సిపిఐ పార్టీ 100 ఏండ్ల ముగింపు సభను జయప్రదం చేయండి..
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సిపిఐ పార్టీ 100 ఏండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మం లో జరిగే ముగింపు సభను జయప్రదం చేయాలని, ఈనెల 15 న చోడే ఘాట్ నుండి భద్రాచలం వరకు జరిగే బస్సు జాతరను జయప్రదం చేయాలని మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోరారు. జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు జరిగే బస్సు జాతర కరపత్రాలను రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. బస్సు జాతర కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ ,రాష్ట్ర ప్రచార కార్యదర్శి మారుపాక అనిల్, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు బస్సు జాతర వెంట ఉంటారని తెలిపారు. శతజయంతి ఉత్సవాలు, ఖమ్మంలో జరిగే ముగింపు భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు ఇప్పకాయల లింగయ్య జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, మనం సత్యనారాయణ, మామిడి గోపి, రాములు, దేవానంద్, చందర్, శంకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
