సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి…మారపల్లి మల్లేష్ మాట్లాడుతూ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బందు క్రాంతి, బందు సుజాత స్వాతి తదితరులు పాల్గొన్నారు.
– ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో కీలక పాత్ర పోషించాలి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం శాంతినగర్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజలకు పంపించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారము ఘనంగా ప్రారంభించారు. ఈ కరపత్రాల ద్వారా కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన దొంగ హామీలు, అమల్లో పెట్టని సంక్షేమ వాగ్దానాలు, ప్రజలను తప్పుదారి పట్టించిన విధానాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ “ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను అందించి, ప్రజల నుండి సంతకాలు సేకరించాలని బండి సంజయ్ సూచించారన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిరిసిల్లలో ప్రతి కార్యకర్త చురుకగా పాల్గొని ఈ ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడం రవి, శేఖర్, అభి రామారావు విజయ్, ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కౌసల్య, లత, రేఖ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
️ ఇంటింటికీ కరపత్రాల పంపిణీ & సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉదయం 8:00 గంటల నుండిఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు
జారీ చేసిన వారు: దుమాల శ్రీకాంత్ పట్టణ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ – సిరిసిల్ల
మృతిని కుటుంబానికి ఎమ్మార్పీఎస్ నాయకులు అండగా ఉంటాం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మా ర్పీఎస్ మండల కమిటీ నాయ కులు సామాజిక ఉద్యమంలో సాంబయ్య మాదిగ అత్యంత క్రియాశీలక, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధ సాధన కో సం సుదీర్ఘ పోరాటం దండోరా లో కీలక పాత్ర పోషించడం జరిగింది కాబట్టి పార్థివ దేహా నికి పూలమాల వేసి నివాళు లర్పించడం జరిగింది.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం సుదీర్ఘంగా దండోరా ఉద్యమంతో ముం దుకు నడిపించారు. మృతుని కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఉద్యమం అండగా ఉంటుం దని విద్య వైద్య విషయంలో అండగా, మాదిగ జాతి ఎప్పటికీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిం చారు.ఈ కార్యక్రమంలో ముక్కెర
ముఖేష్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తుడుంవెంకటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్య క్షుడు మామిడి భాస్కర్ మాది గ ఎంఎస్ పి మండల అధ్య క్షులు బొమ్మకంటి రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొమ్మగంటి పోశాలు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బొమ్మ కంటి సాంబయ్యమాదిగ మాజీ సర్పంచ్. సాంబయ్య,చింతం రాజేందర్ మాదిగ డబ్బా రవి మాదిగ టైలర్ కుమార్ మహేం ద్ర మాదిగ మచ్చిరెడ్డి కుమార్ మాదిగ. స్టీరింగ్ కుమార్ మా దిగ ,కోయిల బిక్షపతి మాదిగ పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
* పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఐటీ మంత్రి వర్యుల
మహాదేవపూర్ అక్టోబర్ 14 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం టిఆర్ఎస్ నాయకులను మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని కాలేశ్వరం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగునూరి రమేష్ గౌడ్ ను మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు లేతగారి రాజబాబు ఆధ్వర్యంలో మంథని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఐటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంథని క్యాంపు కార్యాలయ సిబ్బంది, కాలేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిఎం,ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు
పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్
భూపాలపల్లి నేటిధాత్రి
అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూనే కాంగ్రెస్ ఏమ్మెల్యే సొంత పార్టీ నాయకులతో రోడ్డు మీద ధర్నా నిర్వహించి, అధికారులను బాధ్యులను చేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామం, మా మండలం, మా వనరులు అంటూ ఎనలేని సవతి ప్రేమ వలకపోస్తూ చేసిన ధర్నా కార్యక్రమం తరువాత మొదటి నుండి ఇసుక అక్రమ రవాణా పై ఇసుక దోపిడీ అరికట్టాలని నిరసన కార్యక్రమాలు చేపట్టిన బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి – జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ని రాబందు అంటూ,ఇసుక మాఫియా డాన్ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిన్న టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వాక్యలను ఖండిస్తూ మా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీస్ అధికారులు ముందస్తు అరెస్ట్ చేయగా నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నేతలు భూపాలపల్లి 5 ఇంక్లైన్ చౌరస్తా సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం ముందు ఎమ్మెల్యే సీఎం దిష్టి బొమ్మలకు శవ యాత్ర నిర్వహించి, దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు * బిజెపి మండల అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్
