మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేయాలి

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేయాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి:

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేయాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీసు ఆవరణలో జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి విదేశీ పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా విధానాలను రూపొంది దేశీయ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఈ క్రమంలో కార్మికుల రైతుల ప్రజల హక్కులను హరించే విధంగా గతంలో ఉన్న చట్టాలను కాలరాస్తూ నియంతృత్వ విధానాలను రూపొందిస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి కొత్త చట్టాన్ని తెచ్చింది అన్నారు. ఉగ్రవాదం మతోన్మాదం పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో తుంగలో తొక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై, ఎన్నికల హామీల అమలుకై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ శాఖలను నిరంతరం కదలికలో ఉంచాలని కోరారు. రాజకీయ విలువలను కాపాడేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, మంద రవి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, కుసుంబా బాబురావు,వంగల రాగసుధ, నాగేల్లి కొమురయ్య, మాలోత్ సాగర్, సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం,దామ సాంబయ్య, మాలోత్ ప్రత్యూష, ఎగ్గని మల్లికార్జున్, అప్పనపురి నరసయ్య, మాలి ప్రభాకర్,గణిపాక ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ కోసం “బంద్ ఫర్ జస్టిస్” ర్యాలీ…

బీసీ రిజర్వేషన్ల పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం*

-బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ లో వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : భవాని మందిర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు స్వచ్ఛంద బంద్ కు బీసీ బంధువులు మరియు అన్ని పార్టీల బీసీ కార్యకర్తలు తమ తమ మద్దతు తెలుపాలని మనం బీసీలు అందరం ఏకతాటికి రావాలని మనకు జరిగినా అన్యాయాన్ని ఈ బంద్ ధార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీసీ జేఏసీ నెంబర్లు కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాలు మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీ సోదరులు మరియు బిజెపి పార్టీ బీసీ సోదరులు జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జహీరాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి బీసీ బందులు. ఈరోజు అతిధి హోటల్లో బీసీ తాలుక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది
రేపు జరగబోయే బంద్ కు తమ తమ మద్దతు తెలుపుతున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ ,, కోహిర్ మండల్ మాజీ జెడ్పిటిసి , నర్సింలు,, కొండాపురం నరసింహులు, విశ్వనాథ్ యాదవ్ బిజెపి, తట్టు నారాయణ , బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేశం బిఆర్ఎస్ జర సంఘం మండల్ మొహమ్మద్ఇమ్రాన్, బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, శంకర్ సాగర్ బి సి,,. జగన్ బిజెపి,మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదిపర్లు పాల్గొనడం జరిగింది

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది….

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది

#పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇంటి కలను సాకారం చేస్తాం.

#అర్హులైన ప్రతి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

#వెంకటాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశానికి హాజరై ప్రారంభించిన ….

#రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

పేదల కలల్ని సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీ కి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బయ్యా ప్రమీల ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవనోపాధికి చిహ్నంగా నిలిచిందని మంత్రి సీతక్క అన్నారు.
పేదల బాగోగుల పట్ల శ్రద్ధచూపడం అందులో భాగమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అంటేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వస్తోందని, పేద ప్రజల కలల ఇళ్ల రూపంలో ప్రతిబింబించడానికి ఈ పథకం దోహదపడిందని మంత్రి వివరించారు.
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో బీసీ రిజర్వేషన్ బందుకు సిపిఐ మద్దతు…

బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని
హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి.
బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.
పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి .
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్.
తదితరులు పాల్గొన్నారు ,

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయిపై దాడి నిందనిరసన…

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి- అనిల్ బెజ్జంకి

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డారు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈదాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈదాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అందువల్ల దేశ ప్రజలందరూ ఈదాడిని ఖండించారని, దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహం పూరితంగా ఈదాడికి తెగపడ్డారని, ఈదాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈడిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో
తునికి వసంత్ మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, కనకం అంజిబాబు మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, చిలుముల రాజయ్య మాదిగ, ఎల్కపెల్లి పౌలు మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, బొద్దులవాని మాదిగ, దండు అంజయ్య మాదిగ, అంతడుపుల సంపత్ మాదిగ, అలువాల సంపత్ మాదిగ, రేపాక బాబు మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ, కనకం నరేష్ మాదిగ, శనిగరపు కొమురయ్య మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కళ్లెపెల్లి కొమురయ్య మాదిగ, అన్నీవేణి కౌసల్య, దేవసాని ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు

యూరియా కొరత సృష్టించింది కేంద్రం.

