ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు…

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని అమృత వర్షిణి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అక్కడ నివసిస్తున్న వృద్ధులు తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రజలకు మరింత సేవ చేయాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.
అనంతరం భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేసి మానవతా సేవను చాటారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ —
ప్రతి సంవత్సరం తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఎల్లవేళలా ప్రజల సేవకే తాము అంకితమని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తీన్మార్ మల్లన్న గారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ గడపగడపకు పార్టీ నినాదాన్ని తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్‌పీకే సాగర్, జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, బండి సునీల్, సుంకరి సందీప్, జింకల శ్రీను, రొడ్డ శ్రీనివాస్, అనంతుల సంపత్ (బొట్టు), అశోక్, సంతోష్, రంజిత్, నవీన్, సమ్మయ్య, సాయి రాజేందర్, శ్రీధర్, రాంబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

*అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

 

జహీరాబాద్ నియోజకవర్గ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ గారి తండ్రి బండి యేసప్ప మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పార్థివదేహానికి నివాళాలు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ యాకూబ్ వివిధ వార్డ్ అద్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు,మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు,గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ..

అంతక్రియలో పాడే మోస్తున్న బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు…

అంతక్రియలో పాడే మోస్తున్న బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇడబోయిన సంతోష్ నానమ్మ ఈడ బోయిన పెద్ద ఐలమ్మ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి అంతక్రియ లో పాడే మోసిన బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి నగరంపల్లి గ్రామ సర్పంచ్ కొడారి హైమావతి ధనంజయ
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దంసాని శ్రీకాంత్ నాయకులు తొట్ల రాజగోళ్ళ వావిలాల మొగిలి ఈడ బోయిన శ్రీను భాష బోయిన నాగరాజు రాకేష్ సిద్దు తదితరులు పాల్గొన్నారు

మహిళల నేతల అధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T163816.833.wav?_=1

 

మహిళల నేతల అధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలంలోని షేఖాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మరియు మహిళల నేతల అధ్వర్యంలో సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా ఈ సందర్భంగా అస్మా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ. సుదీర్ఘకాల తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. రాజకీయంగా ఎంతనష్టం జరిగినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి రాష్ట్రం ఇవ్వడంతో ఉద్యమకారుల కలలు నెరవేయాయి. అందుకే సోనియా గాంధీ గారి ప్రస్తావన లేకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలేం. సోనియా గాంధీ గారి మార్గదర్శకంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ‘ప్రజాపాలన’ అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. సోనియాగాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ‘ఇందిరమ్మ రాజ్యం’ పాలన సాగుతోంది. రాష్ట్రం ఇవ్వడమే కాకుండా ఇచ్చిన రాష్ట్రంలో ప్రజల బాగోగుల కోసం ఆమె ఇస్తున్న విలువలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ షేఖాపూర్ గ్రామంలో బాలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి నర్సిములు గారికి మరియు వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమామ్ పటేల్, ఖుర్షీద్, నారాయణ గౌడ్, ఖుతుబుద్దీన్, ఫైజోద్దీన్,ఎజాజ్ పటేల్, షేఖమద్, తాజుద్దీన్, సంజీవ్, మహిళా నాయకులు మౌనిక, ఈశ్వరమ్మ, చన్ను బీ, అమీనా బేగం గ్రామ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T164925.506.wav?_=2

 

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ మాట్లాడుతూ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత జ్ఞాన శిఖరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులు ప్రసాదించిన త్యాగమూర్తి ఆయనను స్మరించుకోవడంతో పాటు తన ఆశాయ సాధనలో భారత దేశ సమాజమంతా ప్రయాణించగలిగినప్పుడే ఆయన కన్న కలలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బట్టు రవి భూపాలపల్లిబిజెపి అర్బన్ అధ్యక్షులు గీసా సంపత్ కుమార్,రూరల్ అధ్యక్షులు పులిగుజ్జ రాజు, జిల్లా నాయకులు తాటికంటి రవి కుమార్, మాచనవేన రవీందర్, చెక్క శంకర్, పొన్నాల కొమురయ్య రాజేష్ పాపయ్య వేణు సుమన్ తదితరులు పాల్గొన్నారు

మెడికల్ కళాశాలకు ఓంకార్ పేరుతో నామకరణం చేయాలి…

మెడికల్ కళాశాలకు ఓంకార్ పేరుతో నామకరణం చేయాలి

కలెక్టర్ కార్యాలయంలో ఎంసిపిఐ(యు) పార్టీ వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

