ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన టిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఝరాసంగం మండలంలోని హై స్కూల్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ పటేల్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య,ఆరోగ్యం,ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని తెలిపారు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ పుర ప్రముఖులు పెద్దలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్ రాజ్ వినోద టౌన్ ప్రెసిడెంట్ ఎజాజ్ బాబా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నివాళులర్పించారు,
హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు – బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ సిరిసిల్ల (నేటి ధాత్రి):
హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలను చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించేది లేదని బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భాజాప పట్టణ శాఖ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి హిందూ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అర్హత లేనిదని బాధ్యత రాహిత్యమని హిందూ సమాజం శాంతిని ప్రేమిస్తుంది కానీ అవమానాన్ని అస్సలు సహించదని అన్నారు. ఇకపై ఎవరైనా హిందూ దేవుళ్ళపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే బిజెపి ఆధ్వర్యంలో అత్యంత తీవ్రంగా ఖండించే చర్యలు చేపడతామన్నారు. హిందూ సమాజ ఏకతను బలంగా ప్రదర్శించడం బిజెపి కార్యకర్తలు ప్రజల నుండి, విస్తృతంగా స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, సీనియర్ నాయకులు గూడూరు భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు మొర శ్రీహరి, అంకారపు రాజు, కొండ ప్రతాప్,పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లికొండ నరసయ్య, మెర్గు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధులు మోర రవి, వేముల ఆంజనేయులు, చొప్పదండి శ్రీనివాస్, గూడెం సురేష్, సూరం వినయ్, సిద్ధి దేవరాజ్, ఇంజపురి మురళి, గాలి శ్రీనివాస్, చొక్కి శ్రీనివాస్, రచ్చ రాహుల్, వడ్నాల శేఖర్, వెలిశాల అభినయ్, వూరగొండ రాజు, కనకయ్య, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొంగల రాజేందర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన మహానీయుడని అన్నారు ఈరోజు ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ విద్య ఉపాధి రాజకీయ రంగాలలో ఈ స్థాయికి ఎదిగారు అంటే భారత రాజ్యాంగం వల్లనే అని ఆయన అన్నారుదేశంలో ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించి, అందరికీ స్వేచ్చను అందించిన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ.. దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బట్టు రవి బిజెపి అర్బన్ అధ్యక్షులు గీస సంపత్ కుమార్, అజ్మీరా రాజునాయక్, .టేకుమట్ల బిజెపి మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు.,పెదవెన కిరణ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు
మహనీయులు అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలి **
*మహాదేవపూర్ నవంబర్24నేటి ధాత్రి **
జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పునరుద్దించాలని రిటైర్డ్ డి.ఎస్.పి దామెర నరసయ్య అన్నారు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 18 ఓ ఇసుకలారి అతివేగంతో వచ్చి ఢీకొనడంతో విగ్రహం దంసమైనందున సమాచారం తెలుసుకొని ఆదివారం రోజున రిటైర్ డిఎస్పి దామెర నరసయ్య పరిశీలించి ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రమాదంతో అంబేద్కర్ విగ్రహం ధంసమైందని విగ్రహం స్థానంలో కౌశ్య విగ్రహాన్ని వెంటనే పునరుద్దించాలని రిటైర్ డి.ఎస్.పి ఉన్నారు ఆయన వెంట మోతే సాంబయ్య బుర్రి శివరాజు ఉన్నారు
అంబేద్కర్ విగ్రహం కు హెలికాప్టర్ తో పుష్పాభిషేకం వాల్ పోస్టర్లు విడుదల
మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుందిళ్ళ సతీష్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ పిడమర్తి రవన్న తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్,తెలంగాణ మాదిగ జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల సంఘం,ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి సంఘం చైర్మన్ అయినా డాక్టర్ పిడమర్తి రవి డిసెంబర్ 6 న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హెలికాప్టర్ తో పుష్ప అభిషేకం చేయబోతున్న కార్యక్రమం యొక్క వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది.ఈ ప్రోగ్రాంను పెద్ద మొత్తంలో విజయవంతం చేయవలసిందిగా మంచిర్యాల నుండి పెద్ద సంఖ్యలో వేలాది మంది తరలి రావలసిందిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సుందిళ్ళ సతీష్ పేర్కొన్నారు.ఎస్సీలకు ఇంటింటా సర్వే ఆధారంగా 20% జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్బంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే చలో ఖమ్మం కార్యక్రమంలో భాగంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ లంకదాసరి అశోక్ అధ్యక్షతన పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కళ్ల పల్లి శ్రీనివాసరావు కార్మిక నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బస్టాండ్ కూడలి వరకు పాదయాత్రగా వెళ్లడం జరిగింది.ఈ సందర్బంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలిత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని బ్రిటిష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు ఎ
న్నో పోరాటాలు చేసిందని భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజామును గద్దెదించటానికి జరిగిన మహత్కార తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో 3000 గ్రామాలకు విముక్తి జరిగించి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ దేనని ఆయన అన్నారు. భారత గడ్డపై సిపిఐ కి వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి దినమంతా ఏకమై కదిలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలవెన శంకర్ సిపిఐ కార్య వర్గ సభ్యులు,మరుపాక అనిల్ కుమార్ డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,దుప్పటి సాంబయ్య సీపీఐ సీనియర్ నాయకులు,సదా విజేయ లక్ష్మీ తదితర నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రన్ పర్( పరుగు) ప్రారంభించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం నుండి మార్కెట్ కూడలి వరకు కొనసాగిన ఈ రన్ (పరుగు) జాతీయ బీసీ సంక్షేమ సంఘం మందమర్రి పట్టణ కమిటీ పట్టణ అధ్యక్షుడు సకినాలు శంకర్ ఆధ్వర్యంలో బీసీ బాంధవులు ఈ రన్ లో పాల్గొని విజయవంతం చేయడం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రావలసిన హక్కులకై న్యాయపోరాటం రాజకీయ పోరాటం చేయకుంటే రేపటి తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్లకు అవుతామని, బీసీ ఉద్యమాన్ని అణగదొక్కలనీ మన స్వరాన్ని అణిచివేయడానికి పన్నుతున్న బీసీ వ్యతిరేకులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మౌనంగా ఉండకుండా ఎదిరించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బీసీ బిల్ పై పార్లమెంట్లో చర్చ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరణ చేసి 9వ, షెడ్యూల్లో చేర్చాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్టాంగ ఆందోళనలు కార్యక్రమాలలో భాగంగా
రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ బిసి జస్టీస్ ఉద్యమ బీసీ జేఏసీ పిలుపుమేరకు కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నేరేళ్ల వెంకటేష్, మందమర్రి పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల సతీష్ బాబు, ఉపాధ్యక్షులు దేవరపల్లి ప్రభాకర్, ఏదుల పురం రాజు, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్ల సారంగపాణి, మడ్డి వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు జమాల్పూర్ నర్సోజి, మునిశెట్టి సత్యనారాయణ, పొలు సంపత్, మేడ గోని శంకర్, పోలు కుమార్, రాజలింగు, చింతల రమేష్, సిహెచ్. మహేందర్, మేడి రాజు, సముద్రాల శ్రీనివాస్, ఒడ్నాల ప్రభాకర్, ప్రసాద్, మందమర్రి పట్టణ రజక సంఘం అధ్యక్షుడు రామ్ చందర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగవ స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణం అని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం,పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్,రాజు పటేల్,రమేష్ రెడ్డి,రాజు,నరేష్ స్వెన్, రాయలింగు,వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్,పడాల సంతోష్,పార్వతి సురేష్, పార్వతి రాజేష్,సిద్దార్థ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిని ఒక ఆధునిక మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని ఈ నిధులతో రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యాలు, పట్టణ సౌందర్య వృద్ధికి, జయశంకర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ వెడల్పు,పలు అభివృద్ధి పనులు అమృత్సర్ స్కీం కింద 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవనానికి ఐదు కోట్ల రూపాయలు, గిరిజన భవనానికి కోటి రూపాయలు వెచ్చించామని తెలిపారు.ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, పి.సి.సి సభ్యులు చల్లూరి మధు పిప్పాల రాజేందర్ ముంజల రవీందర్ అప్పం కిషన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు ,నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు బీసీ రిజర్వేషన్ల అమలుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పట్టణంలో మోటార్ సైకిళ్ళ పై తిరుగుతూ బంద్ కు సహకరించాల్సిందిగా దుకాణ దారులను వ్యాపారస్తులను కోరడంతో తమ తమ దుకాణాలను మూసి వేసి బంద్ కు మద్దతు తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి మెమోరాండం సమర్పించారు
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ వర్గాలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తానే కోర్టులో కేసులు వేయించి స్టే తెచ్చుకున్న తీరు ప్రజలను మోసం చేసే దానికి నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తీరుపై
బీసీ జేఏసీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద నిరసన తెలిపారు .ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిములు ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల బిసి సెల్ అధ్యక్షులు అమీత్ కుమార్ బిసి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ లు నాయకులు షికారి గోపాల్,బరూర్ దత్తాత్రి , శంకర్ సాగర్, రాజు శంకర్ బిసి జేఏసీ నాయకులు పెద్దగొల్ల నారాయణ కొండా పురం నర్సిములు విశ్వనాధ్ బిసి మైనారిటీ నాయకులు ఇమ్రాన్ బిసి సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
బీసీ రిజర్వేషన్ల అమలుకు బీసీ జేఏసీ జహీరాబాద్ లో వ్యాపార సంస్థలు మూత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ము(సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బందు ప్రకటించడం జరిగింది. ఈ బంద్ జహీరాబాద్ పట్టణంలోని భవాని మత మందిర్ చౌరస్తా నుండి బైక్ లపై ర్యాలీగా బయలుదేరి డా.బీ.ఆర్ అంబెడ్కర్ గారికి విగ్రహానికి పూవుల మాల వేసి పాస్తాపూర్ చౌరస్తా వరకు అన్ని షాపులు ముహించడం జరిగింది .ఆ తర్వాత బస్టాండ్ ముందు ధర్నా చేసి స్థానిక ఎమ్మార్వో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెలంగాణలో బీసీలకు రావలసిన నలబై రెండు శాతం రిజర్వేషన్ లు ఇవ్వాలని లేని పక్షంలో ఏ పార్టీ అయినా బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేనిపక్షంలో భవిషతులో తగిన కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు డా. పెద్ద గొల్ల నారాయణ, కొండాపూర్ నర్సిములు, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర, వేణు కాడిగే, వడ్డే శేఖర్, సాధన కృష్ణ,మాక్కుసూద్,మాదినం శివ కుమార్,ఇమ్రాన్,బీసీ నాయకులు హుగెల్లి రాములు,అడ్వై్కేట్ శంకర్, మహేష్ ముదిరాజ్, బీ.ఆర్ యస్ నాయకులు తట్టు నారాయణ, నర్సిములు కోహిర్, వెంకటేశం, శిఖరి గోపాల్, వెంకట్ సాగర్,అమిత్ కుమార్,దత్తు ముదిరాజ్, బిజెపి పార్టీ నాయకులు నావబాత్ జగనత్, సుదీర్ బండారి, పూల సంతోష్, విశ్వనాధ్ స్వామి,వైద్యనాథ్, విశ్వనాధ్, సురేష్ పూరి, మాలశెట్టి,సతీష్ రాయచూరు గుప్తా, సుభాష్, మోహన్ చాకలి మరియు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మహేందర్ మహారాజ్, పెంటయ్య, వీవిధ కుల సంఘాల నాయకులు సంగప్పముదిరాజ్,భీర్ గొండ,మంగలి దత్తత్రి, చాకలి శ్రీనివాస్, శిఖరి శ్రీనివాస్,రవికాంత్, మల్లేష్, గొల్ల శ్రీనివాస్,సందీప్ దాదా,మడపతి స్వామి తో పాటు అన్ని కుల సంఘాలు వ్యాపారస్తులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందే ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం తెలంగాణ బంద్ నిర్వహించింది.ఈ బంద్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కొరకు సర్వే నిర్వహించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపియడం జరిగింది. బీసీలకు 42 శాతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారని దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గవర్నర్ ను మధ్యలో అడ్డు పెట్టుకొని నాటకం చేస్తుందని విమర్శించారు.అందుకే గవర్నర్ గారు అట్టి ఆర్డినెన్సును ఎటు తేల్చకుండా పెండింగులో పెట్టారు అన్నారు.అని దీనికంతటికీ ముఖ్య కారణం కేంద్రలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని విమర్శించారు. మాకు కోర్టుల మీద గౌరవం,నమ్మకం ఉంది.కావునా బీసీ లందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ సుంకరి రామచంద్రయ్యా అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసీ సభ్యులు చల్లూరి మధు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల వ్యతిరేకులకు సద్బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ కు వినతి
