జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య

 

జమ్మికుంటలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ కార్యక్రమం

జమ్మికుంట (నేటిధాత్రి)

ఈరోజు జమ్మికుంట లో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనే నిదానంతో వికాస తరంగిణి ఆరోగ్య వికాస్ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ ఎం మౌనిక పద్మ సారిక గారి ఆధ్వర్యంలో 108 మందికి గర్భాశయ ముఖ ద్వారం మరియు మహిళల ఛాతి పరీక్షలు 108 మందికి ఉచిత పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు. బచ్చు వీర లింగం. పుల్లూరి ప్రభాకర్. హరికృష్ణమాచార్యులు. కొల్లూరు శ్రీనివాస్.అంతం రాజిరెడ్డి.ఎదులాపురం వెంకటేష్. శీలం శ్రీనివాస్.ఎలివేణి సమ్మయ్య. మహిళా వికాస అధ్యక్షులు కర్ర రజిత దేవి. వికాస తరంగిణి జమ్మికుంట శాఖ సభ్యులు మహిళా సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన..

రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-31.wav?_=1

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎన్ఎమ్ఎన్ఎఫ్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చొప్పదండి డివిజన్ ఏడిఏ ప్రియదర్శిని హాజరై రైతులకు సేంద్రియ సాగు గురించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఆయిల్ ఫాం పంట సాగులో మెలకువలతో పాటు పంట సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ రైతులకు వివరించారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం.

ఆయిల్ పామ్, బహువార్షిక పండ్ల తోటల్లో అంతర పంటలుగా కూరగాయల సాగు ప్రభుత్వ ప్రోత్సాహకా లు
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల అవగాహన కార్యక్ర మం
వరి నుండి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు & మల్బరీ సాగు చేయాలి.

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

గురువారం తొర్రూరు మండలంలోని వెంకటాపురం, మాటేడు, హరిపిరాల, తదితర గ్రామాలలో సాగులో ఉన్న ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయ పంటలను జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న పరిశీలించారు.

ఈ సందర్బంగా రైతులకు సాగుపై పలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులు నికర ఆదాయం ఇచ్చే కూరగాయల పంటలను సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ ద్వారా టమాట, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవవర్, తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న కూరగాయల నారు మొక్కలను ఎకరానికి 8000 మొక్కలను ములుగు, సిద్ధిపేట జిల్లా నుండి రాయితీ పై సరఫరా సౌకర్యం ఉన్నదని తెలిపినారు. అలాగే తీగ జాతి కూరగాయల సాగుని శాశ్వత పందిరిని నూతనంగా నిర్మించి సాగు చేసే రైతులకు అర ఎకరానికి రూ. 50,000/- రాయితీని రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద కల్పించబడునని తెలిపారు. పామాయిల్ తోటలలో మొదటి నాలుగు సంవత్సరాలలో అంతరపంటల కింద కూరగాయలు సాగు చేసే ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 2,100/- అందించబడునని తెలిపారు.

ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు సర్వేశ్వర రావు, యాకయ్య, టి. జి. ఆయిల్ ఫెడ్ జిల్లా అధికారి సి.హెచ్. రాములు, క్షేత్ర సిబ్బంది వెంకట్, అఖిల్, రంజిత్, ప్రకాష్, బిందు సేద్య ప్రతినిధులు జి. ప్రసాద్ బాబు, జి. శరత్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం.

నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల నారాయణ హై స్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించరు.పాఠశాల విద్యార్థులు వివిధ రకాల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు హాజరయ్యారు. చైతన్య రావు మాట్లాడుతూ విద్యార్థులకు చెట్లు నాటడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ కవిత మాదిశెట్టి వనమహోత్సవం యొక్క ఉద్దేశాన్ని వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి పర్యావరణానికి సంబంధించిన వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జోనల్ అనలిస్ట్ రాజేందర్,ఏవో సంజీవ్,వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆక్టివేట్ ఇంచార్జ్ జ్యోతి గోపతి ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒక్కటైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Dr. A. Rajendra Prasad Reddy, Head of Balaji Educational.

బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ పాల్గొని వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం వన మహోత్సవం పై డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ జి. భవాని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం.

తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

నేటిదాత్రి చర్ల

Telangana PRTU Association.

