ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు .

ఝరాసంగం మండల కేంద్రంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల ఎంపిడిఓ కార్యాలయంలో లీగల్ అవేర్నెస్ క్యాంపును సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీమతి కవిత దేవి నిర్వహించి మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించి, తగు సూచనలు చేశారు. న్యాయమూర్తి మరియు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ మహిళ సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిత్యజీవితంలో మహిళలు ఎన్నో కష్టాలకు గురివుతున్నారని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి, ఒకవేళ సమస్యలువస్తే వాటిని.

Camp

అధిగమించడానికి చట్టాలు తొడ్పాడుతాయని సూచించారు. కార్యక్రమంలో నిజజీవితంలో మహిళల పాత్ర, గృహహింస నిరోధకత, మహిళా సాధికారత, పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బాల్య వివాహ నిరోధక చట్టం, ఉచిత న్యాయసేవా సహాయంపై క్షుణ్ణంగా వివరించారు. ఏ సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్న మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయంను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ మానెన్న, ప్యానెల్ న్యాయ వాదులు రుద్రయ్య స్వామి, సామజిక కార్యకర్త కోట ధనరాజ్ గారు, ఎంపిడిఓ సుధాకర్, తహసీల్దార్ తిరుమల రావు, ఎస్సై సాయి తేజ, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు  పాల్గొన్నారు.

తలసేమియా దినోత్సవం .

తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మరిపెడ నేటిధాత్రి.

 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది తో కలిసి అవగాహన ర్యాలీ మరియు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే రక్త వ్యాధినే తలసేమియా అంటారు.హిమోగ్లోబిన్ రక్తంలోని ఆక్సిజన్‌ను శరీరంలోని వివిధ భాగాలకు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆల్ఫా (α) మరియు బీటా (β) అనే రెండు ప్రోటీన్లతో ఏర్పడుతుంది. త‌ల‌సేమియా వ్యాధిగ్రస్తుల్లో ఎముక మజ్జ (బోన్ మ్యారో) శ‌రీరానికి కావాల్సిన హిమోగ్లోబిన్ లేదా ఎర్ర ర‌క్త క‌ణాల‌ను త‌యారుచేయ‌కపోవడంతో శరీరంలోని అన్ని కణాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా అందదు.తలసేమియా ఎక్కువగా రెండు సంవత్సరాల్లోపు గల వారిలో గమనించవచ్చు.మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్త క‌ణాలు లేదా హిమోగ్లోబిన్ ఉండాల్సిన మోతాదులో లేన‌ప్పుడు తలసేమియాతో పాటు ర‌క్త‌హీన‌త సమస్య కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం లో డాక్టర్ స్వామి, సాయిశ్రీ,సిరి,పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ,ఆచార్యలు,సరళ, నర్సబాయి, ఝాన్సీ,శ్రీదేవి, నాగమణి, ఆశ ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు.

నీలగిరి తో నా స్నేహం అవగాహన సదస్సు

టీజీ ఎఫ్ డీసీ డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి

నెన్నల,(మంచిర్యాల) నేటి ధాత్రి:

 

 

నీలగిరి వనాలతో ఎన్నో లాభాలున్నాయని,వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) కాగజ్ నగర్ డివిజనల్ మేనేజర్ శ్రీ శ్రావణి అన్నారు.తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నీలగిరి తో నా స్నేహం పేరిట నెన్నెల మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గురువారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డివిజనల్ మేనేజర్ మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యే కలప లభ్యమవ్వడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయన్నారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ విడుదల చేస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు,ఆ తర్వాత కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు.ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి నీలగిరి వనాలను రక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్,బెల్లంపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ వి. సునీత,డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దుర్గం నరేష్,వాచర్లుమొండి,సత్తయ్య,రవి సిబ్బంది షాహిద్,సంజీవ్ లు పాల్గొన్నారు. ‎

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

తొర్రూర్ ( డివిజన్ ) నేటి ధాత్రి

 

