మొగుడంపల్లిలో నామినేషన్ కేంద్రాలు ఖరారు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల కేంద్రాలు ఖరారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కోసం గ్రామాలవారీగా కేంద్రాలను ఎంపీడీఓ మహేష్ ఖరారు చేశారు. ధనసిరి, మాడిగి, ఇప్పేపల్లి, గౌసాబాధ్ తండా, అసద్ గంజ్, గోపన్ పల్లి, ఖాజామాల్పూర్, గోడిగార్ పల్లి, మొగుడంపల్లి, మిర్జంపల్లి, జంగర్ బోలి, అర్చనాయక్ తాండ, విట్టు నాయక్ తండ, మన్నాపూర్, జాడి మల్కాపూర్, రాయిపల్లి తండా, సజ్జ రావు పేట తండా, గుడుపల్లి, చున్నం బట్టి తాండ, పడియల్ తండా, ఔరంగ నగర్ గ్రామాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు 8309271537 నంబర్ ను సంప్రదించవచ్చు.

భూపాలపల్లి లో టీఆర్పీ నేతల ధర్నా

టి ఆర్ పి నాయకుల ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు భూపాలపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పటేల్ రోడ్డు మీద బైఠాయించి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రవి పటేల్ పేర్కొన్నదేమనగా— తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు పాత రిజర్వేషన్ విధానాలకే కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం కాంగ్రెస్ మోసపూరిత ధోరణికి నిదర్శనమని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ సత్తా చాటే సమయం ఇదేనని, ఈ వర్గాల్ని ఒక్కటిగా కలుపుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా ముందుకు సాగుతుందని రవి పటేల్ తెలిపారు. “65 శాతం బీసీలు, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సమూహ బలం కలిసి వస్తే మాత్రమే నిజమైన రాజ్యాధికారం సాధ్యం. ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజనులకు న్యాయం చేయవు. కేవలం బీసీల కోసం పుట్టిన పార్టీ మా టీఆర్పీ,” అని అన్నారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ పార్టీ పోటీలో ఉన్నదని, ఆసక్తి ఉన్న వారందరూ తమను సంప్రదించాలని, ఎటువంటి భారీ ఖర్చులేమీ లేకుండానే గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని రవి పటేల్ హామీ ఇచ్చారు.
జిల్లాలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బహుజనులు కలసి బుద్ది చెప్పాల్సిన రోజులు వచ్చాయని, పెద్ద ఎత్తున యువత టీఆర్పీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు

అంచనాలకు అందని విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T141035.753.wav?_=1

 

అంచనాలకు అందని విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు

◆:- తాజా రిజర్వేషన్లతో కొందరిలో సంతృప్తి మరికొందరిలో అసంతృప్తి

◆:- 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ల ప్రకటనతో నిరాశలో బీసీ సామాజిక వర్గం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల(సర్పంచ్) రిజర్వేషన్లను ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు అంచనాలకు అందని విధంగా ఉన్నాయని రాజకీయ నాయకులు ఆలోచనలో పడ్డారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లకు భిన్నంగా ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లు ఉండటంతో కొందరు సంతృప్తితో ఉండగా మరికొందరు నాయకులు నిరాశతో ఉన్నారు. గతంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బేస్ చేసుకొని ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో 50% కొటాను మించి 66% అవ్వడంతో కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థాననికి ఆశ్రయించడంతో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు, ఎన్నికల నియమావళిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు 50% కోటా ప్రకారం ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు నిలిచిపోవడంతో బీసీ సామాజిక వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ రిజర్వేషన్లు పూర్తవ్వడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల నియమావళి అమలలో వచ్చే అవకాశం ఉన్నందున పోటీ చేసే ఆశావహులు పోటీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

త్వరలో రిజర్వేషన్లు ప్రక్రియ ఖరారు కానున్నాయి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T131541.019.wav?_=2

 

త్వరలో రిజర్వేషన్లు ప్రక్రియ ఖరారు కానున్నాయి

సర్పంచుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండండి:

