బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి విడనాడాలి…

బీసీ రిజర్వేషన్లపై ద్వంద వైఖరి విడనాడాలి

బీసీ బందుకు బిజెపి మద్దతు సిగ్గుచేటు

బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి

వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జయప్రదం

వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భారీ నిరసన

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను వాడుకుంటూ వారిని అణచివేస్తూ ఆ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద విధానాలను విడనాడాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సిపిఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపెళ్లి రవి, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బందులో భాగంగా వరంగల్ పట్టణంలో ఎం సి పి ఐ (యు), సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు పెద్దారపు రమేష్,కొత్తపెళ్లి రవి, ఎలకంటి రాజేందర్,అక్కనపెల్లి యాదగిరి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బందుకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బందును జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి తక్షణమే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు పాలకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా బిసి ఓటర్లు ప్రజలు చైతన్యవంతం కావాలని మేము ఎంతో మాకు అంత వాటా కావాలని నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ నగర నాయకులు సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి న్యూ డెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్ బండి కోటేశ్వర్ జన్నారం రాజేందర్ మాస్ లైన్ జిల్లా నాయకులు చిర్ర సూరి మైదంపాని లిబరేషన్ నాయకులు రవిరాకుల ప్రసంగి జన్ను ప్రవీణ్ అప్పల శంకరాచారి ప్రజా సంఘాల నాయకులు ఐతం నాగేష్ ఎగ్గెని మల్లికార్జున్ మహమ్మద్ మహబూబ్ పాషా అప్పనపురి నర్సయ్య మాలి ప్రభాకర్ నలివెల రవి దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

పోరాట మార్గంతోనే సమస్యల పరిష్కారం…

పోరాట మార్గంతోనే సమస్యల పరిష్కారం.

42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి

ఈనెల 11న కలెక్టరేట్ వద్ద ఆందోళన

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ ఓంకార్ పాత్రపై ఈనెల 12న రాష్ట్ర సదస్సు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కేంద్రంలో,రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో పేరుకుపోతున్న స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ గందరగోళపరుస్తున్న భారతీయ జనతా పార్టీ తీరు పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.ఎంసిపిఐ(యు) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కార్యదర్శి కామ్రేడ్ మాలోత్ సాగర్ అధ్యక్షతన వరంగల్ పార్టీ ఆఫీసులో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలను మభ్యపెడుతూ కపటనాటకం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు రాష్ట్రంలో వలె షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని డిమాండ్ చేశారు.రాజకీయ స్వార్థం కోసం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించకుండా స్థానిక సమస్యలు పేరుకుపోయే విధంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతున్నారని పేర్కొన్నారు. అందుకని తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు కార్యక్రమాలు చేపట్టాలని అలాగే అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవంలో భాగంగా తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో ఓంకార్ పాత్రపై ఈనెల 12న తొర్రూరులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 17న వారోత్సవ ముగింపు ప్రదర్శన సదస్సు వరంగల్ పట్టణంలో జరుగుతుందని కాగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 12న జరిగే రాష్ట్ర సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, నగర నాయకులు ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ పాషా, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, తాటికాయల రత్నం, పోలేపాక రవీందర్, దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు…

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

యంసిపిఐ(యు) మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు,ఎంసిపిఐ(యు) పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.నర్సంపేట ఓంకార్ భవన్ లోఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాజస్థాన్ కోటా తల్వాండిలో అమరత్వం పొందిన పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ శంకర్ ఝా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి విజయ్ శంకర్ ఝ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ మోహన్ పునామియాతో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప మార్క్సిస్ట్ నాయకుడని ఉన్నారు. కామ్రేడ్ ఓంకార్ చూపిన బాటలో బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఐక్య ప్రజానాట్యమండలి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న వంగల రాగసుద, పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు,నాగెల్లి కొమురయ్య, కనకం సంధ్య, జిల్లా నాయకులు మాలోత్ సాగర్,సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం,ఐతమ్ నాగేష్, మాలోత్ మల్లికార్జున్, ప్రభాకర్,ఓదేలు దాసు కుమారస్వామి,నరసయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version