంస్థలు, పవర్ హౌస్‌లు ఏపీకి రాబోతున్నాయని.. డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మన రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందని… అమరావతితో వారంతా ఆటలాడుకుని నాశనం చేశారని మండిపడ్డారు. మోడీ సారథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి 15వేల కోట్లు కేటాయించారన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారుల అనుసంధానం కాబోతున్నాయని తెలిపారు. ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఐదు వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తారని వెల్లడించారు. ఏపీని అన్ని విభాగాల్లో అబివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయన్నారు. ఓకల్ ఫర్ లోకల్ నినాదంతో.. ప్రతిఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్థికాభివృద్ధికి దేశ ప్రజలంతా సహకారం అందించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version