ఎన్. పి.డి. సి.ఎల్ పరిధిలో మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నాంచారి మడూర్ గ్రామంలోని రైతు వేదికలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ & సేఫ్టీ ఆఫీసర్ శ్రీ పెద్ది రాజం మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు మరియు వినియోగదారులు తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలు మరియు సూచనలు విపులంగా తెలియజేశారు. తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో తొర్రూరు డివిజన్ పరిధిలో జరిగిన విద్యుత్ ప్రమాదాల వల్ల 16 గురు మనుషులు మరియు 30 జంతువులు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదాలకు కారణం రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే జరుగుతున్నాయని కావున నిత్యావసరమైన విద్యుత్ వినియోగించుకుంటున్నప్పుడు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లలో బట్టలు ఆరేసుకోవటానికి బిగించుకునే జి.ఐ. వైర్లు పై కప్పుగా వేసుకునే ఇనుప రేకులకి షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని ప్రమాదాలు జరిగాయని అలాగే ఆకేరు వాగు వెంట ఉన్న గ్రామాల్లోని చాలామంది యువకులు చేపలు పట్టడానికి కరెంటును వినియోగించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతులు తమ పొలం చుట్టూ జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి బిగించుకునే విద్యుత్ కంచె వలన కూడా ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని ఈ విధంగా చేయటం చట్ట ప్రకారం నేరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ శ్రీ సి.ఎస్. చలపతిరావు, చిన్న వంగర మరియు తొర్రూరు అసిస్టెంట్ ఇంజనీర్లు , విద్యుత్ సిబ్బంది, రైతులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం.

జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళలకు షీ టీం బృందం అవగాహన కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్

సిరిసిల్ల టౌన్  (నేటిధాత్రి):

 

విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,పాఠశాలల్లో విద్యార్థినిలకు గ్రామాల్లో,పని చేసే ప్రదేశాల్లో మహిళలకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ మహిళ చట్టలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 03 FIRలు,05 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియెక్క తల్లిదండ్రుల,కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.

District SP.

 

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…విద్యార్థినులు,మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని , ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని.

ప్రధానంగా మహిళలు,విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని,వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న,ర్యాగింగ్‌ లాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యాసంస్థలల్లో కానీ,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్100 లేదా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ గారు తెలిపారు.

 

లీగల్ అవేర్నెస్ క్యాంపు…

లీగల్ అవేర్నెస్ క్యాంపు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో లీగల్ అవేర్నెస్ క్యాంపును ప్యానెల్ అడ్వకేట్ సోమశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో కనీస వేతన చట్టం, పనిప్రదేశాల్లో భద్రత, మహిళల లైంగిక వేదింపుల నిరోధక చట్టంపై వివరించారు. ఉచిత న్యాయ సేవా సహాయంపై అవగాహన కల్పించారు.

భూభారతిపై అవగాహన కార్యక్రమం.

భూభారతిపై అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమాన్ని.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టంలో వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్.చట్టంపై తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొని చట్టంలోని వివిధ అంశాలను ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని. అలాగే శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలోని గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని పెండింగ్లో ఉన్న సాదా బైనామ పరిష్కారం కోసం భూభారతి. చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పి ఓ టి. ఎల్.టి.ఆర్ సీలింగ్ చట్టాలు ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేయడం జరుగుతుందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఒకేరోజు ఉంటాయని కొనుగోలు తనక బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంకల్పిస్తే తాసిల్దార్ .రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులను మార్పు చేసి పట్టాదారు పాసుబుక్ జారీ చేస్తారని .స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిసియేషన్ .ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని దస్తావేజుతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని తెలియజేశారు చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్న భూభారతిలో పరిష్కరించవచ్చని పేర్కొంటూ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారిని నియమించడం జరుగుతుందని తద్వారా రైతులకు భూభారతిలో ఎటువంటి సమస్యలు వచ్చిన పరిష్కరించడానికి చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి అవగాహన కార్యక్రమానికి రైతులు ఆర్డీవో రాధాబాయి ఎమ్మార్వో జయంత్ కుమార్ గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్.నేరెళ్ల నరసింహం గౌడ్.ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు.

ఉపాధి కూలీలకు షీ టీం అవగాహన సదస్సు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ శివారులో జరుగుతున్న 100 రోజుల పని తీరులకు షీ టీం సభ్యులు అవగాహనా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.ఈ సందర్బంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ… ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించేది షి టీం ప్రతి ఒక్కరు వారి పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్
గురించి తెలపాలని,మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చెప్పారు.అలాగే సైబర్ నేరాల గురించి వచ్చిన ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు షీ టీం బృందాలు సహాయం చేస్తాయని అన్నారు. ఆకతాయిల నుండి మరి ఏ ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేయాలనుకుంటే 6303923700 నెంబర్ సంప్రదించాలని కోరారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఫిల్డ్ ఆఫీసర్ గుమాస మల్లేష్, షీ టీం సభ్యులు జ్యోతి,శ్రీలత, భరోసా సెంటర్ సబ్ ఆర్డినేటర్ పుష్పాలత,గ్రామస్థులు పాల్గొన్నారు.

భూ-భారతి చట్టంపై నిర్వహించే.!

