ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…
బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా

Vaibhavalaxmi Shopping Mall

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*

ప్రజలతో మాట్లాడుతూ….
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చెరువులు, కుంటలు నిండాయి…..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T142146.202.wav?_=1

 

చెరువులు, కుంటలు నిండాయి..
• ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
• ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల మారాయని బతుకమ్మ, దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై రాజేష్ సూచించారు. ఈ సందర్భంగా నిజాంపేటలో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు చెరువులు కుంటలు అధికంగా నిండడంతో రాబోయే బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సమయంలో మహిళలు, చిన్నపిల్లలు చెరువుల వద్దకు గుమి గూడి వెళ్ళవద్దన్నారు. చిన్నపిల్లలు చెరువుల వద్ద ఇష్టానుసారంగా తిరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘ పెట్టాలన్నారు. ప్రజలు ఆనందంగా పండగలు జరుపుకోవడమే కాకుండా.. సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T114733.704.wav?_=2

 

కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ప్రస్తుతం కాలంలో ఒత్తడి, లైఫ్ స్టైల్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అవుతున్నాయి. అయితే కొన్నాళ్ల వరకు పెద్ద వయసు ఉండే వారిలో మాత్రమే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అప్పుడే డయాలసిస్ అవసరం అవుతుందని చాలా మంది అనుకునే వారు, కానీ ఇప్పుడు యుక్త వయస్సులో కూడా కిడ్నీల సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీల వైఫల్యం ఎదురయితే కిడ్నీ మార్పిడి, డయాలసిస్ విధానమే మార్గం అయితే చాలా మందిలో డయాలసిస్ అంటే చాలా భయాలు నెలకొని ఉంటాయి. లేనిపోని అపోహలకు గురి అవుతుంటారు. అయితే డయాలసిస్ లో అపోహలు, వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీసే మొదటి 10 కారణాల్లో దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి ఒకటి. ఏడాదికి 10,00,000 మంది రోగులు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా డయాలసిస్ అవసరం అయ్యే రోగుల సంఖ్య 1.75 లక్షలుగా ఉంది. బీపీ, షుగర్, ఇతర జన్యుపరమైన కారణాలు కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణం అవుతున్నాయి. ఇది ఏ వయసులో అయినా ఎవరికైనా పురుషులు, మహిళలు, పిల్లలకు రావచ్చు. డయాలసిస్ విధానంలో కిడ్నీలు చేసే పనిని ఓ యంత్రం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను పిల్టర్ చేయడం ద్వారా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అయితే డయాలసిస్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందనే ఆపోహలు ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజాలు కాదని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.

1) డయాలసిస్ అనేది మరణశిక్ష అనేది వాస్తవం కాదు..

డయాలసిస్ అనేది మరణిశిక్ష అని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది మూత్రపిండాలు పాడయితే మనిషి జీవించేందుకు రెండో అవకాశం లాంటిది. చాలా మంది ప్రజలు దశాబ్ధాలుగా డయాలసిస్ పై జీవిస్తున్నారు. డయాలిసిస్ అనేది సాధారణ విషయం గత 15 ఏళ్లలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న భారతీయుల సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ప్రతి వంద మందిలో 17 మంది పౌరులు ఏదో ఒక రూపంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు నివేదించారు. భారతదేశంలో డయాలసిస్ చేయించుకుంటున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం 10-15% పెరుగుతుంది. ఇందులో ప్రధానంగా పిల్లలు ఉన్నారు.

2) డయాలసిస్ ఉంటే ప్రయాణం చేయకూడదనేది అపోహ మాత్రమే..

డయాలసిస్ ఉన్నవారు ఇంటికే పరిమితం కావాలనేది చాలా మంది భయపెడుతుంటారు. ఆకస్మికంగా, ఇంటికి దూరంగా ప్రయాణం చేయడం కష్టం. అయితే ప్రయాణ స్థలంలో డయాలసిస్ సెంటర్ ను కనుక్కున్నట్లు అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు వెళ్లిన ప్రాంతంలో కూడా డయాలసిస్ చేయించుకునే అవకాశం ఉంటుంది.

3) ఆహారానికి దూరం కావాలనేది అబద్ధం

కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలనేది ఓ అపోహా మాత్రమే. సరిగ్గా డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం అన్ని రకాల సంతులిత ఆహారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ ఉప్పు తీసుకోవడం, నియంత్రిత పొటాషియం, ఫాస్పరస్ ఆహారం, ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. కిడ్నీ ఫ్రెండ్లీ ఆహారాన్ని తీసుకోవాలి. దీని తగ్గట్లుగా మీ డాక్టర్, డైటీషియన్ సహాయం చేయగలరు.

