అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

విద్యుత్ ఉద్యోగుల ధర్నా…

విద్యుత్ ఉద్యోగుల ధర్నా

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి మోత్కూరి కోటి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ యాళ్ల సురేందర్ రెడ్డి ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈ ధర్నాలో ఆర్టిజన్, అన్‌మాన్, స్పాట్ బిల్లర్స్, ఎస్‌పీఎంలు ఇతర పీస్‌రేట్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్మికుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క కార్మికుల సమస్యను పరిష్కరించాలి అని వారు అన్నారు
ఆర్టిజన్ కార్మికులను వారి విద్యార్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి
ఏపీఎస్ఈబి నిబంధనలు పూర్తిగా అమలు చేయాలి
ఒకే సంస్థలో సంవత్సరాలుగా పని చేస్తున్న అన్‌మాన్ కార్మికులను ఆర్థిక ఆర్టిజన్‌గా గుర్తించాలి
కార్మికులకు శాశ్వత పరిష్కారం కల్పించాలి
కార్మికులు సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా అనంతరం డివిజన్ ఇంజనీర్ కి కార్మికుల సమస్యలను వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఉమ్మడి డివిజన్ కమిటీ భూపాలపల్లి ఆధ్వర్యంలో టీవీఏఈ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో:
చైర్మన్‌గా – నాగుల తిరుపతి రెడ్డి
కన్వీనర్స్‌గా – మోత్కూరి కోటి, తిప్పారపు రాజు
కో-కన్వీనర్స్‌గా – సమ్మయ్య, జన రవీందర్
కో-చైర్మన్‌గా – బత్తుల రాజేందర్
వైస్ చైర్మన్‌లుగా – జి. సుదర్శన్, ఎల్. రాజయ్య
జాయింట్ సెక్రటరీగా – వేముల కిరణ్
కోశాధికారిగా – హరిచంద్ర
నూతన జేఏసీ కమిటీ ఏర్పాటుతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 7న “చలో వరంగల్” కార్యక్రమం నిర్వహించి, అవసరమైతే సమ్మెలోకి వెళ్లే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ధర్నా అనంతరం టీవీఏఈ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వంటేరు మల్లయ్య, ఎండి అక్షావాలి, భాస్కర్ చారి, విజేందర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు

కలగానే మిగిలిన సింగరేణి కార్మికుల సొంతింటి కల…

కలగానే మిగిలిన సింగరేణి కార్మికుల సొంతింటి కల

సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉంది

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

స్ట్రక్చర్ మీటింగ్లో యాజమాన్యం అంగీకరించిన సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె కైనా సిద్ధమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. సింగరేణిలో 2014 నుండి 2023 వరకు కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగులు జరగలేదని, రాజకీయ జోక్యంతోనే కార్మికులకు సంబంధించిన ప్రకటనలు చేసేవారని అన్నారు. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన అనంతరం వివిధ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగులు నిర్వహించడం జరిగిందని అందులో కొన్ని యాజమాన్యం పరిష్కరించిన పూర్తిస్థాయిలో అమలు పరచడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కార్మికుల సొంతింటి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి దానికి కమిటీ వేసి కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. కోల్ ఇండియా మాదిరిగానే పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ యాజమాన్యం చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో మెడికల్ బోర్డు సమస్య తీవ్రంగా ఉందని 9 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 6న అన్ని డిపార్ట్మెంట్లలో మెమోరండాలు నిరసన, ధర్నా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 8న జిఎం కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలను కలుపుకొని దశలవారీగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. 8 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవడం జరుగుతుందని సమస్యలను వారికి వివరించి పరిష్కరించకుంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసి సమ్మెకు పిలుపు నివ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 6, 8న జరిగే ధర్నా, నిరస నలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాజ్ కుమార్ కార్మికుల కు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచి సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి, బ్రాంచ్ కమిటీ నాయకులు నూకల చంద్రమౌళి, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

భూసేకరణ వ్యతిరేక ఆందోళన…..

జహీరాబాద్ లో ఆందోళన

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో నిజ్జా భూసేకరణను వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ జరిగింది. భూ బాధితులు నిమ్డ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రామచందర్ మాట్లాడుతూ, భూసేకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..

రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది.
స్థానిక బస్టాండ్‌ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ –
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు.
అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో రైతులకు యూరియా సరఫరా సమస్య..

రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు

సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను..

