దళారులకు పత్తి అమ్మి మోసపోవద్దు.
మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణంలో పత్తి సాగు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విక్రయాలు చేసేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆవరణలో పత్తి విక్రయాలపై సూచనలతో కూడిన వాలు పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులు ముందస్తు కపాస్ కిసాన్ స్లాట్ బుకింగ్ చేసుకొని సమీపంలో మిల్లుల వద్ద విక్రయించుకోవాలని పంట నమోదు తో పాటు బ్యాంకుకు తమ ఆధార్ కార్డును లింకు చేసుకోవాలని సూచించారు దళారులకు పత్తి అమ్మి రైతులు మోసపోవద్దని ఆమె తెలిపినారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి షరీఫ్ సూపర్వైజర్ రాజేందర్ రైతు సోదరులు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పడిదెల దేవేందర్ అల్లం సమ్మయ్య పాల్గొన్నారు.