 

పిఆర్ టియు రాష్ట్ర జిల్లా శాఖల పిలుపు మేరకు చర్ల మండలం లోని వివిధ పాఠశాలలు తిరిగి పిఆర్ టియు టిఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగినది దీనిలో చర్ల మండల సభ్యులు అందరూ సభ్యత్వం తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం లో పిఆర్ టియు టిఎస్ చర్ల మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి తుర్రం వీరభద్రం పునేం వేణు శ్రీనివాస్ దారయ్య గురుమూర్తి వీరమోహన్ పోడియం నాగేశ్వరరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు మంచి స్పందన సభ్యులలో కనిపించింది సంఘం ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అని మీకు త్వరలో మంచి పి ఆర్ సి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్స్ పెండింగ్ బకాయిలు జనగణన చేసిన డబ్బులు ఇప్పించాలని సభ్యులు తెలుపగా సమస్యలు వెంటనే తీర్చే విధంగా చర్యలు తీసుకొనేలా రాష్ట్ర శాఖకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి తెలిపి వీలైనంతవరగా సమస్యలను పరిష్కరిస్తామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న.

ఆషాఢమాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆషాఢమాసం బోనాల సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు,నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని వేడుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ శివకుమార్ మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజమ్, సినియర్ నాయకులు నామ రవికిరణ్,మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, విజిలిన్స్ మెంబెర్ రామకృష్ణ,ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,వెంకట్, శివ ముదిరాజ్,నరేష్ రెడ్డి,మహమ్మద్ అలీ, జఫ్ఫార్, సందీప్, తదితరులు.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 11:

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని కాజూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగర మేయర్ కుమారి ఆముద పుంగనూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు చూడా చైర్ పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాజూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పుష్పాలు, గజమాలతో కాజూరు ప్రాంత కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ఘన స్వాగతం పలికారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కాజూరు ప్రజలకు వారు
వివరించారు,
ఇది మంచి ప్రభుత్వం అంటూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించి మళ్లీ మాకు కూటమి ప్రభుత్వమే కావాలంటూ తమ ఆకాంక్షను కాజూరు ప్రాంత ప్రజలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు  తెలియజేసారు.

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలకు వ్యాపారస్థులకు, ఉద్యోగులకు విద్యార్థులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఈనెల 11న ఉ.11.00 గం. ల నుండి 12.00 గం. ల వరకు “డయల్ యువర్ డిపో మేనేజర్” కార్యక్రమము నిర్వహించబడును జరుగుతుంది
కావున ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు విద్యార్థులు సెల్: 9959226707 కు డయల్ చేసి ఆర్టీసీ అభివృద్ధికి అమూల్యమైన సలహాలు, సూచనలు చేయగలరు అని డిపో మేనేజర్ ఇందు తెలిపారు

దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్ సేన.

దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్ సేన

రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఒద్దుల రాంరెడ్డి ఇటివల కాలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి మరణించిగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి రాంరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకి మనోధైర్తం కల్పించిన బిఅర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యఅనుచరులు కెటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహార్ .ఈ కార్యక్రమంలో కెటిఆర్ సేన రాష్ట్ర ప్రదాన కార్యదర్శి శిలం స్వామి, భూపాలపల్లి జిల్లా కెటిఆర్ సేన అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి ,వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ ,మహబుబాబాద్ జిల్లా అధ్యక్షులు తరుణ్ నాయక్ ,నియొజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు జిల్లా ప్రదాన కార్యదర్శి ఆశోక్ ,సొషల్ మిడియా ఇంచార్జ్ దేవేందర్ పటెల్ ,మండల అధ్యక్షులు తిరపతి,రాకేశ్ ,దిలీప్ ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మ రావు పేట గ్రామంలో విద్యుత్ శాఖ పొలంబాట.