◆:- యువ నాయకులు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మన భారతదేశంలో 15-29 గల 371 మిలియన్లకు పైగా యువకులు ఉన్న మన దేశం అనగా మొత్తం జనాభాలో 27 శాతం యువకులే ఉన్నారు. అంటే అత్యధికంగా యువత కలిగిన మన భారతదేశంలో చాలామంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే యువత రాజకీయరంగ ప్రవేశం చేయాలి. యువత రాజకీయం చేసిన రోజు మన దేశంలో చాలామంది అబ్దుల్ కలాంలను చూడవచ్చు. మన స్వామి వివేకానంద చెప్పిన విధంగా ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన వందమంది యువతను నాకు ఇస్తే నేను ప్రపంచాన్ని మార్చేస్తానన్నాడు. కావున యువత తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క మార్పు పల్లెల్లో నుంచి పట్టణం వరకు చేరాలి గల్లి నుండి ఢిల్లీ వరకు చేరాలి.

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే….

తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే. తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని. ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని. తంగళ్ళపల్లి మండల పరిధిలోని రౌడీ షీటర్. హిస్టరీ సీటర్లపై.ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రతిరోజు మండల o లో. గ్రామ గ్రామాల్లో పెట్రోలింగ్ చేయాలని. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సిబ్బంది అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చట్ట వ్యతిరేకతమైనకార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేకంగా నిఘ ఏర్పాటు చేయాలని. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్ ఓపెన్ చేయాలని. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే తగిన కార్యచరణ ప్రారంభించి. ప్రశాంతత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలని. స్టేషన్ పరిధిలో క్రిటికల్ నాన్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో విజిబుల్ పోలింగ్ పకడ్బందీగా అమలు చేస్తూ శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి సమస్యల తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘ పెంచాలని. గంజాయి డ్రగ్స్ సేవిస్తే వాటి వలన కలుగు కష్టనష్టాలను రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని వీటి నియంత్రణపై మత్తు పదార్థాలకు అలవాటు పడినవారికి. కలుగు అనర్ధాలపై. నేరాల నియంత్రణపై అవగాహన చేస్తూ వారిని చైతన్యపరచాలని తెలియజేస్తూ ప్రతిరోజు విస్తృతంగా వాహనాలు తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని. వీటన్నిటిపై. ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాలను వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాల వివరాలను స్టేషన్కు సంబంధించి పలు రికార్డులను తనిఖీ చేశారని. స్టేషన్ భౌగోళిక. మ్యాపు పరిశీలించి క్రైమ్ హాట్స్పాట్ అడిగి తెలుసుకున్నారని.అనంతరం పెండింగ్.కేసులు కోర్టు కేసులో ప్రస్తుత దర్యాప్తులో ఉన్న కేసులకు క్షుణ్ణంగా రివ్యూ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసి స్టేషన్.పరిధిలోని శాంతి పద్ధతులు పరిస్థితులను స్థితిగతులపై సై వివరంగా అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ వెంట. రూలర్ సీఐ మొగిలి ఎస్సై ఉపేంద్ర చారి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది. పాల్గొన్నారు

పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం…

పుంగనూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం

పార్టీ కార్యకర్తలకు అవగాహన
కల్పించిన

పుంగునూరు ఇన్ చార్జీ
చల్లా బాబురెడ్డి

అవగాహన కార్యక్రమంలో
పాల్గొన్న
షాప్ చైర్మన్ రవి నాయుడు, కర్నాటి అమర్నాథ్ రెడ్డి,

పుంగనూరు(నేటిధాత్రి) 

 

 

పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కమిటీలు వేయుటకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నియోజకవర్గ అబ్జర్వర్లు మరియు మండల అబ్జర్వర్లు కలిసి రొంపిచర్ల మండలం వి ఎం ఆర్ ఫంక్షన్ హాల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా అబ్జర్వర్ రవి నాయుడు కర్నాటి అమర్నాథ్ రెడ్డి అశోక్ మరియు మండల అబ్జర్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని కమిటీలు వేయుటలో అలసత్వం వహించకుండా అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో సూచించారు.
ఈ సందర్భంగా చల్లా బాబు రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ మరియు మండల కమిటీలను ఎన్నుకోవటంలో కార్యకర్తల సూచనల మేరకు మరియు పార్టీని బలోపేతం చేసే నాయకులకు నిరంతరం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పని చేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలియజేశారు.
అనంతరం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క మండలంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్క చోట గెలిచే విధంగా నాయకులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
పాల్గొన్నారు..

