సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ తాజా సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేశారని, పాత పద్ధతిలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పలుకుబడితో బీసీలను అణిచివేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని, దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.వెంటనే కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, రిజర్వేషన్ ప్రక్రియను పునర్విమర్శించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
42శాతం రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలునిర్వహిస్తే ప్రభుత్వం పై యుద్దమే…
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ *బిల్లు సత్వరమే ప్రవేశపెట్టాలి….
ఈరోజు మందమర్రి పట్టణంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో నరెడ్ల శ్రీనివాస్ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నారు. వివిధ బీసీ కుల సంఘాలతో మాట్లాడి బీసీలకు న్యాయం గా రావాల్సిన హక్కుల గూర్చి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ సవరణ కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి 42% రిజర్వేషన్ల కు రాజ్యాంగం బద్దంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. నరెడ్ల శ్రీనివాస మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 130 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు అలాగే ఏ ఉద్యమం లేకుండానే అగ్రకులాలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను ఐదు రోజుల్లో సవరణ చేసి 10% ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలుగా బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్న బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకపోవడం బాధాకరం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ ను గుర్తించి 42 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకుడు సేలంద్ర సత్యనారాయణ మైనార్టీ నాయకులు ఎండి ఎండి అబ్బాస్ సగర సంగం జిల్లా అధ్యక్షులు బర్ల సదానందం పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు చిలగాని సుదర్శన్ మరియు నాయకులు ఒజ్జా సాగర్ బాబు దూడపాక రాజేందర్ శనిగారపు జనార్ధన్ బిసి సమాజ్ నాయకులు వెన్నంపల్లి రవీందర్ అంకం సాగర్ శీలం మహేందర్ డాక్టర్ పోషం కంది తిరుపతి నస్పూరి తిరుపతి పిల్లి మల్లేష్ బర్ల శేఖర్ శేఖర్ సార్ బీసీ కుల సంఘాల నాయకులు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూరేళ్ల నితీష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బీసీలకు కల్పించాల్సిన 42 శాతం రిజర్వేషన్లు బిక్ష కాదని, బీసీల హక్కు అని జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పూరేళ్ల నితీష్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నితీష్ మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించడం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనను తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకపోతే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 42 శాతం బీసీలకు ప్రకటించి, అగ్రకులాలను ఇండిపెండెంట్ అభ్యర్థి లుగా పోటీ చేయించి, అంతిమంగా బీసీలను రాజకీయంగా ఓడించి, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి దాకా రెడ్ల రాజ్యం తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అమలు జరగకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు వ్యతిరేకంగా అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మొదటి నుండి బీసీలను కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని చెబుతున్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ 9 లో చేర్చడం కోసం కృషి చేయాలి దానికి మద్దతుగా అన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి వీడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి బీసీలకు జరుగుతున్న అన్యాయం విద్య ఉద్యోగ వ్యాపార అన్ని రంగాలలో దామాషా ప్రకారం దక్కవలసిన వాటి కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము మా కార్యాచరణ మా చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాను ప్రజలు అందరు కూడా గమనించి ఈ రెడ్డి వెలమల పార్టీలను బొంద పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్ గండు కరుణాకర్ తీన్మార్ జై అశోక్ శ్రీకాంత్ కిరణ్ పాల్గొన్నారు
