బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం
కేసముద్రం/ నేటిదాత్రి
కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.