తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు…

తేజస్విని జూనియర్ కాలేజీలో షీ టీం అవగాహన సదస్సు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే,
ఐపీఎస్ ఆదేశాల మేరకు, భూపాలపల్లి షీ టీం భరోసా సిబ్బంది సంయుక్తంగా తేజస్విని జూనియర్ కాలేజీలో విద్యార్థినుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ
మహిళలు, విద్యార్థులు ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే మౌనంగా ఉండకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల నమ్మకాన్ని ప్రదర్శించవద్దని సూచించారు.
అదేవిధంగా మానవ అక్రమ రవాణా, మహిళా భద్రత, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, సైబర్ సెక్యూరిటీ సేవలపై అవగాహన కల్పించారు.
ఎటువంటి ఆపద ఎదురైనా 1930 టోల్ ఫ్రీ నంబర్ లేదా షీ టీం వాట్సాప్ నంబర్ 8712658162 ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.
విద్యార్థులు చదువుతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం అవసరం అని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర, కానిస్టేబుల్ ఇర్ఫాన్, శ్రీనివాస్, మరియు భరోసా టీం భూపాలపల్లి సభ్యులు పాల్గొన్నారు.

చలో ఇందిరా పార్క్ బీసీ ధర్నాను విజయవంతం చేయండి…

చలో ఇందిరా పార్క్ బీసీ ధర్నాను విజయవంతం చేయండి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో
ధర్మసమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 24 న ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాదులో జరగబోయే మహా ధర్నాకు సారాధ్యం వహిస్తున్న ఉమ్మడి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ నేతృత్వంలో చేయబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పిలుపునివ్వడం జరిగింది. దేశ జనాభాలో 133 కులాలు 60 శాతం ఉన్న బీసీలు కేవలం 29 శాతం రిజర్వేషన్ ని మాత్రమే అనుభవిస్తున్నారు తద్వారా వీరు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అగ్రకుల పార్టీల చేతిలో 70 సంవత్సరాలు దగా పడ్డది చాలు వీరికి న్యాయబద్ధంగా రావాల్సిన 42% రిజర్వేషన్ ని రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు సంపూర్ణ విముక్తి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఘనపూర్ మండల కేంద్రంలోని బీసీలు, బహుజన సంఘాల వారందరూ మహాధర్నా కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సైదులు పాష, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్, రజక సంఘం నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్, కోగిల జితేందర్, కుర్రి స్వామినాథన్, ఇంజపల్లి విక్రమ్, ఎస్.కె ఇమామ్, ఇంజపెల్లి రవి  పాల్గొన్నారు..

పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్తో జాగ్రత్త

పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్తో జాగ్రత్త:

◆:- ఎస్ఐ రాజేందర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్ధాన్ని మీకు వినిపించే అవకాశం ఉందన్న మానసిక ఆందోళనకు గురై భయపడవద్దని అత్యాశ, భయం..ఈ రెండే సైబర్ మారుతున్నాయని వ్యాఖ్య మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండల చారక్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచించారు.మీ పిల్లల పేర్లను చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని మీకు వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరమని ఆయన అన్నారు. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని సూచించారు. బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రాజేందర్ రెడ్డి సూచన చేశారు. ఈ మేరకు హెల్ప్ లైన్ నెంబరు పంచుకున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయలిa

సైబర్ నేరాల గురించి అవగాహన…

సైబర్ నేరాల గురించి అవగాహన
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగులపల్లి మండలంలోని వేములపల్లి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి మండల రైతులకు మొగుళ్ళపల్లి ఎస్ ఐ బి అశోక్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ గురించి మరియు ఏ విధంగా సైబర్ నేరస్తులు ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకొని అమాయకులకు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా ఇలా సైబర్ నేరస్తులు కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అంటే నమ్మకండి వెంటనే 1930 నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి మరియు ముఖ్యంగా మీ యొక్క బ్యాంకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వివరాలు మరియు బ్యాంకు సంబంధించిన ఓటీపీలు ముఖ్యంగా రైతుబంధు రైతు బీమా రైతు భరోసా వంటి పథకాలకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకండి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటూ వచ్చే అపరిచిత కాల్స్ ను నమ్మి మోసపోవద్దని అప్రమత్తంగా ఉండాలని సూచన ఇచ్చారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version