“ఓటర్ గుర్తింపుకు ఆధార్ అనుమతి: సుప్రీంకోర్టు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T124310.603.wav?_=1

 

ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్ లో ఓటర్గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి…

◆:- దాంతో ఓటర్‌ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే

◆:- ఆధార్‌ సరైనదో కాదో తేల్చే హక్కు ఈసీకి ఉంది

◆:- కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం

◆:- ఆధార్‌ పౌరసత్వ గుర్తింపు కాదని స్పష్టీకరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఆధార్‌ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్‌లో ఓటర్‌గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌ పరిగణనలోకి తీసుకునే 11 డాక్యుమెంట్లకు అదనంగా 12వ డాక్యుమెంట్‌గా
ఆధార్‌ కార్జును చేర్చాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా ఆధార్‌ను ఈసీ అధికారులు ఆమోదించడం లేదని ఆర్జేడీ, ఎంఐఎం ఇతర పార్టీలు పిటిషన్‌ దాఖలు చేయడంతో సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్‌గా గుర్తించేందుకు ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా సమర్పించడాన్ని ఆమోదించాలని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కింది స్థాయిలో అధికారులంతా ఆధార్‌ను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆమోదించాలని ఆదేశాలు జారీ చేయాలని, తమ వెబ్‌సైట్‌లలో ఈ విషయం స్పష్టం చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అదే సమయంలో ఆధార్‌తో పాటు ఓటర్‌ సమర్పించిన డాక్యుమెంట్లు ఏవైనా సరైనవా కాదా తనిఖీ చేసే అధికారం ఈసీకి ఉన్నదని కోర్టు స్పష్టం చేసింది ఆధార్‌ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్జు కాదని ఆధార్‌ చట్టంలోనే ఉందని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 23(4) ప్రకారం మనిషిని గుర్తించేందుకు అది ఉపయోగపడుతుందని తెలిపింది. ఆధార్‌ కార్డును కూడా ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన హామీ పత్రాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది.

ఆధార్‌ ఓకే అంటే షోకాజ్‌ ఇచ్చారు

ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు మూడుసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ నియోజకవర్గ స్థాయి ఓటర్ల నమోదు అధికారులు(ఈఆర్‌వో), బూత్‌ స్థాయి అధికారులు ఆమోదించడం లేదని, బూత్‌ స్థాయి అధికారి ఆధార్‌ను అంగీకరించినందుకు ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారని ఆర్జేడీ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆధార్‌ కార్డును ఆమోదించాల్సిందిగా ఇంతవరకూ ఈసీ తమ కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదని ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ వాదిస్తూ ఆధార్‌ను పౌరసత్వానికి రుజువుగా భావించలేమని చెప్పారు. కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ, పౌరసత్వాన్ని గుర్తించే బాధ్యత ఈసీది కాదని అన్నారు. ఒక వ్యక్తి పౌరుడా కాదా అన్న విషయం నిర్ణయించే అధికారం ఈసీకి ఉన్నదని, ఈ విషయం స్పష్టం చేయాలని రాకేశ్‌ ద్వివేదీ సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఈసీ కోరిన 11 డాక్యుమెంట్లలో పాస్‌పోర్టు, పుట్టినతేదీ సర్టిఫికెట్‌ తప్ప మిగతా వేవీ పౌరసత్వాన్ని ధ్రువీకరించవని న్యాయమూర్తి బాగ్చీ ఎత్తి చూపారు. వాదోపవాదాల తర్వాత చివరకు రేషన్‌ కార్డు, ఫోటో గుర్తింపు కార్డుతో పాటు ఆధార్‌ను 12వ డాక్యుమెంట్‌గా చేర్చి ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు రుజువుగా స్వీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే ఆధార్‌ కార్డు సరైనదో కాదో తనిఖీ చేసుకోవచ్చని తెలిపింది.

