బిఎల్ఎ ఓటర్ లిస్ట్ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు..

బిఎల్ఎ ఓటర్ లిస్ట్ జాబితాను ఎన్నికల అధికారులకు సమర్పించిన కాంగ్రెస్ నాయకులు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి దాత్రి:

 

జహీరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం జహీరాబాద్ నియోజకవర్గంలోని సంబంధిత పోలింగ్ స్టేషన్లు మరియు ప్రాంతాలకు సంబంధించిన బూత్ లెవల్ ఏజెంట్ల ( బిఎల్ఎ ) జాబితాను వారి పరిశీలనార్థం మరియు అవసరమైన రికార్డు నిమిత్తం ( ఆర్డిఓ ) రెవిన్యూ డీవిజన్ ఎన్నికల అధికారికి వారి కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో బడుగుబాలహీన వర్గాల ప్రజల ఓట్లు తొలగించాలని కేంద్ర సర్కార్ బీజేపీ ప్రభుత్వం తెర లేపింది.( ఎస్ఐఆర్ ) ఓటర్ జాబిత ప్రక్రియను కట్టుదిట్టంగా మరియు పారదర్శకంగా నిర్వహించి,అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ జాబితాలో నమోదు కావాలని, నకిలీ మరియు అనర్హత ఓట్లను తొలగించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ జాబితా కీలకమని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,మాజీ వైస్ చైర్మన్ ఖాజా,టీపీసీసీ కో- ఆర్డినటర్ గౌస్, కౌన్స్లర్ మహేష్, సర్పంచ్ రాజు,ఏ.యం.సి డైరెక్టర్ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు హుగ్గేల్లి రాములు,నాయిమ్ మొయిజ్,గౌస్,ఆయుబ్,అడ్వొకేటే వాజహత్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కార్యకర్తలు పాల్గొన్నారు.

హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా…

హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా…?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ మాటల్లో మాత్రమేనా…?

బీసీ హక్కుల కోసం గొంతెత్తినందుకే నాపై రాజ్యాంగ విరుద్ధ సస్పెన్షన్ — పెరుమాండ్ల చరణ్ గౌడ్

కేసముద్రం/ నేటి దాత్రి

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంలో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ కోసం 2011 నుండి నిరంతరం పోరాడుతున్న ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంతియుతంగా డిమాండ్ చేసినందుకు నాపై భారత యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి నుండి ఎటువంటి కారణాలు చూపకుండా, వివరణ కోరకుండా, అంతర్గత విచారణ నిర్వహించకుండా సస్పెన్షన్ విధించడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగ విరుద్ధం అని పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని, బీసీ యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గౌరవం ఇస్తామని ప్రకటించారని. కానీ నేడు వాస్తవ పరిస్థితుల్లో మాత్రం బీసీ వర్గాలకు న్యాయం జరగడం లేదని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీ యువతకు అవకాశాలు దక్కడం లేదని. పార్టీ కోసం కష్టపడిన అనుబంధ సంఘాల కార్యకర్తలను పక్కన పెట్టి, చివరి నిమిషంలో వచ్చిన వారికి పదవులు ఇవ్వడం బాధాకరం అని అన్నారు.
నేను 2011 నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కోసం ఎన్నో పోరాటాలు చేశానని. ఎన్ఎస్‌యూఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారని. బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలపై హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా అని. పార్టీ కోసం లాఠీ దెబ్బలు, కేసులు ఎదుర్కొన్నానని , కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోలేదు అని గుర్తుచేశారు.మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియామకంపై నేను చేసిన నిరసన పూర్తిగా శాంతియుతం, ప్రజాస్వామ్యబద్ధమైనది. బీసీ సమాజానికి న్యాయం చేయాలని, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ ఎన్ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేశారు. కానీ దానికి ప్రతిఫలంగా నాపై సస్పెన్షన్ విధించడం బీసీ సమాజాన్ని అణచివేయడమే అని మండిపడ్డారు. ఈ ఘటన ఒక వ్యక్తిపై జరిగిన అన్యాయం మాత్రమే కాదని. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ అని చెప్పే నాయకత్వం వాస్తవానికి బీసీ యువత గొంతును ఎంతవరకు అణచివేస్తుందో చూపించే ఉదాహరణ. బీసీ హక్కుల కోసం ప్రశ్నిస్తే పదవులు తీసేస్తారా? పార్టీ కోసం 15 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకు ఇదేనా గౌరవం అనే ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలలో, ముఖ్యంగా బీసీ యువతలో తీవ్రంగా వినిపిస్తున్నాయని అన్నారు. అందువల్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే ఈ విషయంపై జోక్యం చేసుకుని, బీసీ సమాజానికి న్యాయం చేయడంతో పాటు తన పై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు.బీసీలకు న్యాయం జరిగే వరకు, కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడే కార్యకర్తలకు గౌరవం దక్కే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని ఎన్ ఎస్ యు ఐ మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల చరణ్ గౌడ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష పదవికి చంద్రమౌళి కి ఇవ్వాలి

