పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన..

పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

వనపర్తి నేటిదాత్రి

 

బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వనపర్తి, పెబ్బేరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను తనిఖీ చేశారు. వనపర్తి మండలంలోని నాచహళ్లి ఐకేపీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించార అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడారు. వడ్లు తాలు, పొల్లు లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.
పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి వెళ్ళిన అదనపు కలెక్టర్, అక్కడ ఏఈఓ జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సీరియల్ పద్ధతిలో వరుస క్రమంలో టోకెన్లు జారీ చేయాలని ఏఈఓను ఆదేశించారు. పెబ్బేరు మండలంలోని సూగురు గ్రామంలోని ఎస్.డబ్ల్యూ.సి గోదామును సందర్శించి,అక్కడ డెలివరీ అవుతున్న సీఎంఆర్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యం వస్తే వెంటనే తిరస్కరించాలనివాటిని సంబంధిత మిల్లుకు వెనక్కి పంపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చివరగా పెబ్బేరు మండలంలోని సత్యసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.మిల్లు యజమానితో మాట్లాడి, యాసంగి 2024-25 సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను ఎటువంటి జాప్యం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లు యజమానిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగన్ పెబ్బేరు తహసీల్దార్ మురళి అధికారులు ఉన్నారు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతులను ఇబ్బంది చేస్తే కఠిన చర్యలు తీసుకుం టాం

జిల్లా కలెక్టర్ సత్యశారద

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు.

ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు

ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి….

ప్రభుత్వం వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్

చందుర్తి, నేటిధాత్రి:

 

వరి కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం సోచనీయం అని చందుర్తి మండల బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్ అన్నారు.
అకాల వర్షాలు కురుస్తూ రైతులు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని ఇకనైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిచిన ధన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం…

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

మార్కెట్లోకి సోయాబీన్ – రైతులు పరేషాన్…!

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు.. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్ర స్థాయిలో అది కనిపించడం లేదు. అరు గాలం వ్యయ ప్రయాసాలకు ఓర్చి పంటలు పండించిన రైతులు ప్రభుత్వాలు సకాలంలో నాఫడ్ లేదా మార్క్ ఫడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పంటను కొనుగోలు చేయక పరేషాన్లో ఉన్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట చేతికి వచ్చింది. మండలంలో ఈ సీజ న్లో 4721 ఎకరాలలో రైతులు సోయాబీన్ పంట వేశారు. ఈ సంవత్సరం వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో సోయాపంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. చివరకు ఉన్న పంటను రాసులు పట్టినా ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఒక ఎకరంలో సోయాబీన్ పంట పండించడానికి సుమారు 25వేయిల రూపాయల పెట్టుబడి అయితుందని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఎకరానికి 6 లేదా ఏడు క్వింటాళ్ళ దిగు బడి మాత్రమే వస్తుందని ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు అమ్మితే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు సోయా బీన్ పంటను పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. చేతికి వచ్చిన పంటను అమ్మకుని పెట్టుబ డులకు తెచ్చిన అప్పులు చెల్లిద్దామంటే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించా ల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దిగుబడి తగ్గి మార్కెట్ లో ధర లేకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మద్దతు ధరకు అమ్ముకుని కొంతలో కొంతైనా ఉపశమనం పొందవచ్చని రైతులు భావిస్తున్నారు. సోయా బీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ కు 5328 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారలు క్వింటాల్ కు3800 నుండి 4000 రూపాయల వరకు ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ వద్ద సుమారు 1500 రూయాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతు
న్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు. ప్రాంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రాంభించాలి

జీర్లపల్లి సోయాబీన్ పంట చేతికి వచ్చిందని మార్కెట్లలో గిట్టుబాధర లభించ డంలేదు. 14 ఎకరాలు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సోయాబీన్ పంటను పండించాను. ఈ సీజన్ లో అధిక వర్షాలు పడి పంట దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే కొను గోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారం భించి గిట్టుబాటు ధరకల్పించాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version