బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు చెయ్యాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T131311.562.wav?_=1

 

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు చెయ్యాలి

బీసీలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్,

భూపాలపల్లి నేటిధాత్రి

 

సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్
మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదివ షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి పేరుతో ఏళ్ళ తరబడి బిసిల రిజర్వేషన్ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూ ఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.

గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితి లోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు

కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీని భూస్థాపితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరేళ్ల జోసెఫ్, గోలి లావణ్య, యాకుబ్ పాషా, షబీర్ పాషా, రమేష్ చారి, గోనెల తిరుపతి, మట్టి కృష్ణ, పంగ మహేందర్,వాసం రజిత, యాకూబీ తో పాటు పెద్ద ఎత్తున సిపిఐ నాయకులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version