స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..
ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ
రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి యాజమాన్యం మూడుసార్లు జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్ జారీ చేసి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో పిట్ సెక్రటరీ ఎన్. రమేష్ అధ్య క్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ మోటాపలుకుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం గతంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమస్యలను పరిష్కరించకపోవడంతో సింగరేణి సి.ఎం.డితో జరిగే స్ట్రక్చర్ మీటింగ్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. అట్లాగే యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35శాతం లాభాలవాటా ఇవ్వాలని కోరారు. గతంలో సింగరేణిలో ఎన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం ఎక్కువైందని దాంతో కార్మిక సమస్యలు పెండింగ్ పడుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ గేట్ మీటింగ్ లో బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోషం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ జి. రవికుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎన్, సతీష్, టెంపుల్ కమిటీ చైర్మన్ ధనుంజయ్, సలహాదారులు రమేష్, పిట్ కమిటీ సభ్యులు. ఎన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.