‘బంద్ ఫర్ జస్టిస్’ ను విజయవంతం చేయాలని సబ్బండ వర్గాలకు బిసి జేఏసీ పిలుపు
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
తెలంగాణలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి బిసి జెఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చందానగర్ లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిసి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్న వ్యతిరేక శక్తులకు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రాన్ని జేఏసీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ కో చైర్మన్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, తెలంగాణ బిసి కుల సంఘాల జేఏసీ కన్వీనర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జేఏసీ నాయకులు తుడి ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, బిసి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ లు మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం వచ్చిన నాటినుంచి నేటి వరకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేవలం బిసి లకు మాత్రమే లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
బిసి లకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 18 వ తేదీన బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తలపెట్టిన తెలంగాణ బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కె సాయన్న ముదిరాజ్, బీసీ జేఏసీ నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, సగర సంఘం రాష్ట్ర సలహాదారులు కెపి రామ్ సగర, సగర సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సగర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుక శ్రీనివాస్ సగర, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గంగాధర్ సగర, జేఏసీ నాయకులు జిల్ల గణేష్, సీతారాం సగర, రామకృష్ణ సగర, అశోక్ యాదవ్, నరసింహ, శంకర్ ముదిరాజ్, బాలరాజు సగర, నారాయణ రావు, శివశంకర్, ఆంజనేయులు సగర, చింతకింది రవీందర్ గౌడ్, కుమార్ యాదవ్, చెన్నం రాజు ముదిరాజ్, చందు సగర, శివ సగర, రాము, తిరుమలేష్, అడ్వకేట్ రమేష్, అంజమ్మ, మాధవి, బిక్షపతి, వెంకట నర్సింహా రావు, రమేష్ గౌడ్, రాజు ముదిరాజ్, మధుకుమార్, పెద్ద సంఖ్యలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు,
బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి
బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత
రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..
అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షుడిగా దాసరి అనిల్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష పదవి ఎన్నికలకు దాసరి అనిల్, రేణుకుంట అశోక్ లు తలపడగా మొత్తం నూట తోంబై ఎనిమిది ఓట్లు పోలవ్వగా రేణుకుంట అశోక్ బ్యాట్ గుర్తుకు ఎనభై ఏడు ఓట్లు, దాసరి అనిల్ బాల్ గుర్తుకు నూట పదకొండు ఓట్లు వచ్చాయి. దాసరి అనిల్ ఇరవై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసందర్భంగా దాసరి అనిల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కెటిపిపి ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజని, భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని దాడికి పాల్పడిన వారికీ తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు సనతన దర్మం పిచ్చి ఎంత ముదిరింది అంటె దళితుడు ఐన సుప్రీంకోర్టులో సిజేఐ గవాయ్‌పై బూటు విసిరె స్థాయికి చేరింది.ఈ చర్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లు అందరు తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ & ఎస్టీ జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు
పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం
గాడిన పెడ్తున్న ప్రభుత్వం పై విమర్శలు సిగ్గుచేటు
కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకా నికి తెరలేపారని కాంగ్రెస్ మం డల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి విమర్శిం చారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాకీ కార్డులు పంపిణీ చేసిన నేప థ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భూ మి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు .
తదనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశా రని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయ త్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణ మాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ బాకీలు:
పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి బాకి
శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్య కర్తల కష్టంతో గెలిచి,వారి సతీమణికి పదవితెచ్చుకు న్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పిఎసిఎస్ భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణా రెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి . అట్టి రూపాయ లను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లా డాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీ డింగ్స్ తెచ్చి కట్టిస్తా అన్నారు. కట్టించారా!డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బం దులు పెట్టడం వాస్తవం కాదా!సుమారు 200 డబుల్ బెడ్రూ మ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా!జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా.మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి. ఎవరు నడపాలి.అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీటికి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నాను జయప్రదం చేయండి.. ఎఐబియస్పీ.
పలమనేరు(నేటి ధాత్రి) అక్టోబర్ 01:
అక్టోబర్ 9వ తేదీ మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ ఐ బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం కోరారు. అందులో భాగంగా జయరామ్ గౌడ్ , సోమరాజు, మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన పలమనేర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ధర్నా కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా డివి మునిరత్నం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ లను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బిజెపి, దాని అనుబంధ సంఘం ఆర్ఎస్ఎస్ రెండు కలిసి రాజ్యాంగంలోని లౌకిక- సామ్యవాదం అనే రెండు పదాలను తొలగించాలని ముమ్మరంగా ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.ఆ రెండు పదాల తొలగింపు విషయములో సుప్రీం కోర్ట్ స్పందించి లౌకిక, సామ్యవాదం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నందున తొలగించరాదని తీర్పు ఇచ్చినప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్నే మార్చే ప్రక్రియకు ఆర్ఎస్ఎస్ బిజెపి శ్రీకారం చుట్టాయి అన్నారు.ఆ రెండు పదాలు తొలగించడం వలన దేశంలోని 80% మంది ఎస్సీ ,ఎస్టీ ,బీసీప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. బడుగు, బలహీన, వర్గాలకు ప్రాథమిక హక్కులుగా లౌకికత్వం, సామ్యవాదం పునాదులుగా ఉంటాయని గతంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయులలో మత సంబంధమైన వివక్ష ఉండరాదని, తమకు ఇష్టమైన మతాన్ని పాటించి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో భాగమేనన్నారు. బిజెపి ,ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి దేశ ప్రజలకు నిత్యం సవాలుగా మారుతున్న మతతత్వం పెట్టుబడిదారీ విధానాలను తీసుకురావాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు,ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బిజెపికి అనుకూలంగా ఉండే నాయకుల చేత సనాతన ధర్మం, మనువాద శాస్త్రాన్ని బలవంతంగా ప్రసంగాల్లో చెప్పిస్తున్న విషయం నగ్న మెరిగిన సత్యం అన్నారు.దేశ ప్రజలకు ఇష్టం లేని మతతత్వం పెట్టుబడి దారి విధానాలను కష్టంగా రుద్దాలని చూస్తున్న బిజెపి ,ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం,క్రైస్తవ మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల 9వ తేదీ విజయవాడ నగరంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ లౌకిక, సామ్యవాద పదాలను తొలగించరాదు అనే నిరసన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, సాంబశివ, వాణి, శాంతమ్మ, చిన్న, మనోహర్, వెంకటపతి, షేట్, శ్రీనివాసులు, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం ఇంకా పూర్తి