పరకాలలో బందు ప్రశాంతం…

పరకాలలో బందు ప్రశాంతం

పరకాల నేటిధాత్రి

 

తెలంగాణ లో బీసీ లకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని బీసీ నాయకులు ఇచ్చిన బంద్ లో శనివారం రోజున పట్టణంలోని వ్యాపారస్థులు,ప్రజలందరు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ బంద్ కు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.విద్యాసంస్థలు,కాలేజీలు సెలవు ప్రకటించాయి.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్….

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాల్ కల్ బంద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్థానిక న్యాల్ కల్ మండల కేంద్రం లోని బస్టాండ్ ముందు బీసీ సంక్షేమ సంఘం న్యాల్ కల్ మండల అధ్యక్షులు భోజగొండ శివరాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్య సంస్థలు దుకాణాలు ఇతర వ్యాపారాలు స్వచ్చందంగా బంద్ పాటించారు ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 42 % శాతం బీసీ రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోవాలని, ఇచ్చిన హామీని అమలు చేసి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయక పోవడం కారణంగానే బీసీల “బంద్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. బంద్ లో భాగంగా శాంతియుతంగా చేపట్టమని తెలిపారు ఈ రాష్ట్ర ప్రభుత్వనికి చిత్త శుద్ధి ఉంటే మీరు ఇచ్చిన బీసీ లకు కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తాను అన్న మాయమాటలు చెప్పి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు బీసీలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ మల్గి సర్పంచ్ బీసీ సంఘం విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతీ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మిర్జాపూర్ మాజీ సర్పంచ్ బీరప్ప చల్కి అశోక్ బీజేపీ మాజీ మండలం అధ్యక్షులు ఓంకార్ యాదవ్ బీజేపీ మండలం అధ్యక్షులు మల్లేష్ బీజేవైఎం మండలం అధ్యక్షులు విష్ణు పాటిల్ మండలం ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సతీష్ కులకర్ణి మైనారిటీ సభ్యులు అసిఫ్ నర్సప్ప లావేష్ పాటిల్ రాజు యాదవ్ పాండు తదితరులు ఉన్నారు,

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం..

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో *సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు సంతానం ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయుట అనర్హులని జీవో తీసుకువచ్చినప్పటి నుండి ముగ్గురు సంతానం కలిగిన వారు రాజకీయానికి దూరంగా ఉన్నారు,సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముగ్గురు పిల్లల జీవోను రద్దుచేసి ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్న ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో…..
ఈ రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలు సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులని జీవోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకుశుక్రవారం రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ జీవోను తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టికే రవీందర్, నల్లబెల్లి విజేందర్ ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం కుమారస్వామి కొర్రి సాంబశివుడు ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండె పు రెడ్డి రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రావు ,బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో బీసీ రిజర్వేషన్ బందుకు సిపిఐ మద్దతు…

బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని
హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి.
బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.
పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి .
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్.
తదితరులు పాల్గొన్నారు ,

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T140829.637.wav?_=3

 

బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..

రామాయంపేట అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే 18వ తేదీ శనివారం రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
మెదక్ జిల్లా బీసీ సంక్షేమం, రాజకీయ, కుల, మహిళా, యువజన, ఉద్యోగుల, దివ్యాంగుల, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకత్వంలో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీకర ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరిగింది.
సమావేశంలో నేతలు మాట్లాడుతూ — రాష్ట్ర జనాభాలో 65 శాతం బీసీలు ఉన్నా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ జేఏసీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండలంలోని ప్రజలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, కుల సంఘాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువజన సంఘాలు, అలాగే ఎస్సీ–ఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నాయకులు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం. మామిడి సిద్ధరాములు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్. రేవెల్లి వినయ్ సాగర్. బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే…

