కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన..

కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు.
​ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల:
​సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది.
​ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు.
​కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి.
​ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
​విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి…..

సింగరేణి కాలనీలలో స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి..

దహన సంస్కారాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులు

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో రామప్ప,1000 క్వార్టర్స్, మాధవరావు పల్లి, బీసీ కాలనీలో స్మశాన వాటికలు లేక కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార దర్శి మాట్లాడుతూ.. స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న అంశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ ,సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు గతంలోనే వివరించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అట్లాగే సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి కి స్మశాన వాటికల విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 20,000 మంది కార్మికుల నివాసం ఉంటున్నారని ఈ ప్రాంతానికి దహన సంస్కారాల కోసం స్మశాన వాటిక లేకపోవడం బాధాకర మన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 500 మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం స్మశాన వాటికలు ఉన్నాయని, 20వేల మంది నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేక దహన సంస్కారాలకు కార్మికులు కష్టపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్, జిఎం లు స్పందించి స్మశాన వాటికలు ఏర్పాటుచేసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, నాయకులు గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version