సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి…..

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..

దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడు కనుమరుగైనాడు..

కనిపించని బాలుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో ని మోమిన్ మొహల్లా ఈ బాలుడు నిన్న రాత్రి 8 గంటల నుండి (12/09/2025) కనిపించకుండా పోయాడు
పేరు: మొహమ్మద్ అర్బాజ్ వయస్సు: 17 సంవత్సరాలు దుస్తులు: నమాజ్ టోపీతో నల్లటి హొడ్డీ, నీలిరంగు జీన్స్. ఎవరికైనా ఈ బాలుడు కనబడితే వెంటనే ఈ సెల్ నెంబర్ కు సంప్రదించండి: 7842359943

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం

*బిట్స్ స్కూల్ విద్యార్థులకు
గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సమాజంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం, వాహనాల వినియోగం ఎక్కువ కావడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందనీ, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.పర్యావరణ అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గత నవంబర్ మాసంలో నిర్వహించిన గ్రీన్ ఒలంపియాడ్ టెస్ట్ లో పాల్గొన్న బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఈ పర్యావరణ పరిరక్షణా చర్యలు చేపట్టడాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రధాన బాధ్యతగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.
బాలాజీ విద్యార్థులు మొత్తం 183 మంది ఈ ఒలంపియాడ్ టెస్ట్ రాశారు. అందులో పదిమంది విద్యార్థులు మెరిట్ సర్టిఫికెట్ పొందగా 173 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, ప్రదీప్ చౌదరి, క్రాంతి కుమార్ మరియు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version