భవిష్యత్తులో మరింతగా రాణించి తెలంగాణ రాష్ట్ర పేరును ప్రతిష్టను నిలబెట్టాలి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన. పాలకుర్తి ఆశ్రిత్.సాయి అనే. అబ్బాయి. జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంతో. అబ్బాయిని అభినందించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం కి చెందిన. విద్యార్థి సెప్టెంబర్ టెన్త్ రాజీవ్ నగర్ లో జరిగినటువంటి. అండర్ 14.న .జిల్లా జట్టు కోసం మొదటగా .300కు పైగా క్రీడాకారులలు. పాల్గొనగా అందులో నుండి 30 మంది. క్రీడాకారులను. సెలెక్ట్ చేయడం జరిగిందని మంచి ప్రతిభ చూసిన 18 మంది క్రీడాకారులను. సెలెక్ట్ అయ్యారని. అందులో తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి ఆశ్రిత్. సాయి అనే అబ్బాయి. సిరిసిల్లలోని మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థి జిల్లా జట్టుకు సెలెక్ట్ అయ్యాడని కరీంనగర్ లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీ జరుగుతుందని. ఈ o దుకు గాను ఈ విద్యార్థి సెలెక్ట్ అయ్యారని. ఈరోజు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇట్టి విద్యార్థిని. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందించడం జరిగిందని. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుతూ తనకు నూతన క్రికెట్ బ్యాట్ అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ తో పాటు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్. డైరెక్టర్ పొన్నాల పరశురాం. ఆరేపల్లి బాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్. గట్టు లింగారెడ్డి. మహేష్. క్రికెట్ కోచ్ చుంచుల. కిషన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
బీసీలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి, స్థానిక సంస్థలలో పెంచిన రిజర్వేషన్ల ప్రకారం అవకాశం కల్పించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు. జమ్మికుంట మండల కేంద్రం వావిలాల గ్రామంలో మంగళవారం వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇదే నెల19న బుధవారం జమ్మికుంట దినేష్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే బీసీ సదస్సుకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో గ్రామ బి సి నాయకులు కొండ అర్జున్,గొర్ల సతీష్,అందే నర్సయ్య, కనవేన సదానందం మామిడి మల్లయ్య మరియు నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రన్ పర్( పరుగు) ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ కూడలి వరకు కొనసాగిన ఈ రన్ (పరుగు) జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ కమిటీ పట్టణ అధ్యక్షుడు సకినాలు శంకర్ ఆధ్వర్యంలో బీసీ బాంధవులు ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయడం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రావలసిన హక్కులకై న్యాయపోరాటం రాజకీయ పోరాటం చేయకుంటే రేపటి తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్లకు అవుతామని, బీసీ ఉద్యమాన్ని అణగదొక్కలనీ మన స్వరాన్ని అణిచివేయడానికి పన్నుతున్న బీసీ వ్యతిరేకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మౌనంగా ఉండకుండా ఎదిరించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బీసీ బిల్ పై పార్లమెంట్లో చర్చ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరణ చేసి 9వ, షెడ్యూల్లో చేర్చాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్టాంగ ఆందోళనలు కార్యక్రమాలలో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ బిసి జస్టీస్ ఉద్యమ బీసీ జేఏసీ పిలుపుమేరకు కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నేరేళ్ల వెంకటేష్, మందమర్రి పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్ బాబు, ఉపాధ్యక్షులు దేవరపల్లి ప్రభాకర్, ఏదుల పురం రాజు, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్ల సారంగపాణి, మడ్డి వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జమాల్పూర్ నర్సోజి, మునిశెట్టి సత్యనారాయణ, పొలు సంపత్, మేడ గోని శంకర్, పోలు కుమార్, రాజలింగు, చింతల రమేష్, సిహెచ్. మహేందర్, మేడి రాజు, సముద్రాల శ్రీనివాస్, ఒడ్నాల ప్రభాకర్, ప్రసాద్, మందమర్రి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు రామ్ చందర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం శీతకాల సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి
ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ
పరకాల,నేటిధాత్రి
బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని పట్టణంలోని బస్టాండ్ కూడలివద్ద బిసి.జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు.ఈ దీక్ష శిబిరాన్ని ఆల్ ఇండియా వాల్మీకి యూత్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదా రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారంగా కుల గణన చేసి బీసీలకు విద్య,ఉద్యోగ,ఉపాధి హామీ,రాజకీయాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం నిమిత్తమై గవర్నర్ కు పంపగా గవర్నర్ ఆబిల్లును పెండింగ్ పెట్టి కాలయాపన చేసిన కూడా మరి ఒక ఛాలెంజిగా తీసుకొని జీవో విడుదల చేయడం జరిగిందని రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావలసిన హక్కు మరి రిజర్వేషన్లకు ఆ చట్టాన్ని ఉక్కు కవచం మాదిరి చేయాలంటే పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు కేటాయించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఆముదాలపేల్లి మల్లేష్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను,కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పద్మశాలి సంఘం నాయకులు పోరండ్ల సంతోష్,సమన్వయ కమిటీ సభ్యులు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,సీతారాంపూర్ మున్నూరు కాపు సంఘం నాయకులు నల్లెల్ల అనిల్ కుమార్,మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోడెల శ్రీనివాస్,గౌడ సంఘం అధ్యక్షులు బండి సదానందం గౌడ్,కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు మార్కర్ రఘుపతి గౌడ్,రజక సంఘం అధ్యక్షుడు మాదాసి రామ్మూర్తి,వడ్ల సంఘం నాయకులు బాలాజీ స్వామి,కామరెడ్డిపల్లె బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోడెల సతీష్,ముదిరాజ్ సంఘం నాయకులు దామ అనిల్,బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొమ్మాటి సతీష్,రాయపర్తి శ్రీధర్,బిసి జాయింట్ రియాక్షన్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ,ఎస్టీ జేఏసీ మండల కో ఆర్డినేటర్ చుక్క రత్నాకర్
పరకాల,నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందిందని బీసీ ఎస్సీ,ఎస్టీ జేఏసీ పరకాల మండల కో ఆర్డినేటర్ చుక్క రత్నాకర్ అన్నారు.సోమవారం నాడు స్థానిక అమరదామంలో మండల అధ్యక్షులు బొచ్చు నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై ఆక్రోషసభ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చుక్క రత్నాకర్ మాట్లాడుతూ బీసీ 42శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని,బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడకపోవడం ఏమిటని,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల రిజర్వేషన్ల పట్ల నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డికరేషన్లో బీసీ బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి,ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేసిందన్నారు.బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ మూడు పార్టీలు బీసీల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లేకుండా కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు.జస్టిస్ ఈశ్వరయ్య,రిటైడ్ ఐఏఎస్ చిరంజీవులు,డా.విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో జరుగబోయే కామారెడ్డి ఆక్రోశసభకు మండలం వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొచ్చు హరీష్,కృష్ణ మహారాజ్, తిరుపతి,దిలీప్,బాలు, తదితరులు పాల్గొన్నారు.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పైడిపల్లి రమేష్ మాట్లాడారు. జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాశిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని మండిపడ్డారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే, మద్దతునిచ్చిన పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు పైడిపల్లి రమేష్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు..కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ రోజు కార్యక్రమంనికి విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్ మద్దతు తెలిపారు… ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళ చైర్మన్ మేకల రజిత, డీఎస్పీ పార్టీ కొత్తూరీ రవీందర్ యోజకవర్గ కన్వీనర్ జోగ బుచ్చయ్య, బర్ల గట్టయ్య, కుమ్మరి సంఘం అధ్యక్షులు కొండపర్తి ఇస్తారి, రజక సంఘం నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, బండారి రవి, బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ శేఖర్ నాని,క్యాతం మహేందర్, తాటి వెంకన్న,శంకర్, రోడ్డ రవీందర్, శ్రీరాములు , పూర్ణ, తీగల సంతోష్ తదితరులు పాల్గొన్నారు
బీసీలకు 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జహీరాబాద్ మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మహారాజ్ మాట్లాడుతూ, రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 42% రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవాలి
ఎం సిపిఐ(యు )పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమార్ స్వామి డిమాండ్
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం మండల కేంద్రంలో ఎం సిపిఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ బొల్లోజు రామ్మోహన చారి, అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కామ్రేడ్ గోనె కుమారస్వామి ,మాట్లాడుతూ ఇటీవల కురిసిన మొంథా తుఫాను భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు వేసిన వరి మొక్కజొన్న పత్తి మిర్చి తదితర వాణిజ్య పంటలు మరియు గొర్రెలు మేకలు ఇతర పశువులు ఇండ్లు కూలిపోయిన కుటుంబాలను మరియు మరణించిన కుటుంబాలను తక్షణమే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. రైతులకు గత యాసంగి పంటలకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నాలుగు నెలలు దాటిన ఇవ్వకపోవడం రైతులను మోసం చేసిన ప్రభుత్వం అవి ఇవ్వకుండానే ఖరీఫ్ వానకాలపు పంటలకు బోనసిస్తామని ప్రగల్బాల్ పలుకుతున్నారని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపినారు. ఇప్పటికైనా వెంటనే బోనస్ రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం మొక్కలు తదితర వాటిని కొనుగోలు చేయుటకు ముందుకు వచ్చి పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు ఎన్నికలు జరగకపోవడం వలన గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని కేంద్రం నుంచి గ్రామాలకు రావలసిన నిధులు సుమారు 2,800 కోట్ల రూపాయలు రాకుండా పోయినాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో తక్షణమే జరపాలని డిమాండ్ చేశారు, నవంబర్ 19న ఇందిరా పార్కు దగ్గర జరిగే ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.