తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నీ జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరపడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు.మూలాధారమని అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని తెలియజేస్తూ. 1948. డిసెంబర్ .10న. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటనలను ఆమోదించిందని.అందుకే ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజల హక్కులను రక్షిస్తుందని. తెలుపుతూ. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికారిక సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి నీరజ గారి ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి. కార్యదర్శి. DLSA.. శ్రీ పి లక్ష్మణ చారి సమన్యాయంతో.బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని జ్యోతి కాలేజ్ ఎడ్యుకేషన్లో.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడంతోపాటుజిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజలకు రక్షిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి సమావేశ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ.జే .శ్రీనివాసరావు. లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు.ఆడేపువేణు గుర్రం ఆంజనేయులు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పి పద్మ. విద్యార్థి నీ.విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి..

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అడిషనల్ సివిల్, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ అఖిల, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పి సంకీర్త్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసినారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందని తెలిపారు. సదరం సర్టిఫికెట్లు జారీతో పాటు ‘భవిత’ కేంద్రాల ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి.కృషి చేస్తున్నామని అన్నారు.
ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసిస్తూ, శాఖల ద్వారా అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. మీ అభివృద్ధి అంటే సమాజ అభివృద్ధి అని, జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

తదుపరి న్యాయ సహకార సంస్థ ఛైర్మన్ అఖిల మాట్లాడుతూ వైకల్యం ఉన్న అనేక మంది దివ్యాంగులు చిత్రకళ, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తున్నారు. దివ్యాంగుల హక్కులకు సంబంధించి కోర్టుకు వచ్చే దివ్యాంగులకు న్యాయవాదిని ఏర్పాటు చేసి పూర్తి న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. నేను చేయలేను అనే భావనను వదిలి, పాజిటివ్ ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు.

జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ దివ్యాంగులు డిజేబుల్ కాదని డిపెండబుల్ అన్నారు. దివ్యాంగులకు ప్రతిబంధకాలు విజయానికి అడ్డంకులు కావని, టాలెంట్ విషయంలో దివ్యాంగులు ఇతరులకంటే ఏమాత్రం తీసిపోరని తెలిపారు. లోపాలను గుర్తుచేసుకుంటూ ఆగకుండ, అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగాలన్నారు. దివ్యాంగులలో అసాధ్యాన్ని సాధించే శక్తి ఉందని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహిళా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, డీఆర్డిఓ బాలకృష్ణ, మెప్మా పిడి రాజేశ్వరి, హెచ్ఎమ్ఆర్టీ సంస్థ అధ్యక్షురాలు కే. రజిత, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధ్యక్షులు అయిలి మారుతి, పారా ఒలంపిక్స్ జిల్లా అధ్యక్షులు కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో ఘనంగా జాతీయ న్యాయసేవల దినోత్సవం..

జిల్లా కోర్టులో ఘనంగా జాతీయ న్యాయసేవల దినోత్సవం

ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మనుషులు కలసి మెలసి జీవించడానికే చట్టాలు ఏర్పడ్డాయని, ఎప్పుడైతే ఇద్దరి మధ్య వివాదం తలెత్తుతుందో అప్పుడు వారిని చక్కదిద్దడానికి చట్టం పనిచేయడం ప్రారంభిస్తుందని ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ నాయక్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి అతిధిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ చట్టాలను వినియోగించుకోవడం తో పాటు పౌరుల బాధ్యతలను తెలిసుకొని మెలగాలని సూచించారు. న్యాయ సహాయం అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలని, సామజిక స్పృహ కలిగి వున్నప్పుడే అది సాధ్యం అవుతుందని తెలిపారు. కేసులు, వివాదాలు లేని సమాజ నిర్మాణం కోసమే న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తుందని, లక్ష్యం నెరవేరినప్పుడు గొప్ప సమాజం ఏర్పడుతుందని జడ్జి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రీ వి. శ్రావణ్ రావు, చీఫ్ డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ పి. శ్రీనివాస్, కే.అక్షయ, న్యాయవాదులు మంగళపల్లి రాజ్ కుమార్, కే.అఖిల, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం….

న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం:-

వరంగల్, నేటిధాత్రి, (లీగల్):-

 

శుక్రవారం నాడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) ను పురస్కరించుకొని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ కార్యదర్శి యం.సాయి కుమార్ అధ్యక్షతన “మిషనరీస్ ఆఫ్ ఛారిటి”, కాశిబుగ్గ, వరంగల్ లోని మేథో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ హాజరై, మాట్లాడుతూ “మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు.

దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్తులో వీరికి కావలసిన అన్ని రకాల వైద్య సేవలకు మమ్మల్ని సంప్రదించవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా మేథో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లను అందించి, వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, డిప్యూటి లీగల్ ఏయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతెజార్గంజ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీ.తేజ, ఎన్.వెంకటేశ్వర్లు డా.క్యూరీ, డా.అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం…

సెప్టెంబర్ 13న నేషనల్ లోక్ అదాలత్: పెండింగ్ కేసులు పరిష్కారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కోర్టులలో పెండింగ్ కేసులను పరిష్కరించడానికి, సత్వర న్యాయం అందించడానికి సెప్టెంబర్ 13, 2025న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుండి పోచారం ప్రవీణ్ కుమార్ అందించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version