4) డయాలసిస్ పై జీవితాన్ని ఎదుర్కోవడం అసాధ్యం కాదు..

డయాలసిస్ తో చాలా ఏళ్లు బతుకుతున్నవారు ఉన్నారు. ముందుగా తమ భయాలను అధిగమించాలి. డయాలసిస్ విధానం గురించి సరైన అవగాహన కలిగి ఉంటే జీవితాంతం ఎలాంటి సమస్యలు లేకుండా బతకవచ్చు. మానసిక ఆరోగ్యనిపుణులు, డాక్టర్లు ఈ విధానం గురించి మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలరు.

5) క్రీడలు, వ్యాయామంలో పాల్గొనొచ్చు..

డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్లు వ్యాయామం, ఆటలకు దూరంగా ఉండాలనేది అబద్ధం. వ్యాయామం మీ శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ (ఇండోర్ లేదా అవుట్), స్కీయింగ్, ఏరోబిక్ డ్యాన్స్, మజిల్స్ కు సంబంధించిన వ్యాయామాలు చేయవచ్చు. అయితే ఏదైనా వ్యాయామాలు ప్రారంభించే ముందు ముందుగా మీ డాక్టర్ని ఒకసారి సంప్రదిస్తే మంచిది. మీ శారీరక ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం మంచిది. ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం అనేది డయాలసిస్ ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. చక్కని పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి మీ రక్తపోటును, రక్త స్థాయిలను పర్యవేక్షించండి.

ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం…

ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం

కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాలు

భూపాలపల్లి నేటి ధాత్రి

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జామా మసీద్ ప్రాంగణంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల ఆధ్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల మత పెద్దలు మతగురువులు ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా 39 దేశాలలో సెప్టెంబర్ 12 నుండి 14 వరకు ప్రపంచ బాల్యవివాహాల వ్యతిరేక దినోత్సవం జరుపుతూ ఉంది అందులో వివాహాలను నిర్వహించే మత పెద్దలు గురువులను భాగస్తులను చేస్తూ బావి భారతం నిర్మాణానికి మత గురువులు చేయుటనివ్వాలంటూ నేడు జామా మసీద్ కమిటీ సభ్యుల చే బాల్యవివాహాలను అరికట్టడం కోసం బాలికల అభ్యున్నతి కోసం బలమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మసీద్ అధ్యక్షులు హబీబ్ ఆఫీజ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఇమ్రాన్ బాబర్ ఇస్మాయిల్ ఫయాజ్ ముస్లిం సోదరులు మరియు చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ సహాయ ఎన్జీవో కోఆర్డినేటర్ సామల శ్రీలత, నరేష్ తదితరులు పాల్గొన్నారు

యాంటీ కరప్షన్ లా సదస్సును విజయవంతం చేయండి….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T140720.788.wav?_=3

 

 

యాంటీ కరప్షన్ లా సదస్సును విజయవంతం చేయండి.

న్యాయవాది పరిషద్ ఆధ్వర్యంలో యాంటీ కరప్షన్ లా పోస్టర్ ఆవిష్కరణ.

అవినీతి నిర్మూలన కోసం అందరూ చైతన్యంతో ముందుకు రావాలి.

ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు ఏర్పాటు.

:__ న్యాయవాది పరిషద్ వరంగల్-హనుమకొండ జిల్లా అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ అడ్వకేట్.

వరంగల్, నేటిధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

న్యాయవాది పరిషద్ తెలంగాణ ఆధ్వర్యంలో రేపు (సెప్టెంబర్ 13న) జరగబోయే యాంటీ కరప్షన్ లా సదస్సును విజయవంతం చేయాలని న్యాయవాది పరిషద్ వరంగల్, హనుమకొండ అధ్యక్షులు చొల్లేటి రామకృష్ణ అడ్వకేట్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన హనుమకొండ బార్ అసోసియేషన్ హాల్లో, పలువురు సీనియర్ అడ్వకేట్ల సమక్షంలో యాంటీ కరప్షన్ లా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

