బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి
బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత
రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..