పీడిత ప్రజల హక్కులకై, భూమి బుక్తి విముక్తి కోసం జీవితాంతం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ఆదర్శాలు, త్యాగాలు,రాజకీయ విలువలను భవిష్యత్త్ తరాలకు అందించే విధంగా పాఠ్యాంశంలో చేర్చుతూ నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పేరుతో నామకరణం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.అలాగే ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి ఓంకార్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు.అందుకుగాను
ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు విలువలు కోల్పోయి వ్యాపారమయంగా మారాయన్నారు.
ఆనాటి నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ విముక్తి కోసం పనిచేసిన అగ్ర గన్యుడు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ అని గుర్తుకు చేశారు.ఉమ్మడి రాష్ట్ర ప్రజల గొంతుకగా అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ టైగర్ గా పిలిపించుకున్న గొప్ప మహానేత అని అలాంటి వీరుడి చరిత్రను నాడు నేడు భవిష్యత్తులో ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మెడికల్ కళాశాలతో పాటు, స్టేడియానికి నామకరణం చేసి నర్సంపేట వరంగల్ రోడ్డుకు ఓంకార్ మార్గ్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చుంచు జగదీశ్వర్,జిల్లా నాయకులు ఐతమ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకుడు బీజేపీలో చేరిక

బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు గుండబోయిన తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి యాదగిరి,నాయకులు ఊటుకూరి చిరంజీవి గౌడ్, హుసేన్,కిషన్,సుమన్,వీరన్న,స్వామి,రాజకుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T165945.600.wav?_=3

 

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ గ్రామ మాజి సర్పంచ్ సత్యనారాయణ గారి సోదరుడి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి సర్పంచ్ లు శివ శంకరయ్య స్వామి, రవి కుమార్ సంజీవ్ మాజి ఎంపీటీసీ వెంకట్ మాజి ఉప సర్పంచ్ ఖాదర్ శివ స్వామి నాగ్ శెట్టి,ప్రభు తదితరులు పాల్గొన్నారు,

ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-30T125705.930-1.wav?_=4

 

ఘనంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ అక్టోబర్ 30 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ.నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గురువారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు,ప్రజలకు పండ్లు, బ్రెడ్ పాకెట్ లు పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలని వారు అన్నారు.ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు జాఫర్,మోతిరాం నాయక్,జహంగీర్,రాములు నేత,యూనూస్ మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ ఆయా మండలాల అధ్యక్షులు జి.కిరణ్ కుమార్ గౌడ్,సునీల్,సుభాష్ యాదవ్,రాఘవేందర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లా.ప్రతాప్ రెడ్డి,రాజు నాయక్,మల్లికార్జున్,జహీర్ అరబ్బీ,అక్రమ్,అయ్యూబ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు,…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-23T133758.424.wav?_=5

 

ఘనంగా ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

ఝరాసంగం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నేత యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభిమానులు, మిత్రులు, స్నేహితులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, కులసంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో ఉదయ్ శంకర్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయ్ శంకర్ పాటిల్ కి జన్మదిన శు భాకాంక్షలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానం చేసి కేక్ కట్ చేపించి, తినిపించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, సీనియర్ నాయకులు రాచయ్య స్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, నర్సింలు పాటిల్, సంగ్రామ్ పాటిల్, మారుతి పాటిల్, మల్లయ్య స్వామి, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, శ్రీకాంత్ పాటిల్, సిద్ధు పాటిల్, శ్రీనివాసరెడ్డి, కొల్లూరు వార్డు సభ్యులు ఎం విష్ణు, వై నగేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, సి ప్రకాష్, నీ విజయ్, నర్సింలు, సంజీవులు, ఎం సునీల్, సి అబ్రహం, మహమ్మద్ ఫక్రుద్దీన్ మహమ్మద్ మోలా మహమ్మద్ సాహెబ్ బుడగ జంగం గోపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు…

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

కరీంనగర్, నేటిధాత్రి:

డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే…

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హన్మంత్ రెడ్డి — రజిత వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

ఝరాసంగం మండల కేంద్రంలో కక్కెరవాడ గ్రామానికి చెందిన హన్మంత్ రెడ్డి — రజిత కుమార్తెల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో చిన్నారులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి సర్పంచ్ లు బస్వరాజ్, శ్రీనివాస్ రెడ్డి,సంగారెడ్డి, నాయకులు డాక్టర్ నాగన్న,సోహైల్, దత్త రెడ్డి నాయకులు ,కార్యకర్తలు తదితరులు.