యూరియా కొరత సృష్టించింది కేంద్రం

తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం…?

గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, కొద్ది మొత్తంలో వచ్చిన యూరియా పంపిణీలో పూర్తిగా సహకరిస్తున్న మహబూబాబాద్, కేసముద్రం పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియచేసిన కేసముద్రం విలేజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్.ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ… కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనం చేయడానికి పూనుకొని రైతులకు లేనిపోని అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఒక అవగాహన లేకుండా బదనం చేస్తున్నారని కావున రైతులందరూ ఎవరు ఈ యూరియా కొరతకు కారణం ఏ ప్రభుత్వం అనేది పూర్తిగా తెలుసుకోవాలని రాష్ట్రానికి సరిపడా యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ముందు ధర్నా చేసిన ఏ ఒక్కరు రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోగా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మాత్రం కంకణం కట్టుకున్నారని, రాష్ట్రంలో బిజెపి ఎంపీలు సగం మంది ఉన్నారని వారు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎవరు ఎందుకు అడగట్లేదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రం గురించి రాష్ట్ర రైతుల గురించి అడగకపోవడం శోచనీయం..? రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా బిజెపి ఎంపీలు ప్రజా ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలుఅవుతుంది ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతుంటే ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై అవగాహన లేని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T131732.044.wav?_=1

 

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

కామెర గట్టయ్య
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
నల్ల చట్టాలకు ఆజ్యం పోస్తున్న గుర్తింపు ప్రాతినిత్య కార్మిక సంఘాలు.
సింగరేణిలో కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ . అమలు చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు మాట్లాడకుండా హక్కుల గురించి ప్రశ్నించకుండా మాట్లాడే స్వేచ్ఛను కాల రాస్తున్న కార్మికులకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసే కుట్రను కార్మిక వర్గం కార్మిక సంఘాలు ఒక తాటిపై నడిచి తిప్పి కొట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మికులకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది
సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకటిగా నిలబడి కార్మికుల శ్రమపై ఆధారపడిన యాజమాన్యం కార్మికుల వాక్కు స్వాతంత్రాన్ని విస్మరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వంత పాడుతున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపు కుఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సీల పేరుతో కోట్లది రూపాయలు కడుతున్న కూడా కనికరించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేయుటకు సింగరేణి యాజమాన్యం కూడా డిస్ప్లే న్ పేరుతో కార్మిక సంఘం నాయకులు బ్యాలెట్ తో కార్మిక వర్గం దగ్గరికి తమ అభిప్రాయాలను తెలుపాలని వచ్చిన కార్మిక సంఘం నాయకులను గేటు దాటవద్దని హుకుం జారీ చేయడాని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం యాజమాన్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సింగరేణిలో 1998.ఎన్నికల తర్వాత ఒకే సంఘం పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన గుర్తింపు సంఘం. ఏఐటీయూసీ మళ్లీ పాత పద్ధతిని 2025 లో అదే నల్ల చట్టాలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయుటకు కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే పోరాటాన్ని నిర్వీర్యం చేయుటకే కానీ కార్మిక హక్కుల్ని కాపాడుకొనుటకు కాదు అనేదాన్ని సింగరేణి కార్మిక వర్గం గ్రహించి గుర్తింపు కార్మిక సంఘం నాయకులను కార్మికులు నిలదీయాలని కోరుతుంది సింగరేణి కార్మికులను పకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మికులు బార్డర్ సైనికులతో పోల్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బార్డర్ సైనికునికి ఇచ్చిన గుర్తింపులో సగభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వానికి కూడా టాక్సీల రూపంలో కార్మికులు పన్నులు కడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి ఏమీ జవాబుగా నిలిచిందో కార్మిక వర్గం గ్రహించాలి అని కోరుతున్నామని బార్డర్ లో సైనికుని 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సైనికునికి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు గుంటల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటలు మార్చి దేశానికి వెన్నెముకగా నిలబడితే కార్మికునికి రక్త మాంసాలు ధారపోసి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకొస్తున్న కార్మికులకు నివసించుటకు రెండు గుంటల జాగా అడిగితే కార్మికుడు ఉత్పత్తిలో భాగమే తప్ప సొంత ఆస్తి లేదు సొంత ఆస్తిని ఇవ్వము అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యం వాటికి కొమ్ముకాస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలను కార్మిక వర్గం నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరుతుంది దేశంలో ఉత్పత్తి లో భాగమైన విద్యుత్ పరికరంగా మారిన కార్మికుని 40 సంవత్సరాల నుండి తీసుకున్న టాక్సీ లా రూపంలో తీసుకున్న రూపాయలను లెక్కలోకి తీసుకుంటే కార్మికుడు అడిగే రెండు గుంటల జాగా కు సరిపడే రూపాయలు కష్టతరమైన పని కాదని కూడా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. బే షరతుగా కార్మికులకు రెండు గుంటల జాగా పట్టణ ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పుటకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఈసందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపై నిలబడి కార్మిక హక్కులను కాపాడుటకు దోహదపడే విధంగా కార్మిక సంఘాల ఎజెండా ఉండాలని ప్రశ్నించే సంఘాలను అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి కార్మిక హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒప్పించి సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయుటకు దోహదపడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడారు
ఈ సమావేశంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్ కాసర్ల ప్రసాద్ రెడ్డి నామాల శ్రీనివాస్ జయశంకర్ సాజిత్ సలీం నరసింహారెడ్డి యుగంధర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సాoస్కృతిక సారధి కళాకారుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి జిల్లా అధ్యక్షుడు కోపర్తి సురేందర్ వినతిపత్రం అందించారు.జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సాంస్కృతిక కళాకారుల కొరకు ఒక గదిని తమకు కేటాయించాలని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ త్వరలోనే జిల్లా సంస్కృతిక సారధి కళాకారుల కొరకు ఒక గదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగ సంఘం మంచిర్యాల గౌరవ అధ్యక్షులు మామిండ్ల లచ్చన్న,అధ్యక్షులు కొప్పర్తి సురేందర్,ఉపాధ్యక్షులు వెల్థురు పోశం,ప్రదాన కార్యదర్శి గొడిసెల కృష్ణ
సహాయ కార్యదర్శి వావిలాల నాగలక్ష్మి,కోశ అధికారి కొప్పర్తి రవీందర్ పాల్గొన్నారు.

