ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి…

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్. ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరకాస్తు లు స్వీకరించారు
ప్రజల ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను కోరారు

రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి….

రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామానికి వెళ్లే రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని కోరుతూ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్, సోమవారం అదనపు కలెక్టర్ మాధురికి వినతి పత్రం సమర్పించారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి…

“రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి”

అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం తాహాసిల్దార్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతు రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు జిల్లాలోనే అధికంగా బాలానగర్ లో ఎక్కువగా పెండింగ్ లో ఉండటంతో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించరాదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ లిఖిత రెడ్డి రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ రెవెన్యూ గా కీమ్య నాయక్ పదవి బాధ్యతలు…

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ గా కీమ్య నాయక్ పదవి బాధ్యత లు
వనపర్తి నేటిదాత్రి.

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ గా రెవెన్యూ బాధ్యతలు చేపట్టిన ఎన్. కీమ్య నాయక్ చేపట్టారు
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఉన్న జి. వెంకటేశ్వర్లు ఫ్యూచర్ సిటీ కి బదిలీ అయ్యారు బదిలీ పై వనపర్తి కి వచ్చిన అదనపు కలెక్టర్ గా ఎన్.కీమ్య నాయక్ సోమవారం వనపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిని పర్తి గ్రామాన్ని బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ వీలైనంత తొందరగా ఇండ్లను పూర్తి చేయాలని అలాగే ఈ గ్రామానికి 64 వచ్చాయని వారిలో 12 మాత్రమే ప్రోగ్రెస్ లో ఉన్నాయని మిగతా వాటిని వీలైనంత తొందరగా ప్రారంభించి పూర్తి చేయాలని లబ్ధిదారులను అధికారులను కోరినారు ఆమె వెంట ఎంపీడీవో జయశ్రీ ,ఎంపీ ఓ రామకృష్ణ తదితరులు ాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version