భూ-భారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సు వాయిదా
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఈనెల 23న నిర్వహించాల్సిన భూ-భారతి చట్టం అవగాహన సదస్సును అనివార్య కారణాల వలన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు ఈనెల 24న నిర్వహించనున్నట్లు తహసిల్దార్ జాలీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మండలంలోని రైతులు ఇట్టి విషయాన్ని గమనించి ఈ నెల 24న మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించే భూ-భారతి చట్టం అవగాహన సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై, వారికున్న భూ సమస్యలను నివృత్తి చేసుకోగలరని ఆమె తెలిపారు.

భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ.

భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ.

రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో మంగళవారం భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్‌డీవో మహేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ భూవ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, భూవివాదాలను తగ్గించడం, రైతులకు భద్రత కల్పించడం ఈకొత్త చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. భూభారతి యాప్ ఉపయోగం, భూమి హక్కులపై పూర్తి సమాచారం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ధరణి వ్యవస్థలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయని, రైతులకు న్యాయం జరగలేదని, రైతులు తమ హక్కులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, దీనివల్ల ఆత్మహత్యలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో సాక్షాత్తు ఓతహసిల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కూడా జరిగిందన్నారు. కొత్త భూభారతి చట్టం రైతులకు అండగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, బోనస్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ వంటి పునరుద్ధరణ చర్యలు తీసుకువస్తోందని, రాష్ట్రంలో ఎనభై నుండి తోంభై శాతం రైతులు లబ్ధి పొందేందుకు ఇరవై ఒకవేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సాంకేతిక సమస్యల వల్ల కొందరికి రుణమాఫీ ఆలస్యం అవుతోందని, త్వరలో రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ కానున్నాయని పేర్కొన్నారు. కొత్త చట్టం అమలైనందున రైతుల ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో అనేక సంక్షేమ పథకాలు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుందని తెలిపారు. ఈసదస్సులో అధికారులు, గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని చట్టంపై సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్ కిరణ్, తహశీల్దార్ వెంకటలక్ష్మి, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మెరవేని తిరుమల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్, ఎంపీడీవో రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలో.!

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలోలో ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా
గోపాలపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నరని వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డీ నేటర్ వెంకటేష్ ఒక ప్రకటన లోతెలిపారు

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన.!

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలోలో ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా
గోపాలపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నరని వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డీ నేటర్ వెంకటేష్ ఒక ప్రకటన లోతెలిపారు

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

* సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు 1వ వార్డు రగుడు లోని సిరిసిల్ల సెస్ విద్యుత్ సంస్థ ద్వారా రాబోయే వర్షా కాలం ద్రుష్టిలో ఉంచుకోని సెస్ వినియోగ దారులు అందరు కరెంట్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొనగలరని తెలియజేయడం జరిగినది.పొలాల దగ్గరమరియు ఇంటి దగ్గర సెస్ ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సెస్ సిబ్బంది కి వెంటనే తెలియజేయాలని.రైతలు స్వంత నిర్ణయం తో ట్రాన్స్ఫర్మర్ బంద్ చేయడం స్టార్ట్ చేయడం వంటివి పనులు చేయకూడదని. అలాగే ఏదైనా సమస్య వస్తే సెస్ సిబ్బంది చూసుకుంటుందని తెలిపారు.ఇది వరకు చాలా ప్రమాదాలు జరిగినవి.ఇక పై అలా జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకొని ఏ సమస్య అయినా సెస్ సిబ్బంది కి తెలుపగలరు. అని సెస్ DE. రామ సుబ్బారెడ్డి, AE. పద్మ తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు మరియు సెస్ సిబ్బంది పాల్గొన్నారు.

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి.

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ.. తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడుంపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా.

పరకాల పట్టణంలో అగ్నిప్రమాదాల అవగాహనా

కాలనీలలో అగ్నిప్రమాదాల గురించి వివరించిన ఫైర్ సిబ్బంది

పరకాల నేటిధాత్రి.

 

జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 17 ఏప్రిల్ రోజున పరకాల అగ్ని మాపక కేంద్ర అధికారి వక్కల భద్రయ్య ఎస్ఎఫ్ఓ మరియు సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణ కుమార్,ఎఫ్ఎం సత్యం,దిలీప్ డ్రైవర్ ఆపరేటర్ సత్తయ్య లు సౌందరయ్య హాస్పిటల్ లో అగ్ని ప్రమాదాల ముందస్తు జాగ్రత్తలు నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ ఫైర్ అయిన సందర్భంలో పేసెంట్ ప్రాణాలు కాపాడే పద్ధతులు,వృద్ధులు, చిన్న పిల్లలను ముందుగా ఏవిధంగా కాపాడి రక్షించాలి అనే మెలుకువల గురించి తెలియజేశారు.గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు, నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,ఈత కు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని వాటి నివారణ చర్యల గురించి,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

Fire Accident.

