చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…

చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…

రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులా..? విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులా..,?

“ఐ లవ్ యూ” మంత్రి వివేక్.. కావాలనే బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

*చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

మున్సిపల్ ఎన్నిక కాకుండా చూస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే…

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఐ లవ్ యూ మంత్రి వివేక్ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.ప్రజలంతా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల తీరును గమనిస్తున్నారని
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, అందరినీ కలుపుకుపోయామే తప్ప కక్ష సాధింపు చర్యలకు ఏనాడూ దిగలేదని మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన అనంతరం క్యాతన్ పల్లి లోని బాల్క సుమన్ తన నివాసానికి చేరుకున్న సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మూల రాజిరెడ్డి లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ లు బిఆర్ఎస్, సిపిఐ పార్టీల 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేశారని అయినా సరే తమ కౌన్సిలర్లు తలొగ్గ లేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ లు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మెన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ల కు మందు తాగించి తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. క్యాతనపల్లి లో గొడవ సందర్భంగా రాళ్ళు విసిరినోళ్ల మీద కేసులో బుక్ కాలేదని, మా పార్టీకి చెందిన 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతన్ పల్లి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్ ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే మాపైనే రివర్స్ లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతన్ పల్లి లో కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుండి ఎమ్మార్వో వరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు లోపల కూడా తమని ఇబ్బంది పెట్టారని తెలిపారు. జైలులో ఉండగా రామకృష్ణాపూర్ ఎస్సై నా ఇంటిని ఏ విధంగా సోదా చేస్తారో తెలపాలని సుమన్ ప్రశ్నించారు.అక్రమంగా నన్ను జైల్లో పెట్టారని ఇప్పుడు వారి కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నానని అన్నారు. సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయని ,పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని , భవిష్యత్తులో కూడా పొత్తుతోనే వెళ్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య స్పష్టం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

బారాస కౌన్సిలర్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపు

బారాస కౌన్సిలర్ అభ్యర్థిని విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపు…

బారాస నాయకులు రాజా రమేష్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గండమాల కృపానందం (గ్యాస్ నాని) ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి,బలవంతంగా విత్ డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా సమయం అయిపోయిన గంట తర్వాత తీసుకుని రావడంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారులు సమయం దాటి పోయిందని అనుమతించలేదు. ఆ అభ్యర్థి కంట నీరు పెడుతూ గజగజ వనికి పోతుండగా గమనించిన బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకులు రాజా రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సిపిఐ జిల్లా అధ్యక్షుడు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఇరు పార్టీల నాయకులు అభ్యర్థిని ఏం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ను మా పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థిని బెదిరించి ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా చేసుకోవాలని తీసుకురావడం ఏంటని నిలదీశారు. అప్పటికే అభ్యర్థిని దబాయిస్తూ నిన్ను మేము బెదిరించామా అంటూ అభ్యర్థిని గద్దించాడు.అభ్యర్థి గ్యాస్ నాని వనికిపోతూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. బారాస నాయకులు, అధికార పార్టీ నాయకులను అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న స్థానిక ఎస్సై జె శ్రీధర్ గొడవ జరిగేలా ఉందని గమనించి అందర్ని కార్యాలయం బయటికి పంపించి వేశారు.

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..

 

రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version