బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోకండి…

స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోకండి

కేయూ క్యాంపస్

 

స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించే 42 శాతం రిజర్వేషన్ల ప్రయత్నాలను అడ్డుకోవద్దని కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గడ్డం కృష్ణయ్య విజ్ఞప్తి చేసినారు.యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను అడ్డుకోటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి రిజర్వేషన్లను సాధించటానికి బీసీలు కూడా ఆ అడ్డుకునే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 2013 లో, 2019లో, 2025 లో కూడా ఒకే వర్గానికి చెందిన వారు చట్టాలలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అభిప్రాయపడినారు. వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి రిజర్వేషన్ల సాధనకు సహాయ పడాలని విజ్ఞప్తి చేసినారు.ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సాధనకి బిల్లు పెట్టినా సవరణ బిల్లు పెట్టినా జీవో జారీచేసినా రిజర్వేషన్లు సాధించలేకపోయింది కాబట్టి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు సాధించే ప్రయత్నాలు చేయాలని అభిప్రాయపడినారు.ఉపాధ్యక్షులు డాక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధనకి కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ పక్షాన భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడతామని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బిసి టీచర్స్ అసోసియేషన్ కి చెందిన డాక్టర్ తిరునహరి శేషు, డాక్టర్ సుధీర్, డాక్టర్ వీరస్వామి డాక్టర్ సతీష్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ రాజు, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ సునీత, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సునీత ,డాక్టర్ జోత్స్న, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ గిరి, డాక్టర్ కిరణ్, డాక్టర్ కవిత, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ కుమార్ ,డాక్టర్ రమేష్, డాక్టర్ సదానందం, డాక్టర్ జె పి, డాక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version