ప్రజల పక్షాన పోరాడిది కమ్యూనిస్టులే

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు గెలిపించుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని, ఎన్నికలు జరగక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు పదవి కాలం పూర్తయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తుందని దీంతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో రిజర్వేషన్లు 50 శాతం మించారాదని హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయ న్నారు. దేశంలో 65శాంతం బీసీలు ఉన్నారని ప్రభుత్వం దానికి 42 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో కోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు 50 శాతం మించరాదని నిబంధనలు ఉన్నాయని దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది కాలయాపన తప్ప మరేం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు, మున్సిపాలిటీల కాల పరిధి ముగిసి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని, రాష్ట్రానికి రావలసిన నిధులు రాక అభివృద్ధి స్తబ్దతగా మారిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీగా స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లాలో రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎంపీటీసీ జెడ్పిటిసి సర్పంచులు అధిక స్థానాలు గెలుచుకునే విధంగా మా ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని పోరాటాలు నిర్వహించే పార్టీలను ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్,క్యాతరాజ్ సతీష్,కోరిమీ సుగుణ,గంగసరపు శ్రీనివాస్ ,నేరెళ్ల జోసెఫ్ ,గోలి లావణ్య ,మహేశ్,పీక రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే

అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన

ధర్నా రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్, పోలీసుల చొరవతో నిరసన విరమణ

నర్సంపేట నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే హైకోర్టు స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ఆరోపించారు. రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వేసిన దాఖలు పట్ల గురువారం హైకోర్టు మద్యంతర స్టే విధించింది. దీంతో త్వరలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పాటు బీసీ కులాల విద్య ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జీజుల శ్రీనివాస్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ధర్నా రాస్తారోకో పట్ల సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడి నిరసన విరమింప చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల హక్కులు రిజర్వేషన్ల కోసం కొన్ని ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాల కుట్రలో భాగంగా హైకోర్టులో ఫిర్యాదు మేరకు హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. దీంతో బీసీలకు ఉద్యోగ,ఉపాధితో పాటు అన్ని విధాల అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి కోర్టులకు వెళ్లలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను వెంటనే ఎత్తివేసి 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే విధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కొట్లాడుతున్న మపై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, భేతి భాస్కర్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బండారి ఉదయ్ కిరణ్, మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, మహిళా అధ్యక్షురాలు బండి విజయ, కార్యదర్శి చామంతుల రమేష్, చెన్నారావుపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కారుపోతుల శ్రీదేవి, మహిళా నాయకురాలు వైనాల రజిత, గొర్రె వినయ్, శ్రీకాంత్, ల్యాగల ప్రవీణ్ కుమార్, సింగనబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్

జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు

సర్పంచ్‌కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు, రూ.1.50 లక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall

స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్​అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు.

 

పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.

 

మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి..

 

శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.

అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే?

 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్‌ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

 

అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి.

 

ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

డిపాజిట్ తప్పనిసరి..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్‌ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్​) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్​చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్​అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్​ బిల్లులు కూడా క్లియర్​ చేసి ఆ రసీదులు తీసుకోవాలి. అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్..

 

ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్‌ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్‌ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్‌ కు అనుమతి తప్పనిసరి. అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.

లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్..

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్‌ ఆఫ్‌ ఫ్రీ సింబల్స్​’ జాబితాను తెలంగాణ గెజిట్‌లో ఎస్‌ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్‌ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో…

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో

కలెక్టర్ కార్యాలయం లో సమావేశం

వనపర్తి నేటిదాత్రి .

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు.
వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ మార్పు పై ఓంకార్ యాదవ్ ఫైర్…

పార్టీ మార్పు పై ఓంకార్ యాదవ్ ఫైర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్ కల్ మండలం వడ్డి గ్రామం లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ మండలం మాజీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుండి పార్టీ మార్పు చేసిన నాయకులపై ఫైర్ అయ్యారు కితకో పార్టీ మార్పు చేస్తున్న నాయకులకు ప్రజలు యూవకులు గమనిస్తున్నారు అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికీ చిత్తూ చిత్తూ గా ఒడిస్తాం అని వారు ఫైర్ అయ్యారు రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటి చేపిస్తాం జడ్పీటీసీ కీ కూడ గెలుపే లక్ష్యంగా అందరు పని చెయ్యాలని ఎవరు ఆ ధైర్యం పడొద్దు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి రాహుల్ పలింకార్ నర్సప్ప సచిన్ లక్ష్మన్ షేర్ అలీ సంజుకుమార్ రాజు తదితరులు ఉన్నారు,

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.

చిట్యాల, నేటిధాత్రి :

రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

 బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

 బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..

 తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.

50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version