న్యాయవాది పరిషద్ తెలంగాణ, అఖిల భారతీయ అధివక్తా పరిషద్ (ఏబిఏపి) ఆధ్వర్యంలో “యాజమాన్య వ్యతిరేక చట్టాలు – ప్రాక్టీస్ & ప్రొసీజర్” పేరిట ప్రత్యేక సిమ్పోజియం సెప్టెంబర్ 13న ఉదయం 11 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ భవన్, అదాలత్ ప్రాంగణంలో జరుగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి హనర్బుల్ జస్టిస్ కునూరూ లక్ష్మణ్ హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వి.బి. నిర్మల గీతాంబ, హనుమకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె.పట్టాభి రామరావు పాల్గొననున్నారు. అలాగే న్యాయవాదులు కరోర్ మోహన్, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్స సుధీర్, హనుమకొండ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పులి సత్యనారాయణ, కేవీకే గుప్త తదితరులు హాజరుకానున్నారు. న్యాయవాది పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సెమ్సాని సునీల్ నేతృత్వంలో కార్యక్రమం కొనసాగనుంది.

 

 

 

 

 

వరంగల్, హనుమకొండ న్యాయవాది పరిషద్ యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అవినీతి నిర్మూలనలో చైతన్యాన్ని పెంపొందించే ఈ సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

అఖిల భారతీయ అధివక్త పరిషద్ (ఏబిఏపి) స్థాపన.., లక్ష్యాలు…!

భారతదేశ న్యాయవాదుల అధిష్ఠాన సంస్థగా గుర్తింపు పొందిన “అఖిల భారతీయ అధివక్త పరిషద్” (ఏబిఏపి) 1992వ సంవత్సరం, ఢిల్లీలో స్థాపించబడింది. ఈ సంస్థను ప్రముఖ విజనరీ దత్తోపంత్ థెంగడిజీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అభ్యుదయ భావాలు, భారతీయ విలువలు, సంప్రదాయాలు ప్రతిబింబించే న్యాయవ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తుంది. ధర్మాన్ని న్యాయవాదులకు పరిచయం చేయడం ప్రధాన లక్ష్యం. న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరగాలి, నైతికత, సంకల్పం, ఆచార వ్యవస్థలు న్యాయవాదులలో పెంపొందాలి అనే ఉద్దేశంతో పనిచేస్తుంది.

 

 

 

అఖిల భారతీయ అధివక్త పరిషద్ (ఏబిఏపి) కార్యకలాపాలు, నిర్మాణం.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా శాఖలు కలిగిన న్యాయవాదుల నెట్‌వర్క్‌గా వ్యవహరిస్తుంది. ప్రతి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒక బృహత్తర న్యాయవాదుల సంఘంగా కల్సి, అభ్యాసకులకు న్యాయంపై అవగాహన పెంచే శిక్షణ, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తారు. జాతీయ న్యాయ సదస్సులు, సెమినార్లు, వివిధ అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. న్యాయ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్స్, లీగల్ అవగాహన క్యాంపులు, కాంటిన్యూయస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు.
‘న్యాయప్రవాహ్’ అనే ద్వైభాషా పత్రిక కూడా ప్రచురిస్తున్నారు, ఇందులో నూతన విధానాలు, న్యాయ నిర్ణయాలు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యాసాలు ఉంటాయి. సామాజిక న్యాయం, చట్టాల రిఫార్మ్స్, నైతిక న్యాయ అనుసంధానం, భారతీయ న్యాయవాదులకు మరింత ప్రాముఖ్యత కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది. ఈ సంస్థ ద్వారా న్యాయవాదులకు నేటి సామాజిక, చట్టపరమైన సమస్యలపై అవగాహన పెంపొందటమే కాదు, దేశ అభివృద్ధిలో న్యాయ రంగ పాత్రను వివరంగా చర్చిస్తారు. ఏబిఏపి కి అనుగుణంగా తెలంగాణలో “న్యాయవాది పరిషద్ తెలంగాణ” కొనసాగుతుంది.

 

 

 

రాష్ట్ర ఋషి దత్తోపంత్ థెంగడిజీ అరుదైన మహానుభావుడు

మహారాష్ట్రలోని ఆర్వీ గ్రామంలో 1920 నవంబర్ 10న జన్మించిన రాష్ట్ర ఋషి దత్తోపంత్ థెంగడిజీ, తన ఆలోచనలతో, కార్యచరణతో జాతీయ జీవనంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 1942లో ఆరెస్సెస్ ప్రచారకుడిగా చేరిన ఆయన కేరళ, బెంగాల్ ప్రాంతాల్లో పని చేసి, తరువాత కార్మికులు, రైతులు, స్వదేశీ ఆవశ్యకతల కోసం భారతీయ మజ్దూర్ సంగ్, భారతీయ కిసాన్ సంగ్, స్వదేశీ జాగరణ మఠ్ వంటి జాతీయ స్థాయి సంస్థలను స్థాపించారు. థెంగడిజీ తన జీవితంలో ఒకవైపు మార్క్సిస్ట్ సిద్ధాంతాలను లోతుగా అధ్యయనం చేయగా, మరోవైపు భారతీయ తత్త్వశాస్త్రంలోని అనాశక్తి యోగాన్ని ఆచరించడం ద్వారా విరుద్ధతల మధ్యన ఒక సమన్వయాన్ని చూపించారు.