కాంగ్రెస్ పట్టణ అధ్యక్ష పదవికి చంద్రమౌళి కి ఇవ్వాలి

మేకల దేవరాజ్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి నియామకంపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో, బొమ్మకంటి చంద్రమౌళి పేరును ప్రతిపాదిస్తూ మేకల దేవరాజ్ వినతి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమౌళి గత 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఎన్‌ఎస్‌యూఐ,యూత్ కాంగ్రెస్,ఇందిరా కాంగ్రెస్ వంటి విభాగాల్లో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి సేవలందించినట్లు తెలిపారు.అనేక ప్రజా సమస్యలపై ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీ తరఫున చురుకుగా స్పందించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందినట్లు పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో బూత్ స్థాయిలో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు తెలిపారు.పార్టీ మారేందుకు వచ్చినఅవకాశాలు,ప్రలోభాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగుతున్నారని,సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషించినట్లు ఆయన వివరించారు.ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ,సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారని,పార్టీ కోసం పనిచేసిన చంద్రమౌళికి పట్టణ అధ్యక్ష పదవి కేటాయిస్తే తగిన గుర్తింపు లభిస్తుందని, అధిష్టానం ఈ విషయాన్ని పరిశీలించాలని మేకల దేవరాజ్ కోరారు.

ఘనంగా దొంతి అవి యుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలు…

ఘనంగా దొంతి అవి యుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలు

దుగ్గొండి,నేటిధాత్రి:

 

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి తనయుడు భవిష్యత్ యువ నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి వారసుడు దొంతి అవి యుక్త్ రెడ్డి తన తండ్రి సిద్ధాంతాలను ఆచరిస్తూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారన్నారు. భవిష్యత్‌లో మంచి యువ నాయకుడిగా ఎదుగుతారని తెలిపారు.దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ మాట్లాడుతూ దొంతి అవియుక్త్ రెడ్డి ప్రజల మనిషిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హింగే రామారావు, అజ్మీరా దంజ్య నాయక్, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, క్లస్టర్ ఇంచార్జిలు ఇంగోలు రాజేశ్వర్ రావు, చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగ రావు, రొట్టె రమేష్, అంబరగొండ రాజేశ్వర్ రావు, సర్పంచులు భూర రాధిక హేమచందర్, కూరతోట స్వప్న సురేష్, కొల్గురి సుజాత సుమంత్, పార్టీ సీనియర్ నాయకులు పుచ్చకాయల బుచ్చిరెడ్డి, ముత్యాల కుమార స్వామి, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెండి సక్కుబాయి, దుగ్గొండి మండల మహిళా అధ్యక్షురాలు బుర్రి సునీత, నాయకురాలు మమతతో పాటు వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ముట్టడి

జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

జాతీయ.యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పి నిలుపు.నివ్వగా ముట్టడి. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి అలాగేరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి.చుక్క రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా. మాట్లాడుతూ బిజెపి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం విలువలను దెబ్బతీస్తూ యువత రైతుల సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తుందని తీవ్రంగా విమర్శిస్తూ ప్రజా హక్కులను కాపాడడం యువతకు న్యాయం చేయడం కోసం ఏదైనా కాంగ్రెస్ ఎప్పటికప్పుడు పోరాటాలు కొనసాగిస్తుంది తెలుపుతూ జాతీయ యుజనకాంగ్రెస్ పార్టీ. నిర్వహిస్తున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వచ్చిన యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఉద్యమంలో రాష్ట్ర యువజన నాయకులు. ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని యువత సమస్యలను జాతీయస్థాయిలో వినిపించే ప్రయత్నం చేశారు అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు మరింత ఉదృతం.చేస్తామని తెలియజేస్తూ. ఈ సందర్భంగా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ముట్టడి కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ. యువజన.నాయకులు తదితరులు ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు…

నూతన మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లును సన్మానించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు

◆-: డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ఫిబ్రవరి23:పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారి నివాసంలో సోమవారం నూతనంగా ఎన్నికైన జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లుకు శాలువాతో సన్మానించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.వారు మాట్లాడుతూ జహీరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యునూస్,వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,కౌన్సిలర్లు శ్రీధర్ రెడ్డి,జాఫర్,అరుణ్ కుమార్, జమిలుద్దిన్,జావిద్,జహంగీర్,అక్రం,నిజాం,అక్కాన్,ఖదీర్ మరియు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,నర్సింహా యాదవ్,బర్కత్,ముస్తఫా మరియు తదితరులు పాల్గొన్నారు.

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

7వ డివిజన్‌లో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు..

#ఎమ్మెల్యే నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం..

హన్మకొండ, నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. బీజేపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎల్పుల మల్లికార్జున్ (మల్లి), గోపగోని సాయి గౌడ్, వై శ్రీనివాస్, పుల్యాల వంశీ, కుందూరు ప్రశాంత్, ఉదయ్ గౌడ్, సర్వర్, తరుణ్, రాకేష్, భాను తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్..

విద్యార్థిని ,విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేసిన అనుపురం పరశురామ్ గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులు అందరికీ దాదాపు ఎనభై ఆరు మందికి పైగా విద్యార్థులందరికీ వచ్చే నెలలో జరగబోయే పదవ తరగతి పరీక్షల దృష్ట్యా యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం డైరెక్టర్, పదవ వార్డు సభ్యులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రామడుగు మండల కోఆర్డినేటర్ బాసరవేని అజయ్, రామడుగు పద్నాలుగవ వార్డు సభ్యులు సిరికొండ సాయితేజ, రామడుగు యువకులు ఎడవెల్లి శ్రీనివాస్, వెంకటేష్, రాంప్రసాద్, భరత్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అనుపురం పరశురాం గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు. రాబోవు పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకొని పరీక్షలు మంచిగా వ్రాసి మంచి ర్యాంక్ లు సాధించి మీతల్లితండ్రులకు, పాఠశాలకి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని, విద్యార్థులు మంచి భవిష్యత్తును సాధించాలని కోరారు. మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ఏటువంటి ఇబ్బందులు ఉన్న అన్నివిధాల నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారు.

అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు…

అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు

ఓడించి ఇంటికి పరిమితం చేసినా బుద్ధి రాలే కార్యకర్తలను గాలికొదిలేసిన చరిత్ర అరూరిది

అన్న అంటే అందుబాటులో ఉంటున్నది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

లక్ష మేజారిటి అని గొప్పలు చెప్పుకున్న అరూరిని సోంత పార్టీ కార్యకర్తలే ఓడించింది నిజం కాదా..?

