నిజాంపేట లో ఆటో ర్యాలీ..

నిజాంపేట లో ఆటో ర్యాలీ..
డ్రైవర్లకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజాంపేటలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వివిధ ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. పోలీస్ విధుల గురించి డ్రైవర్లకు వివరించారు.

లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయించవద్దు…

లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయించవద్దు

భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

భూపాలపల్లి నేటిధాత్రి

 

టపాసులు విక్రయించాలనుకునేవారు తెలంగాణ ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ 1884, రూల్స్ 2008 ప్రకారం సరైన లైసెన్స్ పొందడం తప్పనిసరని, లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శనివారం జిల్లా కేంద్రంలోని టపాసుల విక్రయదారుల షాపులను పర్యవేక్షించి ప్రజలకు, విక్రయదారులకు ముఖ్య సూచనలు చేశారు
సందర్భంగా వారు మాట్లాడుతూ టపాసుల షాపులు జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ బిజీ ఏరియా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్‌ల పక్కలో, పెట్రోల్ బంకుల సమీపంలో ఏర్పాటుచేయకూడదన్నారు. సురక్షిత, అనుమతించబడిన ప్రాంతాల్లోనే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసిల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరని, భద్రతా నియమాలు పాటించి, ఈ దీపావళిని ఆనందంగా, ప్రమాద రహితంగా జరుపుకుందామన్నారు. డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు…

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా

ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్.

రేషన్ డీలర్లు సన్న బియ్యం లో దొడ్డు బియ్యం కలిపితే లైసన్స్ రద్దు కలెక్టర్

తహసిల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయాలి

వనపర్తి నేటిదాత్రి :వనపర్తి

 

 

జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ పై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు ప్రజలు ఫిర్యాదులు వస్తే రేషన్ డీలర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేయడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. తాసిల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
అదేవిధంగా మరికొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని, దాన్ని కొనుగోలు కేంద్రాలను కూడా తహసిల్దారులు సందర్శించి పర్యవేక్షణ ఉంచాలన్నారు.
అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఎంక్వయిరీ ప్రక్రియ కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈసమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version