సింగరేణిలో దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయండి

బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 గనిపై సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వార సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోయాదగిరి సత్తయ్య అధ్యక్షులు, యతిపతి సారంగపాణి ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ బొగ్గు పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణయే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాలు,ఉద్యమాలను సింగరేణి కార్మికులు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.గతంలో 1.3 లక్షల ఉద్యోగులతో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని, ప్రస్తుతం 39వేల ఉద్యోగులతో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని కోల్ ఇండియాలో 6.5 లక్షల ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 2 లక్షల ఉద్యోగులతో 800 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు.
ఉత్పత్తిలో పెరుగుదల గణనీయంగా పెరిగిందని, ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిందని అన్నారు.శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ, తక్కువ వేతనం,భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులను వినియోగిస్తున్నారు.వారికి కనీస వేతనాలు (హెచ్ పి సి), సురక్షిత పని వాతావరణం, వైద్య సదుపాయాలు,నివాస క్వార్టర్లు లేవు.తెలంగాణ రాష్ట్రం గత 12 సంవత్సరాలుగా కనీస వేతన సవర జరగలేదని సింగరేణిలో కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పటికీ అమలు కాలేదని వెంటనే అమలు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో రాజకీయ జోక్యం విచ్చలవిడిగా పెరిగిందని, సంస్థలు పరిపాలన విభాగం గాడు తప్పిందని అందుకే రాజకీయ జోక్యం తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ట్రాన్స్కో,జెన్కో సంస్థల నుండి బకాయిలు
గత ప్రభుత్వ హయాంలో రూ. 26,000 కోట్లు బకాయిలు ఉండగా,ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఆ మొత్తం రూ. 39,661.57 కోట్లుకి పెరిగిందని విద్యుత్ బొగ్గుబకాయలు చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బొగ్గు బకాయిలు రూ.14,743.25 కోట్లు
విద్యుత్ బకాయిలు రూ.24,918.32 కోట్లు చెల్లింపులకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి
ఉద్యోగ భద్రత,బొగ్గు పరిశ్రమల భవిష్యత్తు, సాంకేతిక సామర్థ్యం పరిరక్షణ కోసం కార్మికులు మరియు ప్రజలతో కలసి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని తెలియజేశారు.
జూలై 24 నుండి 31 వరకు బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాలు నిర్వహించి కార్మికులను చైతన్య పరచడం.
ఆగస్టు 5 నుండి 14 వరకు కోల్ బెల్టు ప్రాంత గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించడం,ప్రజల అవగాహన కోసం బహిరంగ సభలు నిర్వహించడం.
ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 5 వరకు సింగరేణి కార్మిక వాడలలో బహిరంగ సమావేశాలు,పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహించడం.
సెప్టెంబర్ 15 నుండి జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం.సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.పర్మనెంట్ కార్మికుల సంఖ్య పెంచాలని కనీసం 50% ఉత్పత్తి శాశ్వత ఉద్యోగులతో ఉత్పత్తి జరగాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు, సీఎం పిఎఫ్ ఖాతాలు,వైద్యం, క్వార్టర్లు కల్పించాలని,బొగ్గు సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని,కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సీఎం పిఎఫ్ వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ చేసి పెన్షన్ సమస్యలు పరిష్కారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం రూ.39,661.57 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని,చట్టబద్ధ బొగ్గు గనుల సేఫ్టీ/భద్రతా చర్యలు అమలు చేయాలి.కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి.సింగరేణి,కోల్ ఇండియాలలో యూనియన్ వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని,ఏపీ ఈ ఎక్స్ జెసిసి, వెల్ఫేర్,సేఫ్టీ కమిటీల సమావేశాలు నియమితంగా చేపట్టాలి.సింగరేణి కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలని,
తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు జాతీయ ఆందోళన కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు భాగస్వామి కావాలని పిలుపునిచ్చినారు.
ఈ కార్యక్రమంలో నాతాడి శ్రీధర్ రెడ్డి ఏరియా ఉపాధ్యక్షులు,సెంట్రల్ సెక్రెటరీ మాదాసు రవీందర్,సెంట్రల్ ట్రెజరర్ ఆకుల హరి, శ్రీరాంపూర్ ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్,ట్రెజరర్ గూడ శ్రీకాంత్,జాయింట్ సెక్రెటరీ మేకల స్వామి,కట్కూరి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోళ్ళ మహేందర్,ఆర్కె5 ఫిట్ సెక్రెటరీ రామకృష్ణ,అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ చంద్రశేఖర్,టి.కిరణ్ కుమార్,కుంట రాజు,పాగిడి శ్రీకాంత్,చల్ల ప్రశాంత్,బుర్ర అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నిమ్స్ రైతుల ఆందోళన మామడ్దిలో ఉద్రిక్తత.

నిమ్స్ రైతుల ఆందోళన.. మామడ్దిలో ఉద్రిక్తత.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో
మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version