ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
◆:- మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝఖరాంగం మండల కేంద్రంలో ఎంవీడీవో కార్యాలయం లో ఎంపీడీవో సుజాత మరియు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితులలో ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి వ్యక్తిని ప్రాణాపాయం నుండి ఏ విధంగా తప్పించవచ్చో అవగాహన కల్పించారు. ట్రైనర్స్ ఎం ఎల్ హెచ్ పి మురళీకృష్ణ, హెచ్ ఈ ఓ గోవర్ధన్, సిహెచ్ సుధాకర్, ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు అంగన్వాడి టీచర్స్ గ్రామపంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