కుప్పా నగర్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T133400.768.wav?_=2

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన హనుమంతరావు పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో రాష్ట్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త రేషన్  పంపిణి  చేసిన సందర్భంగా మాట్లాడారు.
గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం  మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాయంలో కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి రాఘవేంద్ర కృష్ణ ప్రకాష్ రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,

నిజాంపేటలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123957.151-1.wav?_=3

నిజాంపేటలో..
వెంటాడుతున్న యూరియా కష్టాలు..

నిజాంపేట: నేటి ధాత్రి

యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.

వికలాంగుల పింఛన్ల కొరత, తక్షణమే పరిష్కారం కావాలి.

వికలాంగుల పింఛన్ల మాటమర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున వికలాంగుల నాయకుడు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా సైట్ బంద్ చేసి వారి జీవితాలతో చెరగట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తాగిన.బుద్ధి చెప్పాలన్నారు. కొత్త పింఛన్లు రాక వికలాంగులకు సరియైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన జిల్లా అధికారులు తక్షణమే వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కొత్త పిక్చర్లు ఇవ్వడానికి సైట్ ఓపెన్ చేసి పింఛన్లు మంజూరు చేసివారిని ఆదుకోవాలని కోరారు.

రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి – సిపిఐ డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T115608.465-1.wav?_=4

చర్ల రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి
సిపిఐ రైతు సంఘం డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలో వరి పత్తి మిర్చి మొక్కజొన్న ఆకు కూరలు కూరగాయలు ఇతర పంటలు సాగుచేసుకుంటున్న రైతులకు ఎరువులు సకాలంలో సరిపడా సరఫరా చేయకపోవడం వల్ల రైతులు నష్టాల బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు ఎరువులు అందించకపోవడంలో దిగుబడి సన్నగిల్లి భారీ స్థాయిలో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఆండ్రు వామనరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా 10 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5. 32లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంది దీంతో రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మండల రైతంగానికి సరిపడా డిమాండ్ కనుగుణంగా ఎరువులను సకాలంలో సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు అవినీతి పైరవీలు దళారి వ్యవస్థలను అదుపుచేసి ప్రతి రైతుకు ఎరువుల అందించాలని అదేవిధంగా పూర్తి సబ్సిడీతో పురుగుల మందులు వ్యవసాయ పరికరాలు అందించాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల తాసిల్దార్ కార్యాలయ వద్ద వినతి పత్రాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ తెలిపారు అనంతరం వివిధ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని చర్ల మండల తాసిల్దార్ శ్రీనివాస్ కు అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నూప పోతయ్య సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు చల్లా లక్ష్మీనారాయణ కోడిరెక్కల రాజారావు నరసింహారావు మహేష్ రమణ రామారావు సత్యనారాయణ వీరబాబు నాగేశ్వరావు తేజ వెంకటేశ్వరరావు బాబురావు గోపాలకృష్ణ వసంతు తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152052.705-1.wav?_=5