ధర్మ రావు పేట గ్రామంలో విద్యుత్ శాఖ పొలంబాట కార్యక్రమం

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురంమండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో 01.07.2025 న “విద్యుత్ శాఖ – పొలంబాట” కార్యక్రమాన్ని, రైతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. “విద్యుత్ శాఖ – పొలం బాట” ముఖ్య ఉద్దేశాన్ని ఎస్ ఈ వివరిస్తూ 1) వంగిన స్తంభాలను సరి చేయడం 2)విరిగిన లేదా ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు మార్చడం 3)కిందకు వేలాడుతూ ప్రమాదకంగా ఉన్న లూజు లైన్ ను సరిచేయడంమొదలగునవిచేస్తామని.విద్యుత్ వినియోగదారులు, రైతు సోదరులకు బట్టలు ఆరెసుకునే దండానికి జి ఐ వైర్ వాడకూడదు, జి ఐ వైర్ వాడడం వలన ఎలక్ట్రిక్ షాక్ కి గురి కావడం జరుగుతోంది.సర్వీస్ వైర్ లోజాయింట్లులేకుండాచూసుకోవాలి.సర్వీస్ వైర్స్ జాయింట్స్ ఉండడం వలన షాక్ కి గురి కావడం జరుగుతుంది.
అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని, రైతులుభద్రతసూత్రాలను,విద్యుత్ పొదుపు పాటించాలని కోరారు.
ముఖ్యంగా, రైతులు తమ మోటార్స్ దగ్గర, తగిన కెపాసిటీ కలిగిన కెపాసిటర్స్ ను వాడాలని కోరుతు, ప్రయోగాత్మకంగా వారికి కెపాసిటరును మోటర్ దగ్గర అమర్చి చూపించి తగ్గిన కరెంటు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు కెపాసిటర్లను అమర్చుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల రైతు సోదరులు హర్షం వ్యక్తం చేసి విద్యుత్ శాఖా పనితీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే రైతులు తమయొక్కసమస్యలను అధికారుల కు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లాసూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మల్చుర్, డిఈ టెక్నికల్ భూపాలపల్లి
వెంకటేశం, స్థానిక ఏ ఈ వెంకట రమణ, సబ్ ఇంజనీర్ రజినీకాంత్ విద్యుత్ శాఖ సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు.

ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం..

*ఇంటింటికి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం..

*2న వి.కోట నుంచి ప్రారంభం..

పలమనేరు(నేటి ధాత్రి) జూన్ 31:

 

 

 

ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టదలచిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సభ్యులతో అయన సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఇప్పటి వరకు ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధి పై గ్రామ స్థాయిలోని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారించ డమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం
(కే ఎస్ ఎస్) కుటుంబ సాధికారిక సభ్యులుగా ఉన్న వారు బాధ్యత తీసుకొని పార్టీ రూపొందించిన ఫార్మట్ ప్రకారం వివరాలను పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం. కాబట్టి పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు తప్పక అందెలా చూడాలన్నారుబూత్ లెవల్ స్థాయిలో కనీసం రోజుకు 50 కుటుంబాలకు తగ్గకుండా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఈ కార్యక్రమం నియోజకవర్గం లోని వి. కోట మండలంలోని కొంగాటం పంచాయతీ నుంచి ఈ నెల 2 న ప్రారంభించి ఏక కాలంలో అన్ని మండలాల్లో విజయవంతంగా సాగేలా చూడాలని కోరారు. అనంతరం కార్యక్రమ కార్యాచరణ పై నాయకులతో ఆయన చర్చించారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు ఆర్వీ బాలాజీ, విజయ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్,కిషోర్ గౌడ, సోమశేఖర్ గౌడ్, ఆనంద,నాగరాజు రెడ్డి, కుట్టి,నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్,రాంబాబు, గిరి, ప్రతాప్, బ్రహ్మయ్య, నాగరాజు, చౌడప్ప, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే.

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే ఐపీఎస్., తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 27 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం

రైతులతో కలిసి కార్యక్రమాన్ని విక్షించిన అధికారులు

పరకాల నేటిధాత్రి:

 

రైతునేస్తం కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ లో గల రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ ను అధికారులు రైతులతో కలిసి వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్,ఈసీ,ఏఇవో శైలజ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

ఆమనగల్ నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె), బూత్ అధ్యక్షులు, కొప్పు నర్సింహ, M. శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు…ఈ సందర్భంగా కండె హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. గత 11 ఏళ్లలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చాయి,అని వివరించారు.
స్వచ్ఛ భారత్, పీఎం కిసాన్, ఉజ్వలా యోజన, జనధన్ యోజన, ముద్రా లొన్లు, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. ఈ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గోరటి నర్సింహ, ఆమనగల్ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె) గార్లు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, వారి స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను సూటిగా వినిపించుకునే ప్రయత్నం చేశారు…