నల్గొండ జిల్లాకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పోరాటం వలన సాధించిన శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువ కు బి.యన్.రెడ్డి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ, ఎం సిపిఐ యూ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి( యు) పార్టీ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న, జిల్లా నాయకులు నూకల ఉపేందర్, కటకం బుచ్చిరామయ్య, బొల్లోజు రామ్మోహనాచారి, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు నిరసన తెలిపారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్లను తక్షణమే 9వ షెడ్యూల్లో చేర్చాలని, దీనికై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మహేందర్ మహారాజ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీల బంద్ కు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ బిసి& ఓబిసి ఎంప్లాయిస్ అసోసియేషన్ తమ పూర్తి మద్దతు తెలపడం జరిగిందనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ కెవి శ్రీనివాసరావు తెలియజేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సభ్యులు కూడా బీసీల బంద్ కు పూర్తి సహాయ సహకారాలను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరూ కలసి ఎస్టిపిపి జిఎం. నరసింహారావు కి తమ డిమాండ్లను తెలియజేస్తూ మెమోరాండంను సమర్పించడం జరిగింది. దశాబ్దాలుగా బీసీ వర్గాలకు తగిన రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందడం లేదని దానివల్ల బీసీలు అన్ని రకాలుగా నష్టపోయారని తెలియజేశారు. బీసీ వర్గాలకు తగిన రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నిరంతర కృషి , అనేక ఉద్యమాల ఫలితంగా ప్రస్తుత గవర్నమెంటు బీసీలకు ఇటీవల బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో నెంబర్ 9 ని విడుదల చేసిందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది నాయకులు కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీసీలు రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్నా కూడా రాజకీయ, సామాజిక, విద్య, ఉద్యోగాల్లో తగిన విధంగా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా నేటి బంద్ మన బీసీ వర్గాల ఆత్మగౌరవంతో పాటు, దామాషా పద్ధతిన చట్టసభల్లో రాజ్యాంగ పదవులు సాధించడం భవిష్యత్తులో బీసీల రాజ్యమే ధ్యేయంగా ముందుకు కదలాలని కోరడం జరిగింది.
అలాగే ఈ బీసీల బంద్ కి ఎస్టిపిపి ఎస్సీ మరియు ఎస్టీ అసోసియేషన్లు కూడా తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. బిసి రిజర్వేషన్ బందుకు మద్దతు సింగరేణి బీసీ అండ్ ఓ బి సి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి రమేష్ ఆదేశానుసారంగా భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షులు మురళీమోహన్ కార్యదర్శి కురుట్ల నవీన్ కుమార్ కేటీకే 8 ఇంక్లైన్ గని మేనేజర్ కి 42% శాతం రిజర్వేషన్ కోసం రామన్న చంద్రగిరి శంకర్ రామగిరి శంకర్ కుడుదుల రాయమల్లు శ్రీనివాస్ శంకర్ మిగిలిన బీసీ సభ్యులందరూ పాల్గొని మెమోరండం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో
బిసి ఒబిసి వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టిపిపి నాయకులు పాల్గొన్నారు
బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి
వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జయప్రదం
వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భారీ నిరసన
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుంటూ వారిని అణచివేస్తూ ఆ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద విధానాలను విడనాడాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపెళ్లి రవి, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బందులో భాగంగా వరంగల్ పట్టణంలో ఎం సి పి ఐ (యు), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పెద్దారపు రమేష్,కొత్తపెళ్లి రవి, ఎలకంటి రాజేందర్,అక్కనపెల్లి యాదగిరి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బందుకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బందును జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి తక్షణమే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు పాలకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా బిసి ఓటర్లు ప్రజలు చైతన్యవంతం కావాలని మేము ఎంతో మాకు అంత వాటా కావాలని నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ నగర నాయకులు సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి న్యూ డెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్ బండి కోటేశ్వర్ జన్నారం రాజేందర్ మాస్ లైన్ జిల్లా నాయకులు చిర్ర సూరి మైదంపాని లిబరేషన్ నాయకులు రవిరాకుల ప్రసంగి జన్ను ప్రవీణ్ అప్పల శంకరాచారి ప్రజా సంఘాల నాయకులు ఐతం నాగేష్ ఎగ్గెని మల్లికార్జున్ మహమ్మద్ మహబూబ్ పాషా అప్పనపురి నర్సయ్య మాలి ప్రభాకర్ నలివెల రవి దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్..
