మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి…

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి

◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగంపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం: సాయినాథ్

రాజ్యంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి:

◆-: ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రికల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయినాథ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండలంలోని పిచరగడి పాత తండా గ్రామపంచాయతీలో గురువారం నాడు జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ లో సబ్ ఇంజనీర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జహీరాబాద్ డివిజన్ సెక్రటరీ రామావత్ సాయినాథ్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ ను సన్మానించి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామవత్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే చట్టాలు, ప్రాథమిక హక్కులు, విదులపై అవగాహన కలిగి ఉంటుందని, రాజ్యాంగం ప్రసాదించిన అన్ని అవకాశాలను షెడ్యూల్ కులాలు, గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవసోత్ శంకర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రాథోడ్ రవి ఐకెపి, రాథోడ్ వినోద్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ కొహీర్ మండలం, రామావత్ విజేందర్, కేతవత్ అనిల్ తదితరులు పాల్గొన్నరు.

బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version