కాలేదు. కానీ శనివారం ఓ సభలో ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేసి హాట్ టాపిక్‌గా నిలిచారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections 2025) సమీపిస్తున్న వేళ కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ జనతాదళ్ (RJD)నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ఓ సంచలన ప్రకటన చేశారు. ముజఫర్‌పూర్ కాంతిలో జరిగిన బహిరంగ సభలో ఈసారి బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ధీమాగా ప్రకటించారు. తేజస్వి ముఖం చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు
దీంతోపాటు తేజస్వి యాదవ్ ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కేవలం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీహార్ నుంచి ఓట్లు, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు.. ఇలాంటి ఎత్తుగడలు ఇక పని చేయవని వ్యాఖ్యానించారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. కాంతిలో బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
మహిళల కోసం లక్షన్నర హామీ
ప్రభుత్వం తమ ఒత్తిడితోనే పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రకటించిందని తేజస్వి అన్నారు. మేము ముందుంటాం, ప్రభుత్వం తమను అనుసరిస్తుందని సెటైర్ వేశారు. ఆర్‌జేడీ మై బెహన్ యోజనను కాపీ చేస్తూ ప్రభుత్వం 10 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి మహిళకు లక్షన్నర రూపాయలు అందిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరం కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.అవినీతిపై ఆరోపణలుఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ 80 వేల కోట్ల రూపాయల లెక్కలు చూపడం లేదని తేజస్వి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎలుకలకు రక్షణ కల్పిస్తోందని ఎద్దేవా చేశారు. వంతెనలు కూలుతున్నాయని, ఆసుపత్రుల్లో రోగులకు రక్షణ లేదని విమర్శించారు. ఇలాంటి సమయంలో అవినీతిపరులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తేజస్వి ఆగ్రహం వ్యక్తం చేశారు.సీట్ల గందరగోళంమహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదు. 2020 ఎన్నికల్లో ఆర్‌జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు మాత్రమే గెలిచింది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ఓటర్ల హక్కులపై ఓట్ల చోరీ అనే విషయంపై బలంగా పోరాడింది.ఈ క్రమంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలపడిందని కాంగ్రెస్ నమ్ముతోంది. దీంతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా, లోక్ జనశక్తి పార్టీ వంటి కొత్త పార్టీలు కూడా ఈసారి ఈ కూటమిలో భాగమయ్యాయి. ఈ క్రమంలోనే తేజస్వి యాదవ్ 243 సీట్లలోనూ పోటీ చేస్తామని చేసిన ప్రకటన కూటమిలో గందరగోళాన్ని సృష్టించింది.
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ 3 లో ఉన్న 26 కులాల మాలలకు అన్యాయం చేసే విధంగా జీవో 99లో భాగమైన ఎమ్మెల్యేలను ఇట్టి జీవో 99 పై పునరాలోచన చేసి అసెంబ్లీలో చర్చించి మాలలకు న్యాయం చేకూర్చలని సోమవారం జాతీయ మాల మహానాడు పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు పరకాల పట్టణ అధ్యక్షులు బండారి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శాంతియుతంగా ముట్టడి కార్యక్రమం చేపట్టారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అందుబాటులో లేని సందర్భంగా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రాజి రెడ్డికి మరియు పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేసి జీవో 99పై పునరాలోచన చేసేవిధంగా సమాచారాన్ని అందజేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు,రాష్ట్ర కార్యదర్శి తుప్పరి నరసింహస్వామి,జిల్లా నాయకులు పసుల లక్ష్మీనారాయణ,గీసుకొండ మండల అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్,ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు న్యాతకాని వనం,మాల మహానాడు నాయకుడు దుబాసి వెంకటస్వామి,జిల్లా నాయకులు తుప్పరి నర్సింగా రావు,పరకాల పట్టణ మాల మహానాడు ఉపాధ్యక్షులు బండారినాగార్జున,అంకేశ్వరపు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.