పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్తో జాగ్రత్త:
◆:- ఎస్ఐ రాజేందర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి;
మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్ధాన్ని మీకు వినిపించే అవకాశం ఉందన్న మానసిక ఆందోళనకు గురై భయపడవద్దని అత్యాశ, భయం..ఈ రెండే సైబర్ మారుతున్నాయని వ్యాఖ్య మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చారక్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచించారు.మీ పిల్లల పేర్లను చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని మీకు వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని సూచించారు. బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచన చేశారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబరు పంచుకున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయలిa
