రైతులకు సన్నవడ్ల బోనస్ వెంటనే చెల్లించాలి…

రైతులకు సన్నవడ్ల బోనస్ వెంటనే చెల్లించాలి

బోనస్ పడక ఇబ్బందులు పడుతున్నారు రైతులు

జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో రైతులకు చెల్లించవలసిన 6.56 కోట్ల సన్న వడ్లకు బోనస్ వెంటనే చెల్లించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజ పెళ్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయం రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లాలో జిల్లాలో రైతులకు సన్న వడ్ల బోనస్ చెల్లించాలని కోరుతూ సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి ధర్నా నిర్వహించారని,అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో మహాదేవపూర్, కాటారం, పలిమల, మహా ముత్తారం, మల్హర్ మండలాలకు సంబంధించిన రైతులకు తమ బ్యాంకుల్లో రైతులకు సన్నవడ్ల బోనస్ చెల్లించడం లేదని రైతులు నిరసన తెలపడం జరిగిందని, వెంటనే జిల్లా కలెక్టర్ యంత్రాంగం పరిశీలించి వెంటనే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసి సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని ఆయన కోరారు. జిల్లాలో 2700 మంది రైతులు సుమారు మూడు నెలలు తిరిగిన సమస్య పరిష్కారం కాలేదని, ఎక్కడ అయితే బ్యాంకులో అంతరాయం ఉందొ ముందు దాన్ని వెంటనే బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి కోరారు. రైతుల పక్షాన అండగా ఉంటామని, లేదంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సిపిఐ జిల్లా సమితి నాయకులు క్యాథరాజు సతీష్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి…..

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..

దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version