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్ విజయవంతం చేద్దామని బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్ కోరారు.గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను విద్య, రాజకీయపరంగా అణిచివేస్తూ రాజకీయంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ వచ్చేవరకు బీసీ విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు..నాడు మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీ దాకా తీసుకెళ్లి రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు.బిసి విద్యార్థులతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఇక బీసీల ముందు చెల్లవని..బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బంద్ కు మద్దతుగా పాల్గొంటున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణలోని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలు బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలపాలని హేమంత్ కోరారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అన్నారు.బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 18న జరగనున్న బీసీజాక్ రాష్ట్ర బంద్‌కు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని రాష్ట్రంలో బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.42శాతం రిజర్వేషన్ల పరిరక్షణ అనేది కేవలం బీసీల సమస్య కాదని ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటమని రాజ్యాంగ పరిరక్షణ కోసం,సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి వర్గం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని,రిజర్వేషన్లను కాపాడుకోవడానికి చట్టపరమైన,న్యాయపరమైన వ్యూహంతో పాటు సమాజ ఐక్యత అత్యంత అవసరమని అన్నారు.ప్రభుత్వం బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయపరమైన వ్యూహం సిద్ధం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 243ఏ ప్రకారం సరైన జనాభా లెక్కలు,సామాజిక ఆర్థిక అధ్యయనం ఆధారంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం మనందరి బాధ్యత అని అన్నారు.
బీసీ బంద్ కు కాంగ్రెస్ మద్దతు – ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్ల (నేటి ధాత్రి):
బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్ రాజకీయంగా ఇవ్వాలని 18న ఇచ్చిన తెలంగాణ బంధుకు జిల్లా కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇస్తున్నామని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ కోసం కృషి చేసినమని అన్నారు. అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసుకుని కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కాంగ్రెస్ కృత నిశ్చయంతో ముందుకు పోతున్న తరుణంలో హై కోర్ట్ స్టే రావడం జరిగిందని అన్నారు. ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సంఘీభావం తెలిపారని అన్నారు. బంద్ కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందగా సహకరించాలని అన్నారు. కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతాం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుతున్నాం మాకు పూర్తి ఆశాభావం ఉందని అన్నారు. బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్దకు బిల్లులు వెళితే 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు ఒప్పించడం లేదని ప్రశ్నించారు. బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను లాక్కోవద్దని బిజెపి నాయకులను కోరుతున్నామని అన్నారు. రాజ్యాంగంలో 50 శాతం క్యాబ్ ఎక్కడా లేదు అని అన్నారు. కోర్టులో సవాలు చేసిన వారు జీఓ 9 జీవోను సవాల్ చేశారు కానీ చట్టాన్ని కాదనీ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం చిత్త శుద్ధితో మేం ముందుకు పోతున్నామని, బిజెపి నాయకులు కూడా ఆలోచన చేయాలని అన్నారు. 18న జరిగే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,బిసి అధికార ప్రతినిధి పర్ష హన్మండ్లు, చేనేత సెల్ అధ్యక్షులు గోనే ఎల్లప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, బొప్ప దేవయ్య, మేకల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎం సి పి ఐ యు, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న పిలుపు
కేసముద్రం/ నేటి ధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో రాష్ట్ర బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని ఈనెల 18వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చినందున విజయవంతం చేయాలని కోరుతూ గ్రామంలో ఎం సి పి ఐ యు -ఏఐసీటియు ల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి జరగాలంటే 42% రిజర్వేషన్స్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తదుపరి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు.బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని, ఆ దిశగా జరుగుతున్న పోరాటాలలో భాగంగా ఈనెల 18 తేదీన జరిగే రాష్ట్ర బంద్ ను ఎం సిపిఐ యు పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఆయన తెలియజేశారు.ఇట్టి బందులో ఎం సిపిఐ యు-ఏఐసిటియు కార్మిక సంఘం ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొనడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: పలుస సంపత్, కంకల శ్రీనివాస్ ,అంకిరెడ్డి వీరన్న, తండ శ్రీనివాస్, అంకిరెడ్డి రాంబాబు, ఎండి రహీం, కాకి సంతోష్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.