రువుల కోసం పట్టా పాస్ బుక్కు ఆధార్ జిరాక్స్ లు తీసుకురావాలి…

రువుల కోసం పట్టా పాస్ బుక్కు ఆధార్ జిరాక్స్ లు తీసుకురావాలి

గణపురం సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

 

గణపురం మండల కేంద్రంలో గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘం ఖరీఫ్ సీజన్ గాను ఎరువులు తీసుకునే రైతులు దయచేసి వారి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని సొసైటీ ద్వారాఎరువులు తీసుకోవాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాము పట్టా పాస్ బుక్ లేని రైతులు మండల వ్యవసాయ అధికారి లేదా గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా సంతకం పెట్టించుకుని అట్టిపత్రాలను సొసైటీకి తీసుకొని వచ్చి ఎరువులు తీసుకోవాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాను 15 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం వల్ల రైలు పట్టాలు కొట్టుకపోవడం రహదారులు తెగిపోవడం వల్ల యూరియాకు కొన్ని రోజులు అంతరాయం ఏర్పడ్డాది పది రోజుల నుండి ప్రతిరోజు ఒక లారీ చొప్పున యూరియాను దిగుమతి చేసుకుంటున్నాము రైతు మహాశయులారా యూరియా కొరత ఉన్నదని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంపై వ్యతిరేకత భావం ఏర్పడే విధంగా పనిగట్టుకుని లేని యూరియా కొరతను సృష్టిస్తున్నారు రైతులు వారి మాయ మాటలు నమ్మవద్దని రైతులను చైర్మన్ గా వేడుకుంటున్నాను మనకు యూరియా సరిపడే విధంగా అందించడానికి భూపాలపల్లి శాసనసభ్యులు
గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో ప్రతిరోజు యూరియా రావడం జరుగుతుంది రైతులు ఎటువంటి అపోలో నమ్మకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

ఎరువుల షాపులపై కలెక్టర్ తనిఖీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51-3.wav?_=2

ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు

ఆధార్‌లో సమూల మార్పులు..

ఆధార్‌లో సమూల మార్పులు

ఆధార్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు…

  • వివరాల్లోంచి తండ్రి/భర్త పేరు తొలగింపు
  • పుట్టిన తేదీకి బదులు పుట్టిన సంవత్సరం మాత్రమే!
  • యూఐడీఏఐ ఉత్తర్వులు.. ఇప్పటికే అమల్లోకి

ఆధార్‌లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. మొబైల్‌ సిమ్‌, బ్యాంకు ఖాతా, పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్‌ కార్డులపై ఇక నుంచి తండ్రి/భర్త పేరు ఉండదు. ఆధార్‌లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు. నిజానికి మొదట్లో తండ్రి/భర్త పేరు అని ఉండేది. తర్వాత కేరాఫ్‌ అని మార్చారు. ఇప్పుడు పూర్తిగా తొలగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి కొత్త ఆధార్‌ నమోదులో తండ్రి/భర్త వివరాలు సమర్పించాలని కోరబోమని యూఐడీఏఐ తెలిపింది. అలాగే పుట్టినతేదీకి బదులు ఇకనుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్నే నమోదు చేస్తారు. దీనికి సంబంధించి యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ హిమాన్షు ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మార్పులను గతంలోనే పేర్కొనగా.. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే తండ్రి/భర్త పేరు ఉన్న ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి. అలాగే పుట్టినతేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది. 18 ఏళ్లలోపు ఉండే పిల్లల (మైనర్ల) ఆధార్‌లోనే మాత్రమే కేరాఫ్‌ స్థానంలో వారి తండ్రి పేరు ఉంటుంది.

ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.

ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు

రాష్ట్రంలో నేటి నుంచి నమోదు

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలిపారు.కాగా రాష్ట్ర వ్యాప్త నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని అని మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏ.డీ.ఏ మాట్లాడుతూ రైతుల విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చని అన్నారు. ఆధార్‌ సంఖ్యతో అనుసంధానమైన, పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారని పేర్కొన్నారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోందని వాటికి సరైన గణాంకాలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించిందని ఏడీఏ వివరించారు.ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు,పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయని, రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదని దీంతో వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారిందని పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్‌ తెలంగాణ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.కాగా ప్రక్రియ పట్ల మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు శిక్షణ ఇచ్చిందన్నారు.

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు వ్యవసాయ శాఖ..

Agriculture

 

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కోసం భూయాజమాన్య పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, ఫోన్‌ నంబర్‌తో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.కాగా ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని ఏడీఏ దామోదర్ రెడ్డి తెలిపారు.ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు..

రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు..రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొందని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version