గ్రామాల్లో ఒక్క ఇళ్లు కూడా పెదలకు కట్టని అరూకి ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు

నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం

వర్ధన్నపేట ( నేటిధాత్రి):

లక్ష మెజారిటి గొప్పలకు పోయి కన్ను మీన్ను కానకుండా ప్రజలను, పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను పక్కనబెట్టి అక్రమ సంపాదనకు పాకులాడి అభివృద్ధి మరిచి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడనే అరూరి రమేష్ ను చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసినా ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం మారలేదని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు బీజేపి సంకలో ఉన్న అరూరికి అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కు తోచక బిఆర్ఎస్ పార్టీలో చేరిన అరూరి రమేష్ వాస్తవాలు మాట్లాడకుండా ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని యాకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తను, ఉద్యమకారులను కనీసం పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టుల మీద శ్రద్ద పెట్టి వందల కోట్ల రూపాయలు దండుకున్న అరూరి నేడు మున్సిపల్ ఓట్లు రాగానే కార్యకర్తలు రావడం ఆయన స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ పనికిరాని మాటలు మాట్లాడారనే సొంత పార్టీ కార్యకర్తలే సాదారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ తనకంటూ ఏ స్వార్ధం లేకుండా కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కున చేర్చుకుంటే అన్ని కష్టనష్టాల్లో వెన్నంటి ఉండి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న పరిస్థితులను చూసి తట్టుకోలేకే తప్పుడు కూతలు కుస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే అరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడమే గాక బీఆర్ఎన్ పార్టీ కనుమరుగు గాక తప్పదని యాకాంతం అన్నారు. నియోజకవర్గంలో గత పదేళ్ల పాలనలో ఏ గ్రామంలో ఒక్క ఇళ్లు కూడా కట్టని అరూరి రమేష్ దమ్ముంటే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణమౌతున్నాయో లెక్క పెట్టి బుద్ధి తెచ్చుకోవాలని యాకాంతం నూచించారు.
ఇప్పటికైనా అరూరి రమేష్ వాస్తవ విషయాలను మాట్లాడి మార్పు తేచ్చుకోకుంటే ఆయన వర్ధన్నపేట మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవకుండా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఎన్ని కుట్రలు చేసినా వర్ధన్నపేట మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని యాకాంతం ధీమా వ్యక్తం చేశారు.

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం…

దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం

మంగపేట నేటిధాత్రి

 

 

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య ఆదేశాలమేరకు
దశ దిన కర్మలకు ఆర్థిక సహాయం అందించిన
మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ
ములుగు జిల్లా మంగపేట మండలం పెరకలకుంట గ్రామం లో నిరుపేద కుటుంబంకు చెందిన మడకం నరెందర్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ పరామర్శించి మనోధైర్యం కల్పించి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు.ఇలాంటి సంధర్బంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు కుటుంబ సభ్యులను ఓదార్చి దశదిన కర్మలకు 50 కేజీ ల బియ్యం అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

పార్టీ గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి

పార్టీ గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ సయ్యద్ ఖలీద్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గం అధ్యక్షులు నగునూరి రజినీకాంత్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటేష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి మహిపాల్ రెడ్డి హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోసిక సాయి చరణ్ ప్రధాన కార్యదర్శులు చుంచుల మహేశ్ తోట రంజిత్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ బడితల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పొలసాని కోటేశ్వర్ రావు మండల అధ్యక్షులు కొలుగూరు అనిల్ అల్లకొండ కుమార్ కోయిల క్రాంతి సాధు నాగరాజు వెంకటేశ్, జిల్లా నాయకులు ఉప్పగల్ల కిషోర్ అప్పల శ్రీనివాస్ పృథ్వీ బొమ్మ కిరణ్ కీర్తి రాజు పున్నం ప్రవీణ్ కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

10వ తరగతి విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ నాయకుడు స్నాక్స్ పంపిణీ

ఉత్తమ ఫలితాలు సాధించాలి : దాత యూత్ కాంగ్రెస్ నాయకులు నక్క సందీప్ గౌడ్

* 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని స్నాక్స్ దాత, యూత్ కాంగ్రెస్ నాయకులు నక్క సందీప్ గౌడ్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట్, దేవరయాంజాల్, బొమ్మరాసిపేట్ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాలేష్, వేణు లతో కలిసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి, ఒత్తిడిని తగ్గించుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆర్టీఏ సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి, పాఠశాల ఛైర్మన్ కట్ట మీనా కుమారి, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఛైర్మన్ పేండం లక్ష్మినారాయణ, ధర్మకర్త ఎల్లెంకి భారతి, కట్ట మైసమ్మ దేవాలయం ఛైర్మన్ మేకల మహేందర్ యాదవ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాష్కీ శంకర్ గౌడ్, విలాసాగర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేకల అంజనేయులు, పంబలి అశోక్, తాళ్ల శ్రీనివాస్ రెడ్డి, సోగడ బాల్ రాజు, ఇదిగాళ్ల యేసు దాసు, తలారి భరత్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేశ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి….

