వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం…

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version