బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కి పట్టణ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో కలుషిత మురికి నీరు కలిసిన నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. అట్టి నీటి నీ ప్రజలు వాడడం ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోయి వ్యాధిగ్రస్తులైతున్నారు. కావున స్వచ్ఛమైన నీరును పట్టణ ప్రజలకు అందించవలెను. ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడగలరు.
పట్టణంలోని అన్ని వార్డులలో దోమల బెడద ఎక్కువగా ఉన్నది. దోమల బెడద నివారణకు దోమల మందును స్ప్రే (పోగింగ్) చేయించగలరు.
అన్ని వార్డులలో డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు. వెంటనే డ్రైనేజీలు క్లీన్ చేయించగలరు.
సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి కన్నాల బస్తి ఫ్లై ఓవర్ వరకు మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు జరుగుచున్నవి. ఈ అసౌకర్యాన్ని తొలగిస్తూ రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేపట్టగలరు.
పైన పేర్కొనబడిన సమస్యల గురించి ఇంతకుముందు మీకు వినతి పత్రము ఇచ్చినాము. దానిమీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరల ఒకసారి మీకు ఈ సమస్యలపై వినతి పత్రము ఇచ్చుచున్నాము. ఇప్పుడైనా స్పందించి పైన సమస్యలు వెంటనే పరిష్కరించగలరని విశ్వసించుచున్నాము. ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో మునిసిపల్ ఆఫీసు ముందు భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనల ను జరుపుతాము అని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొల్లం పూర్ణిమ రాష్ట్ర సమితి సభ్యురాలు,చిప్ప నరసయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు,బొల్లం తిలక్ అంబేద్కర్ పట్టణ సహాయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ ఆడెపు రాజమౌళి
సిపిఐ పట్టణ కార్యదర్శి
తదితరులు పాల్గొన్నారు.