ప్రజలకోసం పని చేసిన మాకు మున్సిపాలిటీ ఎన్నికలలో టిక్కెట్ ఇవ్వాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: యూత్ కాంగ్రెస్ జహీరాబాద్ మండల ఉపాధ్యక్షుడు ఎం.డి. సామియుద్దీన్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నం.33 శాంతినగర్, జహీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుటకు పార్టీ టికెట్ మంజూరు చేయాలని కోరుతూ టౌన్ పార్టీ అధ్యక్షుడికి దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా యూత్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి

◆:-హుగ్గేల్లీ గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ హుగ్గేల్లీ గ్రామ మైదానంలో (హెచ్ పి ఎల్) క్రికెట్ పోటీలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ.నర్సింహారెడ్డి గార్లు పాల్గొని క్రికెట్ టోర్నీని ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హుగ్గేల్లీ గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామ యువకులు ఈ (హెచ్ పి ఎల్)క్రికెట్ టోర్నీను నిర్వహించడం పట్ల హర్షవ్యక్తం చేశారు.ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మరి.రాజు,గ్రామ వార్డు సభ్యులు బాల్ రాజు,నిఖిల్ మరియు కాంగ్రెస్ నాయకులు నర్సింహులు,సిద్దారెడ్డి,గోపాల్,ముస్తఫా,సురేష్,పోతురాజు రాములు మరియు హెచ్ పి ఎల్ క్రికెట్ టోర్నీ నిర్వహకులు,గ్రామ ప్రజలు,క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్…

నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పెద్ద బోయిన రవీందర్ యాదవ్

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు నడికూడలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నార్లాపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మి, కార్యదర్శిగా కంఠాత్మకూర్ సర్పంచ్ కొంగంటి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా రాయపర్తి సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్, కోశాధికారి గా ధర్మారం సర్పంచ్ భాషిక ఎల్లస్వామి లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండలంలోని సర్పంచులు కుడ్ల మలహల్ రావు,చర్లపల్లి గ్రామ సర్పంచ్ బండి రేణుక,చౌటుపర్తి గ్రామ సర్పంచ్ ఓదెల రూప,ధర్మారం గ్రామ సర్పంచ్ బాషిక ఎల్లస్వామి,కౌకొండ గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత, ముస్త్సాల పెల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్, నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ కోడెపాక ముత్యాలు,పులిగిల్ల గ్రామ సర్పంచ్ ఇనుగాల పద్మ,సర్వాపూర్ గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,కంఠాత్మకూర్ గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి,రాయపర్తి గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నడికూడ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్పం కుమార్ స్వామితో పాటు వివిధ గ్రామాల,మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందిస్తూ,మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్…

నిబంధనల ప్రకారమే నిర్మాణం కూల్చివేత: తహసీల్దార్

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

కోహీర్,మండలం లోని సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి నిర్మాణం గోడలను గ్రామపంచాయతీ తీర్మానం చేసి కూల్చివేయడంపై వివాదం నెలకొంది. సజ్జాపూర్ గ్రామంలోని 21వ సర్వే నంబర్ లో పల్లె ప్రకృతి వనా నికి సమీపంలో ఇంటి నిర్మాణం చేయడంపై డిసెంబర్ 16న ఇంటి నిర్మాణం పనులు చేయరాదని పంచా యతీ కార్యదర్శి వికాస్ రాములుకు నోటీసులు జారీ చేశారు. రాములు ఆ నోటీసులను లెక్కచేయకుండా బేస్మెంట్ వరకు గోడలను నిర్మించాడు. దీంతో ఈ నెల 22న గ్రామ పంచాయతీ కార్యదర్శి, నూతనంగా ఎన్ను కోబడిన సర్పంచు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఎక్స్కవే టర్ సాయంతో ఆ గోడలను కూల్చివేశారు. ఈ క్రమంలో రాములు మాట్లాడుతూ కావాలనే సర్పంచు తనయుడు తన ఇంటి నిర్మాణం గోడలను కూల్చివేశా రని ఆరోపించాడు. మంగళవారం సాయంత్రం కోహీర్ తహసీల్దార్ సుప్రియ, జహీరాబాద్ సీఐ శివలింగం సజ్జాపూర్ గ్రామాన్ని సందర్శించి గోడలను కూల్చివే