 

 

 

“ధర్మం, అర్థం, కామం, మోక్షం” అనే హిందూ జీవన సూత్రాలను ఆచరణలో పాటించారు. 1975లో జయప్రకాశ్ నారాయణ ఏర్పాటుచేసిన లోకసంఘర్ష్ సమితికి నేతృత్వం వహిస్తూ, ఎమర్జెన్సీ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నడిపించారు. దీని ఫలితంగా 1977లో ఇందిరా గాంధీ పరాజయం చెందటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత అధికారంలో భాగం అవ్వకుండా, పదవులను స్వీకరించకుండా జీవించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చదలచిన పద్మ విభూషణ్ బహుమతిని కూడా నిరాకరించారు. దేశంలో ఊహాత్మక వ్యాపారాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. స్టాక్ ఎక్స్చేంజ్, డెరివేటివ్స్, కరెన్సీ మార్కెట్లకు బదులుగా స్వయం ఉపాధిపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఆలోచనాపరుడిగా ఆయన 100కు పైగా పుస్తకాలు రచించారు. కార్యకర్త, థర్డ్ వే, ఆన్ రివల్యూషన్, హిందూ ఎకనామిక్స్ వంటి పుస్తకాలు విస్తృత ఆదరణ పొందాయి. డాక్టర్ అంబేద్కర్‌తో కలిసి ఆయన ఆదిమ జాతి సంఘ్ను స్థాపించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు పర్యాయాలు సేవలందించిన థెంగడిజీ, జీవన విలువల్లో స్పష్టత, ఆచరణలో నిబద్ధతతో దేశానికి మార్గదర్శకుడిగా నిలిచారు.

✍️ గంగరాజు కందికొండ రిపోర్టర్ వరంగల్..

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*ప్రజలను చైతన్య పరచడంలో మీడియాది ముఖ్యపాత్ర..

*కుటుంబాన్ని పక్కనబెట్టి సమాజం కోసం కృషి చేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులు..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
10:

 

 

 

వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, పక్కనబెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యం గా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని తుడా చైర్మన్, టిటిడి బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. ఆధునికరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ ను ఆధునికరించడం సంతోషంగా ఉందన్నారు. మొదటినుంచి మీడియా మిత్రులు తన సోదరులుగా భావించి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నానని ఇకపై కూడా వారితో కలిసి ప్రయాణం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. యువత చెడుదారి పట్టుకున్న వారిని మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనలతో మీడియా తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగల్లో భారత దేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు. తిరుపతి మీడియా మిత్రులకు ప్రెస్ క్లబ్ కు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని హామీ ఇచ్చారు,
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు..

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు.
తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహించడం ద్వారా కాళోజి సాహిత్య సేవలను స్మరించుకోవడం గర్వకారణమని, కాళోజి కవిత్వంలో మన భాష, మన భూమి, మన సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాళోజి కవి మాత్రమే కాదని, సామాజిక చైతన్యానికి మార్గదర్శకులని కొనియాడారు.
కాళోజి చూపిన మార్గంలో సాగితే మన భాష, మన సంస్కృతి మరింత వెలుగొందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లైన్స్ 320 మల్టీ ఫుల్ ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T143453.919.wav?_=4

 

