కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ
ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
నర్సంపేటకు చేరుకున్న సిపిఐ బస్సు యాత్ర
నర్సంపేట,నేటిధాత్రి:
కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే సమాజంలో ప్రజలకు రక్షణ ఉంటుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల బస్సు యాత్ర గురువారం నర్సంపేటకు చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో పంజాల రమేష్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రానున్న రోజులలో కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని, ప్రజలు చట్టసభల్లో కమ్యూనిస్టులు బలంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సిపిఐ ఉద్యమిస్తున్నదని పేర్కొన్నారు. అనేక రంగురంగుల జెండాలు వచ్చి పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని,
ఎన్నికల సమయం లో ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కి దోపిడీ వర్గాలకు పాలకవర్గాల కొమ్ముకాస్తున్నాయన్నారని ఆరోపించారు.
పెదోళ్లకు ప్రభుత్వ విద్య అందుకోవడం లేదని కార్పొరేట్ విద్యా సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారా అందిస్తున్నాయని తెలిపారు.గడిచిన వందేళ్లలో ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత సిపిఐ పార్టీ కే దక్కుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు మాట ఇచ్చి తప్పిందని చెప్పారు.దేశంలో కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని లేకపోతే పాలక పార్టీలు ధనిక , బహుళ జాతి కంపెనీల కొమ్ము కాస్తయి అన్నారు.నర్సంపేట పట్టణంలో అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన గుడిసేవాసులకు నేటికీ పట్టాలు ఇవ్వలేదని ప్రభుత్వాలను దుయ్యబట్టారు.గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం వెనుకబడుటానికి ప్రభుత్వాలే కారణమని ఎరువుల ధరలు పెరిగిన నియంత్రించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుచేటు అన్నారు . దేశంలో సమస్యలు పరిష్కారం జరగాలంటే పేదవాని రాజ్యాస్థాపన కోసం పోరాటం చేయక తప్పదని చెప్పారు.ర్రజెండా పార్టీలు ఏకతాటి పైకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చెందే విధంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ నాయకులు రహమాన్, సిపిఐ వరంగల్,హనుమకొండ జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శులు ఎస్కే బాష్మియా, కర్రి బిక్షపతి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆధార శ్రీనివాస్, వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు అయిత యాకయ్య, కందిక చెన్నకేశవులు,అక్కపెళ్లి రమేష్, జిల్లా సమితి సభ్యులు మియాపురం గోవర్ధన్, చింతకింది కుమారస్వామి, అనంతరెడ్డి వీరు నాయక్, గడ్డం నాగరాజు,పిట్టల సతీష్,ఇల్లందుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
