న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం:-
వరంగల్, నేటిధాత్రి, (లీగల్):-
శుక్రవారం నాడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) ను పురస్కరించుకొని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి యం.సాయి కుమార్ అధ్యక్షతన “మిషనరీస్ ఆఫ్ ఛారిటి”, కాశిబుగ్గ, వరంగల్ లోని మేథో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ హాజరై, మాట్లాడుతూ “మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు.
దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్తులో వీరికి కావలసిన అన్ని రకాల వైద్య సేవలకు మమ్మల్ని సంప్రదించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా మేథో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లను అందించి, వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, డిప్యూటి లీగల్ ఏయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతెజార్గంజ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీ.తేజ, ఎన్.వెంకటేశ్వర్లు డా.క్యూరీ, డా.అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా తదితరులు పాల్గొన్నారు.