మహాదేవపూర్ సెప్టెంబర్ 17 (నేటి ధాత్రి)
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రామ్ శెట్టి మనోజ్ బుధవారం రోజున మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమ గీతం పాడిన రోజని అన్నారు. మహాదేవ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం మండల బిజెపి అధ్యక్షుడు రామ్ శెట్టి మనోజ్ మాట్లాడుతూ నిరంకుశ నిజాం పరిపాలనకు చరమగీతం పాడిన రోజు అని, రజాకర్ల అకృత్యాలకు గోరి కట్టిన రోజని, దొరల గడీల్లో బానిసత్వానికి సమాధి కట్టిన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు లింగంపల్లి వంశీధర్ రావు, బల్ల శ్రావణ్, మండల కోశాధికారి ఊదరి పూర్ణచందర్, కార్యదర్శి బందుల సంతోష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఓడేటి బాల్రెడ్డి, మండల నాయకులు, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఘనంగా జరుపుకున్న తెలంగాణ సమైక్యతా దినోత్సవం
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,జాతీయ జెండాను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు & సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయా గ్రామాల మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
కర్ణాటక ప్రభుత్వం ధర్మస్థల కేసులో శాస్త్రీయ,నిష్పాక్షిక వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క డిమాండ్ చేశారు.నర్సంపేటలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పిఓడబ్ల్యు సదస్సు జక్కుల విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క మాట్లాడుతూ కర్ణాటకలోని ధర్మస్థల ఆలయంతో పాటు చుట్టుపక్కల 400 మంది నివేదికల ప్రకారం బాలికలు,మహిళల సామూహిక అత్యాచారాలు,లైంగిక దాడులు,సామూహిక హత్యలు,సామూహిక ఖననంపై అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కొన్ని సమస్యల తర్వాత భట్ తల్లి తనకు ఎప్పుడైనా కూతురు ఉందా లేదా అనే దానిపై తిరగబడటం, విజిల్‌బ్లోయర్ అరెస్టు నివేదికలు వంటి సమస్యలను మళ్లించడానికి అలాగే సమస్యను మతంచేయడం ద్వారా, న్యాయవాదులు,కార్యకర్తలను కించపరచడం, ఆలయ స్థాపనకు నైతిక మద్దతు కవాతులను ప్రకటించడం ద్వారా ఒత్తిడిని పెంచడానికి ప్రచారం జరుగుతోందని తెలిపారు.ధర్మస్థల కేసులో ఆధారాలు, సాక్షులు, న్యాయవాదుల రక్షణ కొనసాగించి ప్రజల పోరాటం నిఘా మాత్రమే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం పిఓడబ్ల్యు నూతన డివిజన్ కమిటీని ఏర్పాటు చేయగా నూతన అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయ,ఆకుల శైలజ, డివిజన్ నాయకులు సంధ్య, వీరలక్ష్మి, సుక్కక్కలను ఎన్నుకున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చెయ్యండి
ప్రారంభ సూచికగా నగరంలో భారీ బైక్ ర్యాలీ-సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
సిపిఐ కరీంనగర్ నగర సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్11వ తేదీన బైపాస్ రోడ్ లో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట సేనాని బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి కరీంనగర్ నగరంలో బైక్ ర్యాలీ ప్రారంభించుకొని కోతిరాంపూర్, కమాన్, బస్టాండ్ మీదుగా గీతా భవన్ నుండి అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం మార్కెట్ వద్ద ముగుస్తుందని, దీనికి నగరంలోని వందలాదిమంది కార్యకర్తలు తరలి రావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రామ, మండల, డివిజన్ కేంద్రాలలో ఎర్ర జెండాలు ఎగురవేసి పార్టీ చరిత్రను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే సీపీఐ అవిర్భావించిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అసువులు బాశారన్నారు. లక్షల ఎకరాల భూమి పేదలకు పంచామని, ఎనిమిది వేల గ్రామాలను రజాకార్ల చెర నుంచి విముక్తి పొందయన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తెలంగాణలో విలీనం చేశారన్నారు. పార్టీ పోరాట చరిత్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఈపోరాట చరిత్రను హిందూ ముస్లీంల సమస్యగా వక్రీకరిస్తుందని, బిజెపి పార్టీకి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధమే లేదని ఆయన విమర్శించారు. సాయుధ పోరాట సమయంలో బిజెపి పార్టీ పుట్టుకనే లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంగా పుస్తకాలలో చేర్చాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కార్యకర్తలుపని చేయాలని పిలుపునిచ్చారు.
ఈసమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు కార్యవర్గ సభ్యులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్,బీర్ల పద్మ, కొట్టే అంజలి, గామినేని సత్తయ్య, ఆకునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, కూన రవి, బాకం ఆంజనేయులు, సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుని పర్యటన విజయవంతం చేయండి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం, కొక్కెరకుంట గ్రామాల శక్తి కేంద్రం ఇంఛార్జి వేముండ్ల కుమార్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం పరిధిలోని బూత్ కమిటీలతో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ ఇంఛార్జి పోచంపెల్లి నరేష్ లు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సెప్టెంబర్ 3న జరిగే జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి బూత్ నుండి కూడా అధిష్టానం చెప్పిన విధంగా కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. తదనంతరం పలు వినాయక మండపాలను సందర్శించారు. ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి గుంట అశోక్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, శేవాళ్ళ అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు కట్టెకొల మహేష్, కోడూరి గంగరాజు, నాగం రమేష్, గుంట సంజీవ్, బత్తిని సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి పట్టణ కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య కార్యకర్తలు,నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు నాయకుల సమక్షంలో శాలువాతో సన్మానించి కేకు కట్ చేసి అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ రోజు కాటారం మండల్ కేంద్రం లో నిర్వహించిన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిలు గా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డిచల్ల నారాయణ రెడ్డి విచ్చేసి, ఈ రోజు మహాదేవపూర్ మండల్ బీజేపీ నూతన కార్యవర్గని ప్రకటించారు. మండల అధ్యక్షులు గా: రాంశెట్టి మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు,అంకరి రాజేందర్, సూరం మహేష్, శనిగరం కిష్టయ్య, ఆకుల మధుకర్, మండల ప్రధాన కార్యదర్శులుగుజ్జుల శంకర్,బొల్లం కిషన్,లింగంపల్లి వంశీ, బల్ల శ్రావణ్ కుమార్ , కార్యదర్శులుబంధుగుల సంతోష్, గోరె శ్రీకాంత్, M,R యాదవ్,, శ్యామల ప్రశాంత్ కోశాధికారిగాఉదారి పూర్ణచందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు ఓడేటి బాలిరెడ్డి, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు సాగర్ల రవీందర్, SC మోర్చ మండల అధ్యక్షులు బూడే శేఖర్, ST మోర్చ మండల అధ్యక్షులు దుగ్యాల రాము, లను నియమించడం జరిగింది, అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుకర్రె సంజీవ రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గనికి శుభాకాంక్షలు తెలుపి, ప్రతీ ఒక్కరు కూడా బీజేపీ బలోపేతానికి కృషి చెయ్యాలని, అలాగే ప్రధానమంత్రి గౌ, శ్రీ నరేంద్ర మోడీప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే రానున్న స్థానిక,సంస్థల ఎన్నికలలో బీజేపీ కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాలని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమం లో మహాదేవపూర్, మహాముత్తరాం, మలహార్ మండలాల అధ్యక్షులు,రాంశెట్టి మనోజ్ కుమార్, పూర్ణ చందర్ శ్రీకాంత్ దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి,మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు
మహాదేవపూర్ఆగస్టు21నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మహాదేవపూర్ బస్టాండ్ లో వివేకానంద విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంపిణి చేశారు, అనంతరం మహాదేవపూర్ మండల తాసిల్దార్ ఎరాబటి రామారావు మరియు హాస్పిటల్ సూపరెండెంట్ డా, విద్యావతి ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేసి ఆసుపత్రి ప్రాంగణం లో చెట్లు నాటడం జరిగింది అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న సహకారంతో ప్రధానోపాధ్యాయురాలు సరిత ఉపాధ్యాయుడు మడుక మధు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గిత పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది, బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకునిగా మరియు కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు, అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు అని అన్నారు, అలాగే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగిన అయన జీవితం, నేటి కార్యకర్తలకు, యువకులకు ఆదర్శమన్నారు, కష్టపడి పనిచేసే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు కేవలం భారతీయ జనతా పార్టీలోనే గుర్తింపు ఉంటుందన్నారు, రాబోవు రోజుల్లో బండి సంజయ్ఆ అమ్మవారి ఆసిస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశభావం వ్యక్తం చేసారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న, సాగర్ల రవి, లింగంపల్లి వంశీ, బాలిరెడ్డి,శ్రీనివాస్,శ్యామ్,రాంరెడ్డి, వెంకటేష్, శ్రవణ్,సాయి, సంపత్, రాకేష్, మనోజ్, రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆదేశాల మేరకు బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవ నిర్మాత అని,ఐటీ రంగ వృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. దేశానికి సుస్థిర పాలన అందించి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రాజీవ్ గాంధీ గ్రామపంచాయతీ వ్యవస్థను బలపరిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి,ఏఎంసీ డైరెక్టర్లు కందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకట చారి,యూత్ పట్టణ అధ్యక్షుడు బసనబోయిన మహేష్ యాదవ్,నాయకులు జలకం శ్రీనివాస్, సొంటి రెడ్డి భాస్కర్ రెడ్డి,కల్లూరి కుశాల్, ముద్దసాని సురేష్, జంజీరాల మనోహర్, జలీల్, వెలుగు మహేశ్వరి, పంజా కల్పన,బిజ్జాల అనిల్, జలగం వెంకన్న,యశోద, మహంకాల దుర్గేష్, జాటోత్ రమేష్ నాయక్, నడిగడ్డ మధు, నడిగడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరులో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమల ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – అన్నదానంతో మరింత విశిష్టత
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అనుమల ఝాన్సీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరైనారు ఈ వేడుకలను పెదగాని సోమన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు శ్రద్ధగా నిర్వహించారు.
వేడుకలు కేక్ కటింగ్‌తో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారికి పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో పార్టీ జెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
అన్నదానం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ
జన్మదిన వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పేదలు, నిరుపేదలు, వృద్ధులు, కార్మికులు సహా వందలాది మంది ప్రజలకు భోజనాన్ని వడ్డించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పేదలతో భోజనం పంచుకోవడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారి ప్రజాసేవా పంథా స్పష్టంగా ప్రతిబింబించిందని నాయకులు పేర్కొన్నారు
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్దగాని సోమన్న మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారు కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, సేవా దృక్పథం కలిగిన నిజమైన ప్రజానేత. ఆమె ఎక్కడైనా ప్రజల సమస్యలతో మమేకమై, పరిష్కారానికి కృషి చేస్తారు. పార్టీని బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం సాధన కోసం పోరాడుతున్నారు” అని అన్నారు.
మరికొందరు మాట్లాడుతూ, “ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతోంది. ఆమెకు రాష్ట్ర స్థాయిలోనూ మరిన్ని కీలక బాధ్యతలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని అభిప్రాయపడ్డారు.
ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఒకే కుటుంబ వాతావరణంలో కలిసి జరుపుకోవడం ఈ వేడుకను మరింత విశిష్టంగా మార్చింది.
సామాజిక స్పృహకు అద్దం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “జన్మదినాన్ని కేవలం ఆచారంగా కాకుండా, సామాజిక సేవతో అనుసంధానం చేయడం గొప్ప విషయమని. పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఝాన్సీ రెడ్డి గారు నిజమైన ప్రజాసేవకురాలిగా నిలుస్తున్నారు” అని అన్నారు. తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ప్రజాసేవా పంథా, పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం అనే మూడు కోణాలను ప్రతిబింబించాయి. కార్యక్రమం పెద్దగాని సోమన్న కళావతి చాపల బాపీ రెడ్డి సోమ రాజశేఖర్ అమ్యా నాయక్ చిత్తలూరు శ్రీను గుండాల నరసయ్య బుసాని రాము అశోక్ రెడ్డి సోమేశ్వరరావు మేకల కుమార్ మంగళపల్లి రామచంద్రయ్య అంతా ఉత్సాహంగా సాగి, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకకు ప్రత్యేకమైన గౌరవం దక్కింది.
కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా మంత్రి సీతక్క
#ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి మరణించగా వారిని పరామర్శించిన సీతక్క
#కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం…
ములుగు జిల్లా, నేటిధాత్రి:
గోవిందరావుపేట మండల చల్వాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దాపురం మొగిలి తల్లి గారైన పెద్దాపురం లచ్చమ్మ గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు దనసరి అనసూయ సీతక్క పరామర్శించి, కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడింది. కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి గార్లతో పాటుగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
మండల కేంద్రంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నడికూడ,నేటిధాత్రి:
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ మండల పార్టీ అద్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు) జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీలాపానా చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి,బిఆర్ఎస్ మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్షకు మద్దతు ప్రకటించిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి గత ప్రభుత్వము మోసం చేసినది ఉద్యోగాలు ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు గుంట భూమి ఇవ్వలేదు అవసరానికి వాడుకొని మోసం చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని ఉద్యమకారులకు తెలియపరచడం జరిగింది. పై విషయం మా ప్రియతమా నాయకులు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్తామని ఉద్యమకారులకు తెలియపరిచినాము ఉద్యమకారులు కూడా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల రాష్ట్ర అధికార ప్రతినిధి అయివుద్దీన్ ఉద్యమకారుల భూపాల్ పల్లి జిల్లా అధికార ప్రతినిధి అక్రముద్దీన్ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ దేవేందర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రైతులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అధికారులకు ఇవ్వడం జరిగిందని అవి ఎలా పరిష్కరిస్తున్నారని అవి ఎంతవరకు పరిష్కారం అయ్యాయని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనేంటి మాణిక్ రావు తహ సీల్దార్ తిరుమలరావు ను ప్రశ్నించారు. శుక్రవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన ఆర్ ఓ ఆర్ 2025 చట్టం భూభారతి పేరుతో తీసుకువచ్చిందని ఇందులో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు 100 ఆప్షన్స్ ఇస్తామని ప్రకటించిందని అవి ఆన్లైన్లో ఉన్నాయా అని ఎమ్మెల్యే అడిగారు. దీనికి తహసిల్దార్ మాట్లాడుతూ ఇంకా ఆన్లైన్లో ఆ అవకాశం లేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలోసర్వర్ కనెక్షన్ సమస్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నా దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే అడగగా పైనుండే సర్వర్ సమస్య నెలకొన్నదని స్లోగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని తహసిల్దార్ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే సీసీ ఎస్ఏ కార్యాలయానికి ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే వెంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాయకులు ప్యాలవరం మాజీ ఉప సర్పంచ్ మాణిక్యం యాదవ్, నర్సింలు, తదితరులు ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.