లైన్స్ 320 మల్టీ ఫుల్ ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి…

రామాయంపేట సెప్టెంబర్‌ 9 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

లయన్స్ మల్టిపుల్ 320లో ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. రక్త, అవయవదానాలపై గత రెండున్నర దశాబ్దాలుగా అవగాహన కల్పించడంలో విశేష కృషి చేసినందుకు ఈ గౌరవం దక్కిందన్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ కొంపల్లి కె.వి.ఆర్ కన్వెన్షన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర లయన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ సన్మానం జరిగింది. రాష్ట్రంలోని 320 ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ జిల్లాలకు చెందిన లయన్స్ సభ్యులలో ఉత్తమ సేవలందించిన వారిని అవార్డులతో సత్కరించారు.
ఈ సందర్భంగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ లయన్ హనుమండ్ల రాజిరెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు రక్త, అవయవదానాలపై సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.
లయన్స్ ఇండియా ప్రతినిధి లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు మాట్లాడుతూ, సమాజంలో రక్తం, అవయవదానం అత్యంత ప్రాముఖ్యత కలిగిన సేవ అని పేర్కొన్నారు. లయన్స్ కానిస్టిట్యూషన్ ఏరియా లీడర్ లయన్ ఆర్. సునీల్ కుమార్ మాట్లాడుతూ, “లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఫిబ్రయిషీయో అలివేరా రూపొందించిన కార్యక్రమాలలో రక్త, అవయవదానం కూడా ప్రధాన అంశంని తెలిపారు.
లయన్స్ గవర్నర్ నగేష్ పంపాటి మాట్లాడుతూ, “320డి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం, అవయవదానం, శరీరదానానికి పలువురు ముందుకు వచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన గవర్నర్ లయన్ ఏ. అమర్నాథ్ రావు, జిల్లా మొదటి వైస్ గవర్నర్ లయన్ ఎం. విజయలక్ష్మి, రెండవ వైస్ గవర్నర్ లయన్ డి. నరసింహారాజు, పలు జిల్లాల గవర్నర్లు, మాజీ గవర్నర్లు, గ్యాట్ లీడర్లు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

రక్త, అవయవదానాల అవగాహనకు సహకరిస్తున్న పాత్రికేయులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, రెడ్‌క్రాస్, లయన్స్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ గౌరవాన్ని అందుకున్నారు.

మట్టి గణపతులను ఉంచి పర్యావరణాన్ని రక్షించాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T160541.014-1.wav?_=5

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలి

పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వలన జల కాలుష్యం ఏర్పడి జీవవైవిధ్యానికి నష్టం కలుగుతుందని,ఈ సందర్భంలో ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.వినాయక చవితి పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా,ఆనందోత్సాహంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

రైతులకు తప్పని యూరియా కష్టాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T154922.742-1.wav?_=6

 

రైతులకు తప్పని యూరియా కష్టాలు

రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోలి చంద్రారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

చిగురుమామిడి మండలంలోని రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా మండలంలో యూరియా బస్తాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని దీనిని పరిష్కరించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఘెరంగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ప్రతిరోజు ప్రాథమిక సహకార కేంద్రం వద్ద బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిల్చున్న పొన్నం ప్రభాకర్ కు కనీస కనికరం లేకుండా పోయిందని రైతులను గోస పెట్టిన ఏప్రభుత్వం కూడా నిలవదని ఆయన అన్నారు. పట్టాదారు పాసు బుక్కు ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతోపాటు నాన్ లిక్విడ్ కొంటేనే యూరియా బస్తా ఇస్తున్నారని రైతుకు ఇష్టం లేకున్నా అంటగడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని వెంటనే రైతులకు చిగురుమామిడి మండలంలో సరిపడ యూరియాని తెప్పించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్, రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ అత్యవసర పరిస్థి తిలో 1912 కు సంప్రదిం చాలి..

విద్యుత్ అత్యవసర పరిస్థి తిలో 1912 కు సంప్రదిం చాలి

విద్యుత్ ప్రమాదాల సూచ నలు ప్రజలు పాటించాలి

శాయంపేట నేటిధాత్రి:

విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని విద్యుత్ అధికారి చందులాల్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల ప్రధాన కారణాలు మరియు జాగ్రత్తలను వివరించారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాటించవలసిన జాగ్రత్తలు
తడిచిన చేతులతో విద్యుత్ పరికరాలు తాకరాదు.
వర్షాకాలంలో కరెంట్ స్తంభాలను పట్టుకోరాదు.
•పడిపోయిన విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లరాదు, తాకరాదు.పవర్ లైన్ దగ్గర గాలిపటాలు ఎగరేయరాదు.
కరెంట్ ఉన్న తీగల దగ్గర ఇనుప దండలు వాడరాదు.
వాటర్ హీటర్, చార్జర్ వైర్లను చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచరాదు.నాసిరకం వైర్లు, స్విచ్ బోర్డులు వాడరాదు.
ఇంటి పరికరాలకు ఎర్తింగ్ తప్పనిసరిగా చేయించుకో వాలి.ఛార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడరాదు లేదా ఆటలు ఆడరాదు.చిన్నపిల్లలు స్విచ్ బోర్డుల దగ్గరకు వెళ్లకుండా చూడాలి.విద్యార్థులు రైతులకు చెప్పవలసిన జాగ్రత్తలు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పశువులను మేపరాదు.
పంటచేలకు కరెంట్ ఫెన్సింగ్ వాడరాదు.ఇనుప స్టార్టర్ బాక్సులను వాడరాదు.
కరెంట్ లైన్ల క్రింద నిర్మాణాలు చేయరాదు.ఇంటి దగ్గర కరెంట్ వాడకానికి కోక్కాలు వాడరా దు; సర్వీస్ వైర్‌ను అధికారుల ద్వారా కనెక్ట్ చేయించుకోవాలి.
ట్రాన్స్ఫార్మర్ రిపేర్‌ను రైతులు స్వయంగా చేయరాదు అధికారులు వచ్చే వరకు వేచి ఉండాలి, మోటార్ సర్వీస్ వైర్లు కరెంట్ లైన్‌కు కనెక్ట్ చేసేటపుడు, మూడు వైర్లను ఒకే సమయంలో కలిపి, ఒక మీటర్ దూరంలో ముడివేయా లి విడిగా తగిలించరాదు. ప్రమాదం జరిగినప్పుడు చేయవలసినవి.ప్రమాదంలో ఉన్న మనిషి/జంతువు/వస్తువును నేరుగా తాకరాదు.
పొడి కర్ర, ప్లాస్టిక్ పైప్ లేదా ఇన్సులేటెడ్ వస్తువు ద్వారా మాత్రమే వేరు చేయాలి.
వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలి.
ఎలాంటి విద్యుత్ సమస్య లకైనా టోల్‌ ఫ్రీ నంబర్ 1912 కి సమాచారం ఇవ్వాలి.

అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన

అంగన్వాడీలో తల్లిపాల పట్ల అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నర్సంపేట -4 అంగన్వాడీ కేంద్రంలో స్థానిక అంగన్వాడీ టీచర్ నల్లభారతి ఆధ్వర్యంలో తల్లిపాల పట్ల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సెక్టార్ సూపర్వైజర్ రమ హాజరై మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు ఇచ్చే పాలను ముర్రుపాలు అంటారని వాటిని త్రాగించడం ద్వారా బిడ్డకు నిరోధకశక్తి వెంటనే అందుతుందని తెలిపారు. ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డల ఆప్యాయత పెరగడంతో పాటు ఆరోగ్యవంతమైన బిడ్డను తయారుచేసిన వారవుతారన పేర్కొన్నారు.బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయ్యేంతవరకు ఎలాంటి పోతపాలు,సీసాపాలు ఇవ్వవద్దని ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే బాలామృతాన్ని బిడ్డకు తినిపించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ,అంగన్వాడీ టీచర్ గౌసియా, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు భాగ్య,అర్పి రజిత,ఆశ కార్యకర్త రమ,తల్లులు మౌనిక,సువార్త,అనూష,శ్రీలేఖ, అనిత,జ్యోతి, సుమలత,నాగజ్యోతి, సౌమ్య, వజ్రమ్మ, శోభ,రాజా తల్లులు పాల్గొన్నారు.

రాంపూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ , డ్రగ్స్ పైన అవగాహన..

రాంపూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ , డ్రగ్స్ పైన అవగాహన

నిజాంపేట్, నేటి ధాత్రి

రాంపూర్ ఉన్నత పాఠశాలలో నిజాంపేట ఎస్సై రాజేష్ గారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ మరియు డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి డ్రగ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలి అని ఎలాంటి సమస్యలు సందేహాలు ఉన్న 112 నెంబర్ కు డయల్ చేసినచో కావలసిన సహాయం అందుతుంది అని తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు , స్నేహితులకు చెప్పి పరిష్కరించుకోవాలి అని అలా సమస్య పరిష్కారం కాని సమక్షంలో 112 కు డయల్ చేసి సహాయం పొందొచ్చు అని సూచించారు. పాఠశాల హెచ్ఎం పద్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ సోషల్ మీడియా, చుట్టు జరుగుతున్న విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ మెంబర్ గౌస్, ఏఏపిసి చైర్మన్ ఇందిర, గ్రామ కార్యదర్శి చంద్రహాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పరశురాములు, ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, అర్జున్, సుకన్య, నరేష్, కుమారస్వామి, పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కానిస్టేబుళ్లు విజయ్, రమేష్ గ్రామస్తులు సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట పై అవగాహన సదస్సు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝారసంగం మండలంలో రైతుబంధు ఆయిల్ పామ్ మరియు మామిడి పంటల మీద ఆహ్వాన సదస్సు నిర్వహించడం జరిగింది ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది మరియు సంగారెడ్డి జిల్లాలో 3000 ఎకరాల oil palm సాగులో ఉంది ఈ సంవత్సరం 3750 ఎకరాలు ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించబడినది అదే విధంగా ఝరాసంగం మండలంలో 160 ఎకరాలకు సాగులో ఉంది మరియు కొత్తూరు D నర్సరీలొ 150000 మొక్కలను,ఆయిల్ పామ్ పంటని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు మరియు కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త శైలజ గారు మామిడిలో చేపట్ట వలసిన యాజమాన్య చర్యలు మరియు సస్యరక్షణ చర్యల మీద వివరించడం జరిగింది. తదుపరి మామిడి తోటలో చేపట్ట వలసిన కొమ్మ కత్తిరింపులను క్షేత్రం లో చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి సునీత రోజు గారు వ్యవసాయ అధికారి వెంకటేష్ గారు కెవికె సైంటిస్ట్ శిరీష గారు మరియు ఏపీవో రాజ్ కుమార్ గారు ఏఈఓ జ్ఞానం గారు గోద్రెజ్ ఆగ్రోవేట్ ప్రతినిధులు కొండలరావు గారు, రాజేష్ రెడ్డి, దినేష్ మరియు డ్రిప్పు ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన..

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-31.wav?_=7

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం.

ఆయిల్ పామ్, బహువార్షిక పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయల సాగు ప్రభుత్వ ప్రోత్సాహకా లు
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం
వరి నుండి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు & మల్బరీ సాగు చేయాలి.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

గురువారం తొర్రూరు మండలంలోని వెంకటాపురం, మాటేడు, హరిపిరాల, తదితర గ్రామాలలో సాగులో ఉన్న ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులకు సాగుపై పలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులు నికర ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ ద్వారా టమాట, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవవర్, తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయల నారు మొక్కలను ఎకరానికి 8000 మొక్కలను ములుగు, సిద్ధిపేట జిల్లా నుండి రాయితీ పై సరఫరా సౌకర్యం ఉన్నదని తెలిపినారు. అలాగే తీగ జాతి కూరగాయల సాగుని శాశ్వత పందిరిని నూతనంగా నిర్మించి సాగు చేసే రైతులకు అర ఎకరానికి రూ. 50,000/- రాయితీని రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కల్పించబడునని తెలిపారు. పామాయిల్ తోటలలో మొదటి నాలుగు సంవత్సరాలలో అంతరపంటల కింద కూరగాయలు సాగు చేసే ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 2,100/- అందించబడునని తెలిపారు.

ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు సర్వేశ్వర రావు, యాకయ్య, టి. జి. ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి సి.హెచ్. రాములు, క్షేత్ర సిబ్బంది వెంకట్, అఖిల్, రంజిత్, ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధులు జి. ప్రసాద్ బాబు, జి. శరత్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా..

పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా

ముత్తారం :- నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-19.wav?_=8

ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి ఆదేశాలతో డాక్టర్ అమరేందర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది వైద్య ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న జిల్లా క్షయ అధికారి డాక్టర్ సుధాకర్ రెడ్డి ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీరాములు మరియు జిల్లా మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ వాణిశ్రీ సందర్శించి పరిసరాల పరిశుభ్రత పై అవగాహనా కల్పించారు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల డ్రాప్ అవుట్ వెరిఫికేషన్ గ్రామంలో ఆంటీ లార్వా రిమూవ్ శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత గవర్నమెంట్ డెలివరీ టీబి కేసెస్ ఫాలో ఆఫ్ . ఫీవర్ కి ఎస్ ఎస్ వెరిఫికేషన్ చేయడంతో పాటు క్యాంపును సందర్శించారు మెడికల్ క్యాంపులో 82 మందికి ఓపి చూడగా 12 మంది రక్త నమూనాల సేకరించి అందరికీ ఆరోగ్య విద్యా బోధన చేయడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ మందులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది. గ్రేస్మని శ్రీనివాస్ రమ స్వప్న సంధ్య విజయ పాల్గొన్నారు

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ కాశీనాథ్..