 

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి…

రైతుల సంక్షేమం కోరి _ కాంగ్రెస్ పార్టీ సమరభేరి

జిల్లా ప్రధాన కార్యదర్శి: రిక్కుల శ్రీనివాస్ రెడ్డి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రైతుల సంక్షేమం కోసమే గల్లి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు రైతుల తరఫున కేంద్రంతో పోరాడుతున్నారని,బిజెపి- బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతు సమస్యలపై నోరు మెదపట్లేదనీ,చోద్యం చూస్తున్నారు అని జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేని బీఆర్‌ఎస్ నేతలే ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పడం అవివేకం అని మండిపడ్డారు.యూరియా కేటాయింపులో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,మాటలు కాదు,చర్యలు ముఖ్యమని,రైతులకు ఎరువులు తెప్పించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.బీజేపీ–బీఆర్‌ఎస్ చేతగానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసిందని నేతలు వివరించారు.ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమని,బీజేపీ–బిఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని,ప్రజల ఆదరణను జీర్ణించుకోవడం లేదనీ,అందుకే వారు నిరాధార ఆరోపణలకు తెగబడుతున్నారనీ ఎద్దేవా చేశారు.చెన్నూర్ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిరంతరం సంక్షేమ పథకాలతో,అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటేశం,ఆసంపల్లి శ్రీకాంత్,గద్దల అనిల్ కుమార్, సుమన్,షారుక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు తప్పని యూరియా కష్టాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T154922.742-1.wav?_=6

 

రైతులకు తప్పని యూరియా కష్టాలు

రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోలి చంద్రారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

చిగురుమామిడి మండలంలోని రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా మండలంలో యూరియా బస్తాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని దీనిని పరిష్కరించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఘెరంగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ప్రతిరోజు ప్రాథమిక సహకార కేంద్రం వద్ద బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిల్చున్న పొన్నం ప్రభాకర్ కు కనీస కనికరం లేకుండా పోయిందని రైతులను గోస పెట్టిన ఏప్రభుత్వం కూడా నిలవదని ఆయన అన్నారు. పట్టాదారు పాసు బుక్కు ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతోపాటు నాన్ లిక్విడ్ కొంటేనే యూరియా బస్తా ఇస్తున్నారని రైతుకు ఇష్టం లేకున్నా అంటగడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని వెంటనే రైతులకు చిగురుమామిడి మండలంలో సరిపడ యూరియాని తెప్పించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్, రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులకు యూరియా కొరతను తీర్చాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-1.wav?_=8

రైతులకు యూరియా కొరతను తీర్చాలి

బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్

చందుర్తి, నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని కిసాన్ మోర్చా చందుర్తి మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని వారు అన్నారు
ఎకరానికి ఒక బస్తా అని చెబుతున్న ప్రభుత్వం దానికి సరిపడా కూడా చేయడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తా పై 2100 సబ్సిడీ రైతుల గురించి ఇస్తుందని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా ను తక్షణమే సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ.!

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలోని వివిధ పాఠశాలలో టిఆర్టిఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ హాజరైనారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కరించాలని విద్యారంగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సత్వర సమస్యల పరిష్కరించాలని .ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాలకు స్కావెంజర్ మీ అమ్మకానికి. ఆదేశాలిస్తూ వారి జీతాలను సొంత బ్యాంకు అకౌంట్ లో జమ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారాలను ఆహ్వానించామని. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని. ఐదు పెండింగ్ డి ఏ లు పిఆర్సి అమలు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు చెల్లింపు సిసిఎస్ రద్దు తరగతి ఒక ఉపాధ్యాయుల.ప్రభుత్వ విద్యాసంస్థ బలోపేతం చర్యలు తదితర అనేక సమస్యల పరిశీలించవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దయచేసి వెంటనే ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని తమ పెట్టిన మేనిఫెస్టోలో నిర్వహిస్తామని విధంగా చెప్పిన దాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఇట్టి కార్యక్రమంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన గారి నారాయణ. తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు బూట్ల శ్రీనివాస్. ఆసాని అనిల్ రెడ్డి. టిఆర్టిఎఫ్ సీనియర్ నాయకులు చెక్కిళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version