కామ్రేడ్ గుండా మల్లేష్ సేవలు మరువలేనివి..
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సీపీఐ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం గుండా మల్లేష్ ఐదవ వర్ధంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సీపీఐ నాయకుల తో కలిసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిం చాలంటే ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పరితపించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.