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్ఐ కాశీనాథ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-6.wav?_=9

భారత రాజ్యాంగ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని జహీరాబాద్ గ్రామీణ ఎస్ఐ యం కాశీనాథ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిది రంజోల్ లో గల శ్రీ సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ కాశీనాథ్ విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న విద్యాహక్కు చట్టం ఆర్టికల్ 21 ఏ ద్వారా మనం ఇంత స్వేచ్చగా విద్యను అభ్యసించ గలుగుతున్నామని ఎస్ఐ ఆన్నారు. ప్రభుత్వం విద్యాలయాల్లో ఉచిత విద్యను అందిస్తూ, అనేక ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది విద్యా హక్కు చట్టం ద్వారానే అని పేర్కొన్నారు. విద్యార్థులకు సైబర్ అవేర్నెస్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006, ది తెలంగాణ ప్రివిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్-1997, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-2009, చైల్డ్ లేబర్ యాక్ట్-2016, పీఓసీఎస్ఓ ఆక్ట్-2012 మరియు మోటార్ వెహికల్ యాక్ట్ లాంటి చట్టాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు సుమారు 150 మంది పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం.

ఉచిత వైద్య శిబిరం. ‌ ‌ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన
మండల వైద్యాధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ సంధ్య

మొగులపల్లి నేటి ధాత్రి

మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ,డాక్టర్ సంధ్య గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని మంగళవారము నిర్వహించినారు. గ్రామంలో 53 మందికి వైద్య పరీక్షలు చేసి, జరపీడుతులకు రక్త నమూనాలు ఒకటి తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,సిజను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం స్వరూప ,ఆశాలు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి.

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మరొక వ్యక్తికి పునర్జన్మను ఇవ్వడానికి జీవన్ దాన్ మహాదానమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ శాఖ, టీ 9 ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని ఆబ్నుస్ ఫంక్షన్ హాల్ లో నేత్ర అవయవ శరీరదానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ముఖ్య అతిధిగా పాల్గొని అతిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన కలగాలని, అవయవ దానంతో మరికొందరి జీవితాలలో వెలుగు నింపవచ్చునని, దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన కలగాలని చెప్పారు.కొన్ని మత ఆచారాలు అవయవ దానం చేస్తే జీవుడు దైవంలో ఐక్యం కాదన్నా అపోహ ఉందని, కానీ మనిషి ప్రాణం నిలబడితే ఆ దైవం కూడా అనుగ్రహిస్తాడని తెలిపారు. అవయవదానం చేసిన వారు మహాత్ములని, చిరంజీవులుగా మిగిలిపోతారని సూచించారు.మనిషి చనిపోతే ఇక తిరిగి రారు,ఇక లేరు అనుకుంటారని,కానీ ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుండి 8 మందికి కొత్త జీవితాన్ని ఇస్తుందన్నారు.వేల మంది రోగులు తమకు అవసరమైన అవయవాలు సరైన సమయంలో లభించకపోవడంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి రక్తదానం చేసే విధంగానే ప్రతి ఒక్కరూ అవయవనానికి సైతం ముందుకు రావాలని కోరారు. జీతే జీతే రక్తదానం జాతే జాతే నేత్రదాన్, దేహ్ దాన్ చేయాలన్నారు.రోగిని బ్రతికించే వాళ్ళు డాక్టర్లు దేవతలైతే అయితే దానం చేసిన వారు దైవదూతలన్నారు.అవయవ దానం పై అవగాహన కార్యక్రమాలను ఉదృతం కలెక్టర్ చేయాలని కోరారు.
దాతలకు అవగాహన కల్పిస్తున్న వాలంటీర్లు, నిర్వాహకులకు అధికారులు వైద్య సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వక్తలు మాట్లాడుతూ
అవయవ దానం యొక్క
ప్రాముఖ్యతను వివరించారు
చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు మట్టిలో పాతడం ద్వారా మట్టి పాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని తెలిపారు.ఈ సందర్భంగా అవయవ దానం చేయుటకు అంగీకరించిన వారికి శాలువాలతో కలెక్టర్ సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
కేఎంసీ, ఎంజీఎం నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ లు డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, డాక్టర్ చిలుక మురళి,డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ కూరపాటి రమేష్,ప్రభుత్వ సూపర్డెంట్ డాక్టర్ భరత్ కుమార్, మైదం రాజు, తహసీల్దార్ ఇక్బాల్, నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version