మాధారం కాలనిలో కాలానివాసులకు వివరించిన ఫైర్ సిబ్బంది

అగ్ని మాపక కేంద్ర అధికారి మరియు సిబ్బంది ఆధ్వర్యంలో మాదారం ఏరియాలోని ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు,నివారణ చర్యలు,విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు,చెరువులు, బావులలో ఈత సరదాకు వెళ్లి ప్రమాదాలుకొని తెచ్చు కుంటున్నారని,వడగాలులు, విద్యుత్ ప్రమాదాలు నివారణ చర్యలు గురించి వివరంగా తెలియచేస్తూ అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్ లో మంగళ వారం మధ్యాహ్నం అగ్ని మాపక శాఖ అధికారులు సిబ్బంది ప్రయాణీకులకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం.

అల్లిపూర్ లో మహిళా శిశు సంక్షేమశాఖ అధర్యంలో చిరుధన్యాలు, స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం

రాయికల్ నేటి ధాత్రి. . .

 

ఏప్రిల్ 12. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలోని రాయికల్ మండలం, అల్లీపూర్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమశాఖ జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత అధర్యంలో చిరుదాన్యాలు (కొర్రలు,రాగులు,ఉదలు,అరికెలు,సామలు,సజ్జలు,జొన్నలు,అండ్రుకొర్రలు, మొదలైనవి) స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Food

పోషణ పక్షంలో భాగంగా ఈరోజు స్థానిక ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయడం పై ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని షెడ్యూల్ రావడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ మమత గారు మాట్లాడుతూ స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ప్రత్యక్షంగా చూపించి వాటితో ఏ ఏ అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయవచ్చునో ప్రత్యక్షంగా తయారు చేసి చూపించడం జరిగింది మరియు మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన కలిగే లాభాలను లబ్ధిదారులకు, గ్రామస్థులకు ఒక్కొక్క దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత, సెక్టార్ సూపర్వైజర్ రాధ, మెడికల్ ఆఫీసర్, జెండర్ స్పెషలిస్ట్ గౌతమి, సఖి కేంద్రం రజిత, అంగన్వాడీ టీచర్లు, గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

26న జరిగే జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం.

ఎంపీడీవో జై శ్రీ

చిట్యాల, నేటి ధాత్రి ;

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రోజున ఎంపీడీవో జయ శ్రీ అధ్యక్షతన జాబ్ మేళపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 26న భూపాల పెళ్లిలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో నిర్వహించే జాబ్ మేళను మండలంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారికి మండలంలో ఉన్న అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి నిరుద్యోగులను అధిక సంఖ్యలో 26న జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలని మండల గ్రామ అధికారులను కోరినారు ,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ హేమ, ఎంపీ ఓ ,రామకృష్ణ, ఎస్సై, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులు ఐకెపి ఏపిఎం, సీసీలు ,వివోఏలు, అగ్రికల్చర్ అధికారులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ ఏఈ మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు.

నిషేధిత పత్తి విత్తనాలపై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి

 

మందమర్రి మండలం వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వారు ఆధ్వర్యంలో సారంగపల్లి గ్రామ పంచాయతీలో కార్యాలయంలో రైతు లతో నిషేధిత గ్లసిల్ పత్తి విత్తనాల వినియోగం నిషేధిత గ్లోపోనేటు వినియోగం వల్ల కలుగు నష్టాలపై అవగాహన ఈ కార్యక్రమం పోలీసు వారు మరియు రెవెన్యూశాఖ వ్యవసాయ శాఖ నిర్వహించిన ప్రజలకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించరు ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ ఏవో కిరణ్మయి ఏ ఈ ఓ తిరుపతి మండల ప్రజా పరిషత్ ఆఫీసర్ రాజేశ్వర్ పంచాయతీ కార్యదర్శి సవ్య పోలీస్ శాఖ మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఏ.స్ఐ మజీద్ ఖాన్ పోలీస్ సిబ్బంది మాజీ సర్పంచ్  పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగహన
• మండల ఎంపీడీఓ రాజిరెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రజలు ఇందిరమ్మ ఇండ్ల పై అధిక డబ్బు వెక్షించి అప్పుల పాలు కావద్దని మండల ఎంపీడీఓ రాజీరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడారు… ప్రజలు ఇండ్లకు అధిక డబ్బు పెట్టి అప్పులపాలు కావద్దని ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులతో ఇండ్లను నిర్మించుకోవలన్నారు. గ్రామంలో 16 ఇండ్ల పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఏపీఓ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, గ్రామస్తులు జీవన్ రెడ్డీ, పిట్ల నర్సయ్య, భూపతి రెడ్డీ, మల్లేశం గౌడ్, ఏనుగంటి పోచయ్య, మమ్మద్ షాయదా, మ్యాదరి రజిత లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version