తాగునీరు, రోడ్లు, ఉపాధి అవకాశాలపై వచ్చిన అంశాలపై స్పందించి, వీటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే చర్యలు తీసుకుంటామని తెలిపారు…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

అనంతరం అమ్మ పేరు మీద మొక్కలను నాటడం జరిగింది…

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, Bjym మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, బిసి మోర్చ కల్వకుర్తి ఇంచార్జ్ వరికుప్పల చంద్రమౌళి, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు శాంపూరి భగవాన్ రెడ్డి, బీసీ మోర్చ మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా నాయకులు కొప్పు పుల్లయ్య, మాజీ బూత్ అధ్యక్షుడు గండి కోట జంగయ్య, మాజీ వార్డు సభ్యులు ఆర్ ప్రభు లింగం, నల్ల కొమురయ్య, తిప్పిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మందా రాంరెడ్డి, వరికుప్పల రాఘవేందర్, మండల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎరగమౌని రాములు, సీనియర్ నాయకులు కొప్పు నర్సింహ అలియాస్ బొంబాయి, కార్ మెకానిక్ శేఖర్, వరికుప్పల శ్రీకాంత్, బండ్ల శివ, వరికుప్పల అశోక్ గార్లు గ్రామంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు… ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..

కొలనూరు లో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం..
బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెద్దపెల్లి బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కొలనూరు గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు.దీనితో పాటు గ్రామంలోని దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల ను సందర్శించి అక్కడ ఒక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరు పృథ్వీరాజ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు నాగరాజు ఎలిగేడు మాజీ మండల అధ్యక్షులు నారాయణస్వామి సుల్తానాబాద్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి మహేందర్ కొలనూరు మాజీ సర్పంచ్ కైరునిస తాజ్ పుల్ల సదయ్య అనిల్ రావు దాత రాకేష్ సత్యం రెడ్డి శంకర్ బిక్షపతి కొంగర అనిల్ తదితర మూర్చ నాయకులు బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం.

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయల్ యువర్ జహీరాబాద్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వామి ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, సందేహాల నివృతి కోసం 99592 26268 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ వినియోగదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.

బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

నర్సంపేట నేటిధాత్రి:

 

రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీసీ లందరూ ఏకతాటిపైకి రావాలని కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమం లో బాగంగా నర్సంపేటలో 1500 బీసీ సభ్యత్వాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగ రవి యాదవ్ అన్నారు. నర్సంపేట పట్టణంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్న ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సిలువేరు ద్రోణాచారి ఆధ్వర్యంలో వంగ రవి యాదవ్ అధ్యక్షతన జరిగింది.రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీసీ లందరూ ఏకతాటిపైకి రావాలని కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగమే అని రవి పేర్కొన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఉన్నత వర్గాల మోసమాటలతో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మండల కొమ్మాలు,చీర పద్మ, రమేష్, సిలువేరు మానస, ఓదెల రంజిత్,సాంబలక్ష్మి, మండల ఐలమ్మ, ఓదెల నగేష్,రమ తదితరులు పాల్గొన్నారు.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం.

అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం

జైపూర్ నేటి ధాత్రి:

 

shine junior college

జైపూర్ మండలం ఇందారం 4 అంగన్వాడీ కేంద్రం లో సామూహిక అక్షరాభ్యాసాలు చేపట్టి మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను అంగన్వాడి సెంటర్ కి పంపించాలని పిల్లల తల్లి తండ్రులకు సూచించారు.ప్రీ స్కూల్ ప్రాముఖ్యత గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.అంగన్వాడి కేంద్రం లో ప్రతీ నెల పిల్లల ఎత్తు,బరువు,పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పిల్లలకు పోషకాలు కల్పించే ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ టీచర్స్ వెంకటస్వామి,స్వప్న, వివో అధ్యక్షురాలు రాజేశ్వరి, ఏఎన్ఎం కృష్ణవేణి,అంగన్వాడి టీచర్స్ కళ్యాణి,నళిని,పిల్లలు, తల్లి తండ్రులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version