సిపిఐ ప్రచార జాతను జయప్రదం చేయండి – పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నవంబర్15 నుండి జోడేగడ్ లో ప్రారంభమై భద్రాచలం వరకు వెళ్ళు ప్రచార జాత ఈనెల 17న కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని రెండు రోజులపాటు జిల్లాలో నిర్వహించే ప్రచార జాతాలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఐ నగర శాఖ కార్యదర్సుల సమావేశం పైడిపల్లి రాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత దేశ రాజకీయ చరిత్రలో వంద సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన పార్టీ లేదని అది కేవలం సిపిఐ ఘనతని ఆయన గుర్తు చేశారు. ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్ర భారత దేశంలో విలీనం చేసిన తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని ఇప్పుడున్న భారతదేశాన్ని నిర్మించుకోవడానికి వంద సంవత్సరాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహించింది సిపిఐ పార్టీ అని కొనియాడారు. వంద సంవత్సరాల పోరాట చరిత్రలో వేలాదిమంది ప్రాణార్పణాలు లక్షలాదిముంది జైలు జీవితం, వేలాదిమంది అజ్ఞాత జీవితం, గడిపారన్నారు. దేశంలోని ప్రజలందరూ అసమానతలు లేని ప్రజలంతా ఒకటేనని సుఖశాంతులతో జీవించే సోషలిజం సమసమాజమే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లక్ష్యం అన్నారు. కానీ నేడు దేశంలో రాష్ట్రంలో ఆర్థిక, కుల, మతoతరాలు ప్రజల మధ్య విభజన రేఖలు గీస్తున్నాయని అవి రూపుమాపెంత వరకు సిపిఐ ఉద్యమాలు నిర్మిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల కొరకు పుట్టి, ప్రజల కోసం పోరాడుతున్న సిపిఐ ఏనాడు ఓట్లు సీట్లు ముఖ్యం అని భావించలేదని వంద సంవత్సరాలను ఒక్కరోజు అధికారంలో లేకున్నా నిత్యం ప్రజల కోసమే పని చేస్తుందని తెలిపారు. ఈభూమి మీద మనుషులు ఉన్నంతవరకు ఎర్రజెండా, సిపిఐ ఉంటుందని తెలియజేశారు. 17న మధ్యాహ్నం కరీంనగర్ కు జాత చేరుకుంటుందని కరీంనగర్, తిమ్మాపూర్, చిగురుమామిడి
18న సైదాపూర్, హుజురాబాద్ మండలంలో జాత సాగుతుందని జాతలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈసమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు కార్యదర్శులు బీర్ల పద్మ, కొట్టే అంజలి, ఎలిశెట్టి భారతక్క, గామినేని సత్యం, కసి బోసుల సంతోష చారి, చంచల మురళి, బాకం ఆంజనేయులు, మాడిశెట్టి అరవింద్, ఆకునూరి రమేష్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