కూల్చివేత స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్, సీఐ

సిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహ సిల్దార్ సుప్రియ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలోనే ఇంటి నిర్మాణం పనులు చేశారని, అంతేకాకుండా పల్లె ప్రకృతి వనానికి అడ్డుగా నిర్మాణం చేయడం నిబంధన లకు విరుద్ధంగా ఉండడంతోనే నిబంధనల ప్రకారమే పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ పాలకవర్గం వారు గోడలను తీసివేశారని ఆమె పేర్కొన్నారు. తనకు న్యాయం చేకూర్చాలని రాములు పలువురు గ్రామస్తు లతో కలిసి మంగళవారం మాజీ మంత్రి హరీశ్ వును కలిశారు. కాగా ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేయాలని హరీశ్రావు ఎస్పీని కోరారు.

యువతకు వాలీ బాల్ క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య..

యువతకు వాలీ బాల్ క్రికెట్ కిట్ అందించిన కుంజ సూర్య

యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినారాయణ ఆధ్వర్యంలో అందజేత

మంగపేట నేటిధాత్రి

 

యువకులు చదువు తో పాటు క్రీడాలలో రాణించాలని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ కుంజ సూర్య అన్నారు.బుధవారం మంగపేట మండలం
బ్రాహ్మణపల్లి గ్రామం లో యూత్ కి మండల యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ ఆదినా రాయణ ఆధ్వ ర్యంలో గ్రామాల్లోని యువకులు ప్రోత్సా హిస్తు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశ్యం తో యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ కుంజ సూర్య
ఇచ్చి వాలీబాల్ క్రికెట్ కిట్ బ్రాహ్మ ణపల్లి మాజీ సర్పంచ్ సున్నం ఆనందం తన చేతుల మీదుగా యువకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బాడిశ నరేష్,కోరం నర్సింగరావు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి

యువజన కాంగ్రెస్ గుండాల మండల ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్

గుండాల,నేటిధాత్రి:

 

మండల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని యువజన కాంగ్రెస్ గుండాల మండలం ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మండలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలుపరిచిన అభ్యర్ధులను గెలిపిస్తేనే గుండాల మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యం అవుతుంది గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. గుండాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T190528.291.wav?_=1

 

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలి

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈనెల 5న నర్సంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యా,వైద్యం, రోడ్లు,త్రాగునీరు,సాగునీరు పలు ప్రభుత్వ రంగసంస్థల భవనాల నిర్మాణాలను చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎంతో ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికీ 1000 కోట్ల నిధులను తీసుకచ్చారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి సభను విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషిచేసి రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచ్ స్థానాలను మన నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గౌరవ ప్రతిష్టలు చాటే బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడిపై ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గౌడ్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, చెన్నారావుపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద నరేష్, ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొల్లం హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గద్ద అఖిల్, మహమ్మద్ సల్మాన్, దేశి సాయి పటేల్, మచ్చకంటి మనోజ్ కుమార్, మంచాల హరీష్, గద్ద నిఖిల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఎంపీడీవోకి యూత్ కాంగ్రెస్ సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T163823.886.wav?_=2

 

మల్లాపూర్ నేటి ధాత్రి

 

కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శ్రీకాంత్ ని యూత్ కాంగ్రెస్ నాయకులు బుధవారం సన్మానించారు. మండల అభివృద్ధి కార్యక్రమాలు, యువతకు అవకాశాలపై చర్చ జరిగింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తమ పూర్తి సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. ఎంపీడీవో కూడా యువతతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version