ఎమ్మెల్యే డోలా రోహన కార్యక్రమంలో ఆశీర్వదించారు

డోలా రోహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మొగుడంపల్లి మండల కేంద్రంలో జరిగిన గారి వార్డ్ మెంబర్ ప్రభు గారి కుమారుడి డోలా రోహన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి సర్పంచ్ లు ఈశ్వర్ రెడ్డి,సీతారాం రెడ్డి,నాయకులు ఓంకార్ రెడ్డి,గోపాల్, సంజీవ్ పవార్, దేవిదాస్ జాదవ్, రాంశెట్టి, లింబాజీ, జ్ఞానేండ్, నరేశ్ చౌహన్, సుభాష్ చందర్, కిరు, బిక్కు,
గ్రామ నాయకులు అంజన్న ,రాములు,జెట్టప్ప,వెంకట్ ,నర్సింలు,నాగన్న తదితరులు ..

పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..

*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది.
ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి.
చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి,
ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్,
నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిఆర్ఎస్ నాయకులు ముబిన్ కు జన్మదిన శుభాకాంక్షలు…

ఘనంగా బిఆర్ఎస్ నాయకులు ముబిన్ కు జన్మదిన శుభాకాంక్షలు

◆:- ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జాహిరాబాద్ మండలం అల్గోల్ గ్రామ మాజీ వార్డు మెంబర్ బిఆర్ఎస్ నాయకులు ముబిన్ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారి కార్యాలయంలో జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో క్రిష్ణారెడ్డి, శివకుమార్,పి.జి.ఈశ్వర్, శికారి గోపాల్,చల్లా శ్రీనివాస్ రెడ్డి,సి.యం.విష్ణువర్ధన్ రెడ్డి,చెంగల్ జైపాల్,దిలీప్, తదితరులు పాల్గొన్నారు

సంగారెడ్డిలో తెలంగాణ సమైక్యతా దినోత్సవం…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఘనంగా జరుపుకున్న తెలంగాణ సమైక్యతా దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,జాతీయ జెండాను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు & సంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయా గ్రామాల మండల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించిన భాజపా నాయకులు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T141418.895.wav?_=6

 

సేవా పక్షం మండల కార్యశాల నిర్వహించిన భాజపా నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో సేవా పక్షం మండల కన్వీనర్ పోచంపెల్లి నరేష్ ఆధ్వర్యంలో సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ఇంచార్జి జాడి బాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పక్షం రోజులు పార్టీ తెలిపిన సేవ కార్యక్రమలు గాంధీ జయంతి వరకు నిర్వహించాలని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రతి బూత్ లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలిపారు. మండల కేంద్రంలో బ్లడ్ డోనేషన్ క్యాంప్, శక్తి కేంద్రం ఇంచార్జి పరిధిలో స్వచ్ భారత్ కార్యక్రమాలు, జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీన్ దయల్ జయంతి రోజున ప్రతి బూత్ లో ఐదు మొక్కలు నాటాలని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు ప్రతి బూత్ లో నిర్వహించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కళ్లెం శివ, జాతరగొండ ఐలయ్య, మండల కార్యదర్శిలు గుంట అశోక్, కడారి స్వామి, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సంటి జితేందర్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజు, మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, షేవెళ్ల అక్షయ్, బూత్ కమిటీ అధ్యక్షులు దయ్యాల వీరమల్లు, దైవల తిరుపతి గౌడ్, ఉత్తేం కనుకరాజు, బుర్ర శ్రీధర్, ఎగుర్ల ఎల్లయ్య, మడికంటి శేఖర్, మంద రాజశేఖర్, వెంకట్ రెడ్డి, పురంశెట్టి మల్లేశం, వడ్లూరి రాజేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి

* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి

చేవెళ్ల, నేటిధాత్రి:

 

ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను సన్మానించిన స్టేట్ డైరెక్టర్ లు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-3.wav?_=7

 

ఎమ్మెల్యేను సన్మానించిన స్టేట్ డైరెక్టర్ లు..

పలమనేరు(నేటిధాత్రి) 

పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వి.కోటకు చెందిన రంగనాధ్, గజేంద్రలు గురువారం కలసి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా వీ.కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎ. ఎం.రంగనాధ్ ను, అదే మండలానికి చెందిన గజేంద్రను ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన విషయం తెలిసిందే. పార్టీ కోసం పనిచేసిన తమ సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవులకు ఎంపిక చేసిన స్థానిక శాసన సభ్యులను ఈ సందర్బంగా పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలసి ఆయన్ను సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారుఈ కార్యక్రమంలో నాయకులు రాంబాబు, మురుగేష్,చంద్ర శేఖర్ రెడ్డి, హరి, ఆనంద,వెంకటేష్, హేమకుమార్ తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version